పొగ మంచు కాదు, సింగపూర్ ఇప్పుడు పొగ గుప్పెట్లో చిక్కుకుంది.పొరుగు దేశమైన ఇండొనేషియా లోని సుమత్రా అడవుల్లో ఫారెస్ట్ ఫైర్ వల్ల రాజుకున్న పొగ సింగపూర్ ని కమ్మేసింది.ఎప్పుడూ ఎండ వానా తప్ప ఇంకొకటి ఎరగని సింగపూర్ వాసులని ఈ పొగ భయభ్రాంతులని చేస్తోందనటం లో సందేహం లేదు.
నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ ప్రతీ గంటకీ తమ వెబ్ సైట్ లో ఇస్తున్న సమాచారం ప్రకారం ఈ ఉదయం 11 గంటలకి పొల్యూషన్ లెవెల్ సింగపూర్ లో 400 కి చేరింది.ఈ క్రింది చిత్రం లో పీ ఎస్ ఐ విలువలు, దానిని బట్టి గాలి నాణ్యతని నిర్ధారించే పట్టిక ఇచ్చారు చూడండి.

The free Dinctionary లో Haze ఇలా నిర్వచించారు
Atmospheric moisture, dust, smoke, and vapor that diminishes visibility
ఒక్కసారిగా వాతావరణం లో జరిగిన మార్పులని చూసి భయ భ్రాంతులైన సింగపూర్ వాసులకి ఆఫీసులు మాస్కులు సప్లై చేస్తున్నాయి.ఎప్పుడూ లేనిది మెక్ డోనాల్డ్స్, పిజ్జా హట్ లాంటి ఫాస్ట్ ఫుడ్ సంస్థలు తమ డెలివరీ సర్వీసులని నిరవధికం గా వాయిదా వేసేసాయి.
అన్ని అవుట్ డోర్ యాక్టివిటీస్ ని సస్పెండ్ చేసేసారు. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోం ని అమలుచేస్తుటే కొన్ని సంస్థలేమో గర్భిణీలు, ఆస్త్మా తదితర శ్వాస కోస సమస్యలు ఉన్న వాళ్ళని ఇంట్లో నుండి పని చెయ్యమంటున్నాయి.
ఇక్కడ మాకు బందులు అవీ ఎలాగూ ఉండవు, ఇలాగే ఉంటే ప్రభుత్వం STOP WORK ORDER ఇస్తుందేమో అని ఆశగా ఎదురు చూస్తున్నాను.
ఎంతో దూరం నుండి వచ్చిన టూరిస్ట్ ల పరిస్థితి చూస్తే పాపం అనిపిస్తోంది.లేజర్ షోస్,ఇతర అవుట్ డోర్ షోస్
వంటివి నిరవధికం గా రద్దు చేసారు..ఫోటోలు తీసుకుందామన్నా అంతా మసక మసక..
ఈ పొగ ఎంత దారుణం గా ఉంది అంటే ఆఫీసులో కూడా కాలిన వాసన వస్తోంది, కళ్ళు మండుతున్నాయి కూడా.. అయినా ఇండియాలో పీక్ అవర్ ట్రాఫిక్ లో గడిపి వచ్చిన వాళ్ళని ఈ పొగ కాస్త కళ్ళ ని ఇబ్బంది పెట్టడం మినహ మరే విధం గా భయపెట్టట్లేదు.పాపం అసలు పొల్యూషన్ అలవాటు లేని సింగపూరియన్స్ మాత్రం బెంబేలెత్తుతున్నారు.
నిత్యం జాగర్స్ తో కళకళ్ళాడే పార్కులు, బీచ్ లు వెల వెల పోతున్నాయి.
ఇప్పటివరకూ ఒక్క లక్కీ డ్రా కూడా నెగ్గని నేను "తెలుగు సినిమాల్లో తొడ గొట్టటాన్ని పాపులర్ చేసిన హీరో ఎవరు" లాంటి కష్టమైన ఒక ప్రశ్న కి జవాబు రాసి లక్కీ డ్రాలో రేపు జరిగే ఏదో ఫుట్ బాల్ మ్యాచ్ కి టిక్కెట్లు గెలిచాను..కానీ ఈ వాతావరణం అదీ చూస్తోంటే అసలు మ్యాచ్ జరుగుతుందో లేదో డవుటే..హ్హ్మ్మ్.."లక్కీ" విన్నర్ నా కాదా అని అనుమానం వస్తోంది .
ఫేస్బుక్ నిండా ఇవే అప్డేట్స్..పొల్యూషన్ లెవెల్,మాస్కులు,... ఒక సుందరి స్టేటస్ చూడండి.."అబ్బా..కళ్ళు మండుతున్నాయి,కాసేపు నడిచేసరికే ఊపిరి కష్టం గా ఉంది..ఎలాగో అవుతోంది..నేను
నడవలేకపోతున్నాను..క్యాబ్ తీసుకుని ఇంటికి వెళ్తాను.."
కొంప కాలిపోతున్నా ఫేస్బుక్ లో పెట్టి కానీ ఫైర్ ఇంజన్ కి ఫోను చెయ్యరు ఇలాంటి వాళ్ళు
Photo Courtesy:Google