Wednesday, February 24, 2010

Saradaaki-16

రానున్నది పరీక్షా కాలం కదా,ఏవో నాకు తోచిన నాలుగు సలహాలు చెప్తా ఈసారి పిల్లల కోసం.

ఒకే విషయాన్ని పట్టుకుని తెగ హడావిడి చెసేసే మన మీడియా లా కాకుండా సిలబస్ లోని అన్ని పాఠాలూ చదవండి.మన నాయకులు ఎక్కడయినా మాట్లాడాలంటే కనీసం ముందు ఒకసారి ప్రిపేరు అవ్వరు.మీరూ అలా కాకుండా పరీక్ష ముందు రోజు ఒకసారి అంతా రివిజన్ చెసుకోండి.

అధికార పక్షం ఏమయినా పధకాలు ప్రవేశ పెట్టగానే,కనీసం దాని మీద అవగాహన లెకుండా మాట్లాడే ప్రతిపక్ష నాయకుల లా కాకుండా,ప్రశ్నా పత్రం ఇవ్వగానే కాస్త ఆలోచించి జవాబులు రాయండర్రా.మూస ఫార్ములాలనే పట్టుకుని వేళ్ళాడుతూ సక్సెస్ దక్కలేదనె మన టాలీవుడ్ సినిమాల లా కాకుండా పొయిన సారి తప్పు ఎక్కడ జరిగిందో ఆలొచించి సరిదిద్దుకుని ఈసారి ముందుకు వెళ్ళండి.కాపీ కొట్టాలి అనుకున్నా కాని మన తెలుగు సినిమా డైరెక్టర్ల లా కాకుండా కాస్త ఆర్టిస్టిక్ గా,అప్పీలింగ్ గా కొట్టండం మరచిపోకండి సుమా.


మన టీవీల చర్చా కార్యక్రమాలలో పాల్గొనే నాయకుల లాగ కాకుండా అడిగిన దానికి సూటిగా సమాధానం రాయండి.
జవాబులు రాయడం పూర్తి అవ్వగానే ఆన్సర్ షీటు ఇచ్చేసి హాలు నుండి బయటకి వచ్చెయ్యకండి.ఒక సారి ఇచ్చాకా వెనక్కి తీసుకోవడానికి ఇదేమీ మన తెలంగాణా నాయకుల రాజీనామా కాదు కదా.చివరగా తల్లి తండ్రులకి ఒక మనవి.బడ్జెట్ చూడగానే పెదవి విరిచేనాయకుల లాగ ప్రవర్తించకండి.అంటే,మన నాయకులు వరాలు ఇవ్వకపొతేనేమో ఇవ్వలెదంటారు,ఇస్తే చాలవంటారు.అలాగే మీరు కూడా మార్కులు రాకపొతే రాలేదని వస్తే సరిపోలేదని సతాయించకండే.ఒక వేళ పరీక్షా ఫలితాలలో అనుకున్నంతగా పెర్ఫార్మ్ చెయ్యకపోతే సచిన్ ని రిటైర్ అవ్వు అని సతాయించే మూర్ఖపు ముసలి క్రికెటర్ల లా కాకుండా చక్కగా వారికి దిశా నిర్దేశం చెయ్యండి.

పిల్లలూ మీరు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి.ఏదో ఒకసారి ఒక టైటిల్ గాలి వాటం గానో మరే వాటం గానో నెగ్గి ఇక యేళ్ళకి యేళ్ళు ఆ పేరు చెప్పుకుని తిరిగే క్రీడాకారుల లాగ బెహేవ్ చెయ్యకండి.ఈ పోటీ ప్రపంచం లో విజయాలు సాధిస్తుంటేనె మిమ్మల్ని ఎవరయినా గుర్తించేది.ప్రపంచం అంతా మన వ్యవస్త లాగ వుండదు కదా.నిజమయిన విజయాలు సాధించిన వారికే గౌరవం.సో ఆల్ ద బెస్ట్.Monday, February 22, 2010

Saradaki 15

వేసవి వచ్చెస్తోంది.వేసవి లో కూలర్లూ,వట్టీవేళ్ళ తడకలు ఎక్సెట్ర ఎక్సెట్రా తో పాటు తల్లితండ్రుల బుర్రల వేడి చల్లార్చే సాధనాలు ఎమయినా వుంటే బాగుండు.నవరత్న తైలం,ఇమామి మెంతో ప్లస్ లు ప్రయివేటు స్కూళ్ళు,కాలేజీలు పుట్టించే సెగలని చల్లర్చ గలవా చెప్పండి.

