సినిమా పేరు వినగానే ఏదో అలా గాలి వాటం గా వచ్చి పోయే తెలుగు సినిమాలలో ఒకటి అనిపించింది.ఆ మధ్య థ్రిల్లర్, వగైరా అని ప్రెస్ మీట్లో ఊదరగొట్టిన సినిమాని తీరా చూస్తే ఒక సీ గ్రేడు సినిమా అయ్యేసరికి ఈ సినిమా పెద్దగా ఆకర్షించలేదు. ఆ మధ్య నారా వారి అసుర చూసాకా యూ ట్యూబులో కమర్షియల్గా హిట్టు కాకపోయినా కొన్ని మంచి సినిమాలు దొరుకుతాయి అని అర్ధమయ్యింది.
అలా చూసినదే నా నీడ పోయింది సార్ సినిమా. అనవసర కామెడీ లేదు, ప్రతీ సినిమాలో ఒకే పాత్రతో విస్గించే తాగుబోతు కమెడియన్ లేడు,అసలు పేరున్న వారెవరూ లేరు. కానీ పట్టు సడలని కధనం కొత్త నటుల నటనలో లోపాలని వెదకనివ్వదు.రచయిత ఆనంద్ రవి నటించి నిర్మించిన ఈ సినిమా తప్ప చూడాల్సిన సినిమా.
కమర్షియల్గా ఎంత హిట్టో తెలీదు గానీ ఒక గొప్ప సినిమా అనదగ్గదే ఇది. ప్రతీ సినిమానీ చీల్చి చెండాడేసే విమర్శకుల దృష్టిలో ఈ సినిమా ఎందుకు పడలేదబ్బా? అసలు ఈ మధ్య కాలంలో రివ్యూల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కదా. ఎవరో నమ్మకస్తులు చెప్తే తప్ప నమ్మలేని రివ్యూలు ఇవన్నీ.
2 comments:
dear sir very good blog and very good telugu content
Latest Telugu News
నిజం చెప్పారు, అంతా భజన బృందాలే కదా, చాలా మంచి, నీట్ గా తీసిన సినిమా.
Post a Comment