Wednesday, December 1, 2010

ఎలా ఉంది ఈ ఆలోచన?ఈ అసంతృప్తులు,రాజీనామాలేమిటో. నిన్నటి వరకు వాళ్ళ "అన్న" కి మంత్రి పదవి వస్తుందా రాదా అన్న టెన్షన్. తీరా వచ్చాకా మా "అన్న" కి ఫలానా "షాఖ"(శాఖ అని చదువుకోండి తెలుగు సరిగ్గా వచ్చినవాళ్ళు)ఇవ్వలేదని బైఠాయింపులు,నిరసనలు.

రాజకీయ నాయకులు ఎంత అద్రుష్టవంతులసలు. తమ మీద ఈగ వాలితే రోడ్డెక్కి వెంటనే ఆందోళన చేసే అనుచరులు ఉండటం మన లాంటి వాళ్ళకి సాధ్యమా?

ప్రజలకి మంచి పాలన అందించటమే తమ ధ్యేయంగా ఎన్నికలప్పుడు ప్ర్రకటించి డబ్బు ప్రభావం వల్లో మరొకటి వల్లో ఎన్నికయ్యాకా మంత్రి పదవి కోసం నానా గడ్డీ కరవడం. తీర పదవొచ్చాకా హోం శాఖో,రెవెన్యూ శాఖో మరో "ముఖ్యమయిన" శాఖో దక్కలేదని ఆగ్రహించడం.

2009 లో కోట్లు ఖర్చు పెట్టి అధికారంలోకయితే వచ్చారు కానీ ఆ డబ్బుని మన నుండి వసూలు చేసుకునే అవకాశం దక్కలేదు ఎవ్వరికీ ఇంకా. అదీ ఈ ఏడుపుల వెనకసలు కారణం.

ఇదంతా చూస్తోంటే నాకో ఆలోచన వచ్చింది.నాకూ ప్రజా సేవ చెయ్యాలని చాలా కాలం నుండీ కోరికతో ఉన్నాను.నా మీద ఎలాంటి రౌడీ షీటు కానీ కేసులు కానీ లేవు.ఏ శాఖ ఇచ్చినా నోరు మూసుకుని తీసుకుంటాను.అధిష్టానానికి ఎదురు అసలే చెప్పను.రేపు ఇండియా వెళ్తున్నా కాబట్టి హైదరాబాదు లో మన సీయం గారిని కలిసి ఇదే విన్నవించుకుంటాను.

ఏ చట్టసభలోనూ సభ్యత్వం లేకపోతేనేమి రాజు తలచుకుంటే దెబ్బలకి కొదువుండదు కదా.మన సీయం గారు కనుక ఓకే అంటే ఇక ఉద్యోగం సజ్జొగం అన్నీ మానేసి మూడున్నరేళ్ళు పెజా సేవ చేసుకుంటూ బతికేస్తాను.అధమం కోటో రెండు కోట్లో సంపాదించుకోవచ్చు. ఏలాగూ ఇప్పుడున్న ఉద్యోగంతో మూడున్నరేళ్ళల్లో అంత వెనకేసుకోలేను.

పైగా ఎక్కడికయినా ఉచిత ప్రయాణం,ఫోను ఫ్రీ,ఇల్లు ఫ్రీ,స్టడీ టూరు పేరుతో విదేశీ యానం.2014 ఎన్నికలలో నిలబడకుండా సహ్రుదయంతో మీలో ఎవరికయినా నా స్థానం ఇచ్చెస్తాను. (ఆ ఎన్నికలలో నిలబడితే నేను వెనక,పక్క,ముందు వేసుకున్న నా కోటి రూపాయలేంగాను?అందుకని)

మన సీయం గారు కాదూ కూడదంటే అటునుంచటే వెంకటాద్రి ఎక్కి ఇడుపులపాయ వెళ్ళి జేబులో నుండి ఓ పది ఫోటొలు తీసి "యువ నేత" ముందు పెడతా.ఆఫొటోలేంటి అనుకున్నారు?జగన్ కి జరిగిన అవమానానికి నా ఆధ్వర్యం లో "సింగపూరు" లో జరిగిన నిరసన కార్యక్రమాలన్నమాట.(ఉత్తుత్తినే. ఇక్కడ ఇవన్నీ చేస్తే శ్రీక్రిష్ణ జన్మస్థానమే. అందుకే మా ఇంటి కిందే చుట్టూ నలుగురు జగన్ ఫోటో లతో,మధ్యలో నేను సోనియా ఫోటో ని రెండు ముక్కలు చేస్తూ నిలబడినవన్నమాట)