శివరాత్రి అయిపోగానె వేడి మెల్లిగా పెరిగినట్లు సో కాల్ల్డ్ టాలెంట్ స్కూళ్ళ యాజమాన్యాలు కూడా మెల్లిగా ఫిబ్రవరి నుండీ "టాలెంట్" సేర్చ్ మొదలెడతాయి.ఇక్కడ పిల్లల టాలెంట్ కంటే కూడా యాజమాన్యాల టాలెంట్ బయట పడే సమయం.మన విద్యార్ధులలో ఈజీ గా 60% మంది 8,9 తరగతులని నిర్లక్ష్యం చేస్తారు.ఈ పాయింటే యాజమాన్యాల పంట పండిస్తొంది.ఆ దిక్కుమాలిన టాలెంట్ టెస్టులలో ఈ పాఠాల మీదే ప్రశ్నలుంటాయి.
ఈ ప్రవేస పరీక్ష లలో 90% వస్తే ఉచిత విద్య అంటారు.ఆణిముత్యాల లాంటి పిల్లలు 90% తెచ్చుకున్న కాని అక్కడ మరో మెలిక పెడతారు.ఉచిత విద్య అన్నాము కాని హాస్టలు ఉచితం కాదు అంటారు.లేదు మా పిల్లవాడు హాస్టల్ లో వుండదు అని ఎవరయినా తెలివి గా చెప్తే దానికి కూడా అస్త్రం రెడీ మన టాలెంటెడ్ యాజమాన్యాల దగ్గర.అబ్బే ఈ పరీక్ష హాస్టలు లో చెరే పిల్లల కోసమే సుమా అంటారు లెదా టర్మ్ ఫీ అనో మరోటో చెప్పి ఫీజు లాగి తమ టాలెంట్ ప్రదర్శిస్తారు.ఎలాగూ తమ టాలెంట్ సెర్చ్ లో మహా అయితే ఒక 10 మంది కన్న ఎక్కువ మంది ఈ కోవలోకి రారు అని యాజమాన్యాల ధీమ.ఇక మామూలు పిల్లల తల్లి తండ్రులకి వీరు చెసే కౌన్సెలింగ్ చూస్తే పెద్ద పెద్ద బిజినెస్ స్కూళ్ళ డిగ్రీలు కూదా బలాదూరే ఆ మార్కెటింగ్ మంత్రాల ముందు.మొత్తనికి వారిని ఒప్పించి తమ స్కూలు/కాలీజి లో చెర్పిస్తారు.హమ్మయ్య పిల్లవాడు బాగుపడతాడు లే అని ఒక 2 నెలలు రిలాక్సు అవుతారో లేదో మళ్ళీ యాజమాన్యం నుంది కబురు మీటింగ్ వుంది అని.ఇదిగో ఇవీ మీ పిల్లల మొదటి పరీక్ష మార్కులు.బాగానే వున్నయనుకోండి కాని మా ఇంటెన్సివ్ కోచింగ్ లో వేస్తే వజ్రమే మీ పిల్లవాడు అంటారు.వీరు వూ అనడం తరువాయి ఒక ఫారం తెచ్చి చేతిలో పెడతారు.తీరా చూస్తే ఒక 10 వేలు ఒక వారం లోపు కడితే ఇంటెన్సివ్ లో వెస్తాము మీ అబ్బయి ని అని.పిల్లాడి భవిష్యత్తు ని మాయబజార్ కలర్ లెవల్ లో ఊహించెసుకుంటారు పేరెంట్స్,ఫలితం వారం లో పది వేలు ఫట్.


