Thursday, June 20, 2013

పొగ దుప్పట్లో సింగపూర్


పొగ మంచు కాదు, సింగపూర్ ఇప్పుడు పొగ గుప్పెట్లో చిక్కుకుంది.పొరుగు దేశమైన ఇండొనేషియా లోని సుమత్రా అడవుల్లో ఫారెస్ట్ ఫైర్ వల్ల రాజుకున్న పొగ సింగపూర్ ని కమ్మేసింది.ఎప్పుడూ ఎండ వానా తప్ప ఇంకొకటి ఎరగని సింగపూర్ వాసులని ఈ పొగ భయభ్రాంతులని చేస్తోందనటం లో సందేహం లేదు.
నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ ప్రతీ గంటకీ తమ వెబ్ సైట్ లో ఇస్తున్న సమాచారం ప్రకారం ఈ ఉదయం 11 గంటలకి పొల్యూషన్ లెవెల్ సింగపూర్ లో 400 కి చేరింది.ఈ క్రింది చిత్రం లో పీ ఎస్ ఐ విలువలు, దానిని బట్టి గాలి నాణ్యతని నిర్ధారించే పట్టిక ఇచ్చారు చూడండి.


The free Dinctionary లో Haze ఇలా నిర్వచించారు
 Atmospheric moisture, dust, smoke, and vapor that diminishes visibility

ఈ పొగ ఇండోనేషియా లో ఇల్లీగల్ ఫారెస్ట్ ఫైర్స్ వల్ల వస్తోంది అని సింగపూర్ అంటోంటే(Source:http://www.ibtimes.com/singapore-haze-air-quality-classified-hazardous-due-illegal-forest-fires-indonesia-photos-1315667), మా దగ్గర సింగపూర్ వ్యాపారవేత్తలు చాలా మందికి పాం ఆయిల్ ప్లాంటేషన్స్ ఉన్నాయి, వాళ్లే అని కాదు కానీ అసలు కారణాన్ని అన్వేషిస్తున్నాము అని ఇండోనేషియా ప్రభుత్వం చెప్తోంది.

ఒక్కసారిగా వాతావరణం లో జరిగిన మార్పులని చూసి భయ భ్రాంతులైన సింగపూర్ వాసులకి ఆఫీసులు మాస్కులు సప్లై చేస్తున్నాయి.ఎప్పుడూ లేనిది మెక్ డోనాల్డ్స్, పిజ్జా హట్ లాంటి ఫాస్ట్ ఫుడ్ సంస్థలు తమ డెలివరీ సర్వీసులని నిరవధికం గా వాయిదా వేసేసాయి.


అన్ని అవుట్ డోర్ యాక్టివిటీస్ ని సస్పెండ్ చేసేసారు. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోం ని అమలుచేస్తుటే కొన్ని సంస్థలేమో గర్భిణీలు, ఆస్త్మా తదితర శ్వాస కోస సమస్యలు ఉన్న వాళ్ళని ఇంట్లో నుండి పని చెయ్యమంటున్నాయి.

ఇక్కడ మాకు బందులు అవీ ఎలాగూ ఉండవు, ఇలాగే ఉంటే ప్రభుత్వం STOP WORK ORDER ఇస్తుందేమో అని ఆశగా ఎదురు చూస్తున్నాను.


 ఎంతో దూరం నుండి వచ్చిన టూరిస్ట్ ల పరిస్థితి చూస్తే పాపం అనిపిస్తోంది.లేజర్ షోస్,ఇతర అవుట్ డోర్ షోస్
 వంటివి నిరవధికం గా రద్దు చేసారు..ఫోటోలు తీసుకుందామన్నా అంతా మసక మసక..ఈ పొగ ఎంత దారుణం గా ఉంది అంటే ఆఫీసులో కూడా కాలిన వాసన వస్తోంది, కళ్ళు మండుతున్నాయి కూడా.. అయినా ఇండియాలో పీక్ అవర్ ట్రాఫిక్ లో గడిపి వచ్చిన వాళ్ళని ఈ పొగ కాస్త కళ్ళ ని ఇబ్బంది పెట్టడం మినహ మరే విధం గా భయపెట్టట్లేదు.పాపం అసలు పొల్యూషన్ అలవాటు లేని సింగపూరియన్స్ మాత్రం బెంబేలెత్తుతున్నారు.


నిత్యం జాగర్స్ తో కళకళ్ళాడే పార్కులు, బీచ్ లు వెల వెల పోతున్నాయి.

ఇప్పటివరకూ ఒక్క లక్కీ డ్రా కూడా నెగ్గని నేను "తెలుగు సినిమాల్లో తొడ గొట్టటాన్ని పాపులర్ చేసిన హీరో ఎవరు" లాంటి కష్టమైన ఒక ప్రశ్న కి జవాబు రాసి లక్కీ డ్రాలో రేపు జరిగే ఏదో ఫుట్ బాల్ మ్యాచ్ కి టిక్కెట్లు గెలిచాను..కానీ ఈ వాతావరణం అదీ చూస్తోంటే అసలు మ్యాచ్ జరుగుతుందో లేదో డవుటే..హ్హ్మ్మ్.."లక్కీ" విన్నర్ నా కాదా అని అనుమానం వస్తోంది .

ఫేస్బుక్ నిండా ఇవే అప్డేట్స్..పొల్యూషన్ లెవెల్,మాస్కులు,... ఒక సుందరి స్టేటస్ చూడండి.."అబ్బా..కళ్ళు మండుతున్నాయి,కాసేపు నడిచేసరికే ఊపిరి కష్టం గా ఉంది..ఎలాగో అవుతోంది..నేను
 నడవలేకపోతున్నాను..క్యాబ్ తీసుకుని ఇంటికి వెళ్తాను.."


