వేటూరి వారి కలం నుండి జాలువారిన ఒక పాట దాదాపు రోజూ ఒకసారైనా వింటూ ఉంటాను.సాహిత్యం, సంగీతం, గాత్రం,చిత్రీకరణ అన్నీ సమ పాళ్ళల్లో కుదిరితే పాట ఎంత అందంగా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణ ఈ పాట.అంత అందమైన పాట ఖచ్చితంగా పాడుతా తీయగా కార్యక్రమంలో పాడే ఉంటారు అని వాళ్ళు పాడినవి విందామని యూట్యూబ్ చూస్తుంటే ఒక ఎన్నారై పాడిన ఎపిసోడ్ కనపడింది.ఆ గాయని/గాయకుడి పేరు,పాట వివరాలూ ఇక్కడ అప్రస్తుతం కానీ కర్ణ కఠోరం అనేది వారు పాడిన విధానానికి సరైన పదం అనచ్చు. కానీ బాలూ గారూ, మీరు వాళ్ళని ఆకాశానికెత్తిన విధానం చూస్తే మీ డబుల్ స్టాండర్డ్స్ అర్ధమయ్యాయి.
ఓ రెండేళ్ళ క్రితం అనుకుంటా, ఇండియాలో పిల్లల ఎపిసోడ్లో వాళ్ళు పాడిన పాటల్లోని చిన్ని చిన్ని తప్పులని వీర విహారం చేస్తూ వర్ణించిన విధానం చూస్తే ప్రేక్షకులైన మాకే గుండె కలుక్కుమంది.ఇంక ఆ చిన్ని గుండెలు ఎంత బాధ పడి ఉంటాయి పాపం.చిన్న పిల్లలనే కాదు, పెద్ద వారి తప్పులని కూడా అలాగే చీల్చి చెండాడెస్తారు మీరు ఇండియా ఎపిసోడ్లలో.
ఇక్కడ పిల్లలు లేదా పార్టిసిపెంట్స్ చేసే చిన్ని దోషాలని మన్నించలేని మీరు ఎన్నారై ఎపిసోడ్లలో మాత్రం ఎన్నారై పిల్లలు లేదా పెద్దవారు ఏది పాడినా అధ్భుతం అంటే ఎలాగండీ?"ఆ మెరక"లో ఏదో తెలుగు పాట పాడటమే గొప్ప కాబట్టి అలా అంటున్నాను అంటే ఇంక మేము ఏమీ అనలేము.
అలాగే మీరు వస్త్ర ధారణ గురించీ, తెలుగుదనం గురించీ చేసే కామెంట్లు.మీరు విగ్గు పెట్టుకోకుండా, పూల చొక్కాలు వేసుకోకుండా కేవలం తెలుగుదనమైన పంచె కట్టుతో మాత్రమే అన్ని సినిమా కార్యక్రమాల్లోనూ, ఇతర పాటల కార్యక్రమాల్లోనో కనపడరు కదా.అలాంటప్పుడు ఇతరులని వారి వస్త్ర ధారణ మీద కామెంటితే ఎలాగండీ?మీ అంతటి వారు ఆచరించి చూపితేనే కదా మిమ్మల్ని అనుసరించేవారికో అభిమానించే వారికో ఒక మార్గం అంటూ ఏర్పడేది?
మీ గొంతు ఇప్పటికీ మా చిన్నప్పటి బాలూ గొంతు లాగే ఉంది అని మా లాంటి వాళ్ళకి మీరంటే విపరీతమైన గౌరవం.ఇలా ద్వంద్వ ప్రమాణాలతో మిమ్మల్ని మీరు చులకన చేసుకోకండి ప్లీజ్..

4 comments:
Agree with your views. SP Balu garu has to answer the issues raised by you. I don't agree with your observation that SPB sir voice has not changed. It has changed a lot. Nowadays it sounds strained and apa sruthi due to ageing. It is quite natural. He is the best playback singer in India for many years.
వృద్ధ నారీ పతివ్రతా
Hmmm...ఇంత ఆలోచనే....మంచిదే లెండి ....హవ్వ మన బాలూ గారినేనా అలా కడిగేయచ్చా... అని బుగ్గలు నొక్కుకున్నా ఫర్వాలేదండోయ్ !! ఇలాగే రాస్తూ ముందుకు పోతా ఉండండీ!!!
బహుశా రెండేళ్ల క్రితం అందరినీ అలా విమర్శించి విమర్శించి విమర్శలపాలై మనసుమారి ఇప్పుడు ఎవరేం పాడినా బ్రహ్మాండంగా ఉందంటున్నారేమో!
Post a Comment