ఇలా ఒక సంవత్సరం గడుస్తుంది.మొదటి సంవత్సరం ఫలితాలని చూసి యే పిల్లవాడి తండ్రి అయినా కాస్త ఆవేసానికి లోను అయితే,అబ్బే ఇవి మామూలేనండీ,మొదటి సంవత్సరం లో ఇలా వున్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద ర్యాంకర్లు అయారు తెలుసా అంటారు.వెంటనే ఎమీ డబ్బు కట్టమని అడగరు మొదటికే మోసం వస్తుంది అని వారికి తెలుసు కనుక.తాపిగా ఒక నెల పొయాకా కబురంపుతారు,ఇది ఆఖరి సంవత్సరం కదా,మీ వాడికి స్పెషల్ కోచంగు ఇవ్వాలి ఇంకో 10 కొట్టండి అని.

ఇలా 10,5 వారికి దక్షిణ ఇస్తూ ఇంటర్ అయిందనిపించాలన్నమాట.తల్లితండ్రులు తమ పిల్లల గురించి అతిగా ఊహించుకుంటూ ఎవడో వచ్చి అధ్భుతాలు చేస్తాము అని చెప్తే నమ్మి పిల్లలని వారికి అప్పజెప్పటం మాననంత వరకూ ఇంతే.

ఇప్పుడు చెప్పండి ఈ టాలెంటు పరీక్షలు ఎవరి టాలెంటు ని పరీక్షించటానికో.
వీరి దగ్గర పని చెసే ఉద్యోగులు కొందరు "సంపాదించటం ఎలా" అనే టాలెంట్ సంపాదించి వెంటనే వెరుగా ఒక కాలేజీ తెరిచెస్తారు.అయినా తప్పు పట్టడానికి లెదండీ,ఒక నలుగురుకి తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగే టాలెంట్ ఇస్తున్నారా లెదా వీళ్ళు.ఇది ఒక అణు విస్ఫోటనం లాంటిదన్నమాట.అలా మల్టిప్లయ్ అవుతూ వుంటుంది.

Sunday, February 7, 2010

Saradaaki-14

(ఇది చదివేముందు సరదాకి-13 చదువ మనవి)
ఎక్కాలు,గ్రామరు కొన్నాళ్ళకి నాన్నగారు చవమని చెప్పటం మానేసారు.అయినా సరే,శెలవు రోజున పొద్దునే ఇంట్లో తప్ప బయట ఆడుకునే చాన్సు లేదు.
నీ మీద ఎంత ఇదో నాన్నగారికి,చిన్ని పేచి పెడుతుందేమో అని ఇంట్లొ అన్నీ ముందే తెచ్చి పెట్టేవారు తెలుసా అని పెద్దయ్యకా మా అమ్మ నా చెవిన తీరికగా వెసిందనుఖొండీ.కొన్ని సంవత్సరాల ముందు చెప్పచ్చు గా ఈ చల్లని మాట.

నాన్నగారిని ఎదయినా డైరెక్టు గా అడగాలన్నా భయమే.అమ్మకి చెప్తే సాయంత్రం నాన్నగారి చెవిన వేసేది.నాన్నగారు ఒప్పుకుంటారో లెదో అని మళ్ళా టెన్షను షురూ.నాన్నగారికి ఎదురుగా వెళ్ళే ధైర్యం చెయ్యలేక గోడచాటున సోషలు పుస్తకం పట్టుకుని కూర్చునేదానిని.ఇలాంటి సీను కి మాత్రం సోషలు భలే పనికొచ్చెదిలే.పుస్తకం లో తలవాల్చి నాన్నగారి మాటలు వినచ్చు.లేదంటే పరీక్షలప్పుడు తప్ప ఎప్పుడూ ఆ పుస్తకం తీసి ఎరుగను.మొత్తానికి ఆయన టీ తాగటం కంప్లీటు ఆయ్యేలోపు యస్ ఆర్ నో చెప్పేసేవారు.చూద్దాం అని అన్నారంట మళ్ళీ టెన్షను నాకు.ఎంటో పెద్ద ఇది అవును కాదు చెప్పటానికి అనుకునేదానిని కూడా.