కొంప కాలిపోతున్నా ఫేస్బుక్ లో పెట్టి కానీ ఫైర్ ఇంజన్ కి ఫోను చెయ్యరు ఇలాంటి వాళ్ళు
Photo Courtesy:Google

Tuesday, June 4, 2013

నానాటి బ్రతుకు


నిన్న "నానాటి బ్రతుకు" కధ చదివాకా మనసంతా అదోలా అయిపోయింది.ఈ కధ నిజంగా కదిలించింది నన్ను.నేటి విద్యా వ్యవస్థని కళ్ళకి కట్టినట్లు వర్ణించిన రచయిత "ఆకెళ్ళ శివ ప్రసాద్" గారికి అభినందనలు.చాలా బాగుందండీ మీ కధ.

దాదాపు ఆరేడేళ్ళ క్రితం అనుకుంటా మా ఊళ్ళో ప్రైవేటు స్కూలు ఉపాధ్యాయులు ఇలా ఇంటింటికీ తిరిగి తమ స్కూల్ కోసం మర్కెటింగ్ చెయ్యడం చూసాను. వారి వెతలు చూస్తే మనసు చివుక్కుమంది.ఇంటికి వస్తున్నారు కదా అని వారిని ఎంత మాట పడితే అంత మాట అని కనీసం గురువు కి ఇవ్వాల్సిన గౌరవాన్నైనా ఇవ్వకుండా ప్రవర్తించే పెద్ద వాళ్ళని చూసి అసహ్యం వేసింది. ఇలాంటి సంఘటనలు పిల్లల మనస్తత్వాన్ని ఖచ్చితం గా ప్రభావితం చేస్తాయి.

ఇంగ్లీషు చదువులు ,ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్,చిన్నప్పటి నుండే ఐ.ఐ.టీ లు,ప్లాన్ చేయగలిగే సత్తా ఉన్న తల్లి తండ్రులకి, ప్రవర్తన కూడా అంతే జాగ్రత్తగా నేర్పించాలి అని తెలీదంటే నమ్మగలమా?? ఆ మధ్య ఒక ప్రైవేటు స్కూలు విద్యార్ధిని కలిసాను. వారానికి ఆరు రోజులపాటు,నెలకి రెండు ఆదివారాలు చొప్పున రోజుకి 13 గంటలుట స్కూలు. అమ్మో అన్ని గంటలా ఎందుకు అంటే "ఐ.ఐ.టీ. ఫౌండేషన్ కోర్స్" కదా అని సమాధానం. నీకు ఐ.ఐ.టీ చదవడం ఇష్టం ఉందా అంటే, లేదు అనే సమాధానం వచ్చింది.మరి మారచ్చు కదా మామూలు తరగతి కి అంటే వాళ్ళ అమ్మ కలగచేసుకుని, పిల్లలకి మామూలు తరగతి లో ఉండటం ఇష్టం ఉండదండీ అనగానే ఆ అమ్మాయేమో "ఆ కాస్ట్ బేర్ చెయ్యలేనివాళ్ళే మామూలు క్లాసెస్ లో ఉంటారాంటీ,13 గంటలు బోరే కానీ,నేను మామూలు తరగతి కి మాత్రం మారను" అనగానే నోట మాట లేదు నాకు.

పిల్లలకి డబ్బు, ప్రెస్టీజ్, (కాస్త ఎగువ మధ్య తరగతి వారైతే) విదేశీ యానాలు,స్టేటస్ సింబల్స్ ఇవి తప్ప మన పిల్లలకి వేరేవి నేర్పలేమా??ఇలా పెరిగిన వాళ్ళ చదువులు ఎలా ఉంటాయి?? ఇంటర్ కి రాగానే 15-16 గంటలు రుద్దే హాస్టళ్ళలో పారేసి ఎంసెట్ లో సీటు రాకపోతే డొనేషన్ మెడిసిన్ చదువులు, తలకు మించిన భారమైనా పక్క రాష్ట్రపు ఇంజనీరింగ్ చదువులు..ఎక్కడకి వెళ్తున్నాము మనం??పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాము??

అమెరికాలో కొన్నేళ్లు ఇండి ఇక్కడకి వచ్చిన ఒక మహిళ ఇక్కడి విద్యా వ్యవస్థ, పెరిగిన ఫీజులూ అవీ చూసి చలించిపోయి తక్కువ ఫీజులతో తానే ఒక స్కూలు నెలకొల్పింది.ఎన్నాళ్ళయినా ఒకరో ఇద్దరో తప్ప ఎవరూ చేరలేదు. తెలిసున్న వాళ్ళందరికీ చెప్పినా ఫలితం శూన్యం.ఆవిడ స్నేహితురాలు ఒకావిడ తన పనిమనిషి ఈ స్కూలు గురించి చెప్తే ,"అక్కడ ఫీజులు తక్కువటమ్మా.. ఏమి సదూ సెప్తారో ఏందో" అని సమాధానం వచ్చిందిట.
ఫీజులు ఎక్కువ కట్టించుకుని మధ్య మధ్య లో ఆ ఫీజులూ ఈ ఫీజులూ అని డబ్బులు గుంజి, ఆర్భాటాలు చేస్తేనే "మంచి స్కూలు" అని అందరి గుండెల్లో బలం గా ముద్ర వేయగలిగిన కార్పోరేటు స్కూళ్ళ యాజమాన్యాలు మీరు నిజ్జం గా గ్రేట్.ఏ బిజినెస్ స్కూల్లో చదివారని వారికి ఇన్ని తెలివి తేటలు అసలు??
ఈ కధ చదవని వారి కోసం జూన్ నెల కౌముది లింక్ ఇదిగో