పెద్దయ్యాకా కాని తెలియలేదు ఆయన ఎంత కష్టపడి మమంల్ని పెద్ద చదువులు చదివించారో.సామాన్య గుమాస్తాగా వున్నప్పుడే ఇద్దర్ని హాస్టల్ లో పెట్టి చదివించారు అని తలచుకుంటేనే కళ్ళళ్ళో నీళ్ళు తిరుగుతాయి.
ఇంత సంపాదిస్తూ కూడా(ఎట్లీస్ట్ ఆయన కంటే బెటర్ గా సంపాదిస్తూ)వున్న ఒక్కడిని పెంచటానికే నేను ఎంత ఆలొచిస్తానో.అలాంటిది నాన్నగారేమో...తలచుకుంటేనే హీ ఈజ్ గ్రేట్ అనిపిస్తుంది,ముగ్గురిని ఏ లోటూ లేకుండా ఎలా పెంచారా అని.అమ్మకి కూడా హ్యాట్సాఫ్ ఆ విషయంలో.
ఎలాంటి పరిస్థుతులలోనూ తొణకని ఆయన నిబ్బరం తలచుకుంటే ముచ్చటేస్తుంది నాకు,నాకు కొంచమయినా రాలేదే అని కూసింత బాధ కూడా వస్తుంది.
ఇక ఆయన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కాని,ఆయన ధైర్యం కాని నిజం గా గ్రేట్ అనిపిస్తుంది నాకు.అన్నింటికంటే కూడా..నేను ఇష్తపడ్డాను అనే ఒక్క కారణంతో తాను ఎన్నో అవమానాలు పడీ కూడా నా పెళ్ళి జరిపించిన ఆయన ధైర్యం అపూర్వం.
అలాంటి మా నాన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు,సుఖమయ జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటూ...

saradaaki-13

ఒక శెలవు రొజున ఒకటో తరగతి చదువుతున్న మా వాడి లెక్కల హోంవర్కు చేయిస్తున్న కూర్చుని.వాట్ విల్ బీ ద నెక్స్ట్ ప్యాటర్న్ అంటూ ఒక లెక్క వుంది.ఇలాంటివి మనము యే బ్యాంకు పరీక్షలప్పుడో తప్ప చూడలెదు కదా అని నవ్వు వచ్చింది నాకు.అసలు కిటుకు చెప్పగానె ఇట్టే చేసెసి పుస్తకం మూసి ఆడుకొవడానికి తుర్రుమన్నాడు వాడు.
నా చిన్నప్పటి లెక్కలు అంటే మొదట గుర్తొచ్చెది ఎక్కాలే.మా వాడిని ప్రీ స్కూలు నుండీ చూస్తున్నాను,ఎక్కడా ఎక్కాల ఊసే లేదాయె.అలా నా మనసు చిన్నతనంలోకి వెళ్ళిపోయింది.

శెలవలు వచ్చయంటే చాలు ఎక్కాలు చదవాల్సిందే ఇరవయ్ ఇరవయ్ ల వరకు.మా నాన్నగారు అంటే చచ్చె హడల్ నాకు.పొద్దునే తనతో కూర్చొబెట్టుకుని టిఫిన్ చేయించి ఆఫీసుకి వెళ్తూ అమ్మకి చెప్పివెళ్ళేవారు నెను వచ్చెవరకు చిన్ని కి అన్నం పెట్టకు అని.నేను వచ్చకా ఇరవయ్ ఇరవయ్ ల వరకు ఎక్కాలు అప్పజెప్పాలి అని సింపుల్ గా అనేసి స్కూటర్ మీద తుర్రుమనే వారు.ఇక చూడాలి నా బాధ.ఎన్ని సార్లు చదివినా రావె ఆ ఎక్కాలు.అసలు ఇంట్రస్టు వుంటే కదా వంట పట్టేది ఏదయిన కాని.ఎప్పుడు అవసరం అయితే అప్పుడు గుణిచుకోవచ్చు కదా ఎమిటి ఈ తిప్పలు అనుకునే దానిని.ఒక పక్క అమ్మ పెట్టే పోపులు వాసన తగలగానే ఎక్కడ లేని ఆకలి పుట్టుకొచ్చెసెది.కాని నాన్న గారి రూలు ని అమ్మ ఎన్నడూ ధిక్కరించెది కాదు.ఆ విషయం లో మా అమ్మ మీద ఎంత కోపం వుండెదో నాకు.పైగా తానెదో సత్య హరిస్చంద్రుడి చెల్లెలి లెవెల్ లో నాన్నగారు రాగానే అన్ని చెప్పెది మా గురించి.ఇక అప్పుడు చూడాలి నా టెన్షను.అక్కకి ఎప్పుడూ పెద్ద టెన్షను పడ్డట్ట్లు అయితే నాకు గుర్తు లేదు.
ఎమీ మాట్లాడకుండా మాతో కూర్చుని మామూలుగా భొజనం చెసే వారు.పైగా తను కలిపి వేసినవి అన్నీ తినాల్సిందే.లేకపొతే చిన్నీ అని ఒక్కసారి పిలిచారంటే చాలు.నిమిషం లో కంచం మొత్తం ఖాళీ అయిపొయేది.
భొజనం చేసాకా అడిగేవారు ఎక్కాలు చదివావా అని.ఆ చదివా అండీ అని ఎంతో వినయం గా చెప్పేదానిని.కాని పదిహేడు పద్దెనిమిదులు ఎంత అనో మరోటో అదుగుతారెమో అని ఆ టయిము లో నేను పడ్డ టెన్షను ఇండియా పాక్ మ్యాచ్ అప్పుడు కూడా పడలెదంటే నమ్మండి.ఆయన భొజనం చేసాకా ఒక గంట అందరమూ పడుకోవాల్సిందే ఇంట్లో.
మళ్ళీ నానగారు తిరిగి ఆఫీసుకి వెళ్ళేటప్పుడూ ఎంత హ్యాపీ నో నేను.ఎకాల కార్యక్రమం ఆనాటికి పూర్తి అయ్యింది అని.ఎండ తగ్గితే కాని ఆటలకి పంపకు అని మరో ఆర్డరు వెసి వెళ్ళెవారు ఆఫీసుకి.

నాకేమో నాలుగింటి నుండే బయటకి వెళ్ళాలని వుండేది.అమ్మని ఎంత విసిగించేదానినో.నాన్నగారికి చెప్తాను అనేది చివరికి.ఇక తను వెళ్ళమనే వరకు ఆ మాట ఎత్తితే వొట్టు.నా మీద నాన్నగారు అనే వజ్రాయుధాన్ని ఎప్పుడూ ప్రయోగించాలో తనకి తెలిసినంతగా మరెవరికీ తెలియదు.

మర్నాడు పొద్దున్న మళ్ళీ సేం టూ సేం సీను.ఇరవయ్ ఇరవయ్ ల వరకు ఎక్కాలు చదవటం.అలా ఎన్ని సార్లు చదివానో లెక్క లేదు.కాని నాకు ఇప్పటికీ నోటికి మాత్రం ఎక్కాలు రావు.ఎదో నాన్న గారి కోసం చదవటం అంతే.ఇంకాస్త పెద్దయ్యాకా ఎక్కాల నుండి సీను ఇంగ్లీషు గ్రామర్ కి మారింది.
నాకు ఇప్పుడు నవ్వు వచ్చెది ఎమిటి అంటే చదవమని చెప్పేవారే కాని నాన్నగారు ఎప్పుడూ అప్పచెప్పించుకోలేదు.ఆ కిటుకుని పట్టుకోలేక నేనేమో తిట్టుకుంటూ ఎక్కాలు గ్రామరు చదివాను కదా అని.
మరలా కలుస్తా...

Tuesday, February 2, 2010

Saradaaki-12

లోకం లో మానవులకి తాత్విక చింతన బాగ తగ్గిపోతొందని అంటున్నారు పెద్దలు.కాని ఈరోజుల్లొ మన తీరు చూస్తోంటే కాస్త ఈ స్టేట్మెంటు ని మార్చాలేమో అనిపిస్తొంది.ఈ కింద పేర్కొన్న వాటినన్నింటిని మనము ఎన్ని సంవత్సరాలుగా వింటున్నమో ఎవరికయినా తెలుసా?
1)నిందితులు ఎవరినీ వదిలిపెట్టేది లెదు

2)నేరస్తులు ఎంతటి వారయినా సరే శిక్షిస్తాం.

3)ప్రభుత్వ పాతశాలలని కాన్వెంటులకి ధీటుగా తీర్చిదిద్దుతాము

4)గ్రామ గ్రామనికి మంచి నీరు అందిస్తాము

5)పారిశ్రామికంగా దెశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతాము

6)పొరుగు దేశం కవ్వింపు చర్యలని సహించేది లేదు.(ఇక చెప్తూ పోతే ఈ లిస్టు కి అంతు వుండదని లిస్టు ముగిస్తున్న).
ఊహూ తెలీదు.మంద చర్మం గాళ్ళము అయిపొయాము కదా గుర్తు కూడా వుండదు మనకి.మన షార్టు మెమరీ గురించి తెలుసు కాబట్టే మనకి ఇలాంటి నయకులు దాపురించారు.
ఇంకా పాథెటిక్ ఎమిటి అంటే ఏదయినా నేరానికి సంబంధించిన వార్త ఏ పేపర్లొ ఎలా వచ్చిందొ వీలుంటే చదువుతాము లెదా ఆ పేపరు చదివిన వాడితో డిస్కషన్ మొదలెడతాము.లెదా నేరము జరిగిన ఊరిలొ వున్న మన అన్న వదిన లెదా స్నెహితుడు/స్నేహితురాలికి అయినా సరే ఫోను చేసి లైవు న్యూసు వినందే మన ఆరటం తగ్గదు.ఎవరికయినా ఉత్సాహమే కదా తమ నుండి ఇంఫర్మెషన్ అడుగుతొంటే.సో,తమ పాండిత్యం అంతా ఉపయొగించి విన్న దానికి ఇంకాస్త మసల జోడించి మాంచి రంజుగా చెప్తారు.పొనీ మనము విని ఊరుకుంటామా అంటే అదీ లెదు.నాకు తెలుసు ఇలా అయిందిట అసలు విషయం ఇదీ అని చెప్పి డిటెక్టివ్ లాగ పోజు కొట్టందే మనకి తిండి సహించదాయే.


నేరాలు జరిగినప్పుడు చూడాలి మన చానళ్ళ ఆరాటం.దెశం లో చీమ చిటుక్కుమన్నా కాని అక్కర్లెని చెవులు వున్న మన సో కాల్డ్ జర్నలిస్టులు అక్కడ వాలిపొతారు.ప్రిపరెషను గట్రా ఎమీ అక్కర్లెదు కదా సొది చెప్పటానికి.ఇక వారికి వచ్చిన/నచ్చిన రీతిలో ఊదరగొట్తెస్తారు జనాలకి.ఇక పిల్లల కిడ్నాపు డ్రామాలయితే పండగే.


ఇక నాయకులు,హక్కుల సంఘలు(ఫలాన హక్కు సంఘం అని కాదు లెండి,ఈ మధ్య తినే హక్కు,తాగే హక్కు సంఘలు కూడా వచ్చెసయి కదా)చెసే హడావిడి అయితే చెప్పక్కర్లెదు.నిందుతలని చంపలి నరకాలి అన్న కొపం వస్తుంది మనకి కూడా.ఈ ఆవెశం మహా అయితే ఒక వారం వుంటుంది అంతే సుమా.తరువాత మామూలే.శ్రీలక్ష్మి కేసు నుండీ ఈ తంతు చూస్తున్నదే కదా.


ఒక వారము తరువాత ఎవరికీ గుర్తు వుండదు ఏ విషయము కూడా.అప్పుడు చెసిన వాగ్దానలు నెరవేర్చరెమిటి అని కాని లెదా ఫలాన కేసు నిందితులని ఏమి చేసరు అని కాని ప్రశ్నించటం మర్చిపొయిన మన జర్నలిస్టులు పొరపాటున కూడా ప్రశ్నిచరు.జర్నలిస్టులందరూ కాశి కి వెళ్ళి వదిలేసి వచ్చిన వాటిల్లో ప్రశ్నించటం కూడా వుందని నా ప్రగాఢ నమ్మకం.
దేనినీ పట్టించుకోకుండా ఇలా జీవితాన్ని గడిపెస్తున్నాము అంటే తాత్విక చింతన అలవడినట్లా కాదా?