మర్చిపోయా,ఇడుపులపాయలో ముందు "మహా నేత" కి శ్రద్ధాంజలి ఘటిస్తా.ఆ తరువాతే "యువ నేత" ని కలవడం. అన్నని ఓదార్చి నేనూ కాస్త జగన్ మొహం పెట్టి అన్న పెట్టబోయే కొత్త పార్టీ విదేశి శాఖ కి కార్యదర్శి,కోశాధికారి గా నియమించమని అడుగుతా.

ఈ ఐడియా బౌన్స్ అయ్యే అవకాశమే లేదుకదా...అన్నతో రెగ్యులర్ టచ్ లో ఉంటూ నా ఆధ్వర్యం లో ఇక్కడ నిరసనలు చేపట్టడమే గా చెయ్యల్సింది.చేసి పారెస్తా.ఎంచక్కా ఉన్న ఉద్యోగం చేసుకుంటూనే యువనేత కొత్త పార్టీ కి "కోశాధికారి"నైపోతా.

అంతా కలిసొచ్చి అన్న సీయం (ఎప్పటికయినా) అయితే నా సుడి కూడా తిరిగినట్లే కదా. ఏమంటారు? రోడ్లెక్కి గొంతెత్తి అరవక్కర్లేదు,పోలీసు దెబ్బలు తినక్కర్లేదు. ఓ పది ప్రింటవుట్ల ఖర్చు అంతే కదా ఈ నిరసన కి అయ్యేది...కోశాధికారి ని నేనే కాబట్టి చింత,పులుపు ఏమీ ఉండవు ఖర్చు విషయానికి.


(రేపు ఇండియా వెళ్తున్నాను. మరలా కొత్త సంవత్సరం లో కలుసుకుందాము.అందరికీ ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు)

గమనిక: పై రెండు కార్యక్రమాలలో నాతో భాగస్వాములు కావాలనుకునే వారు నా బ్లాగు ని ఆహాఓహో అని పొగడాలి మరి.

Monday, November 29, 2010

ఓ పనైపోయిందిహమ్మయ్య, ఓ పనైపోయింది. మనకి టీవీలలో పదే పదే "వేటా" "లేటా" అనే చర్చలు,"ఎక్స్ క్లూజివ్" కధనాలు చూసే బాధ తప్పింది జగన్ రాజీనామాతో.

జగన్ వేరు కుంపటి పెడతారు అంటున్నారు కదా. ఆ పార్టీ ఎంత కాలం మనగలుగుతుందో అన్నది సందేహమే.ఇంతకుముందు ఎన్ని చీలికలు చూడలేదూ మనము ఇలాంటివి. ఆవేశం లో మన సీతయ్య పెట్టిన "అన్న తెలుగు దేశం",లక్ష్మీ పార్వతి స్థాపించిన పార్టీ అసలు అడ్రస్ లేకుండా పోయాయి.

మన మెగాస్టార్ పార్టీ కంటే హీనమయిపోతుందేమో అన్న సందేహమూ ఉంది నా లాంటి వాళ్ళకి.ఎందుకంటే మన రాజకీయ నాయకులు తక్కెడ లో కప్పల్లాంటి వారు కదా.జగన్ పార్టీ కనుక అవాంతరాలని తట్టుకుని మనగలిగితే నిజం గా అది అధ్భుతమే.

జగన్ ఎపిసొడ్ అయిపోయింది కాబట్టి మీడియాకి మేత ఇంక నూతన మంత్రి వర్గమే.మంత్రి వర్గ ప్రమాణం తరువాత ఓ రెండు రోజుల హడావిడి ఉంటుందేమో అంతే. ఆ తరువాత మన "ఘరానా కూలీ"మీడియా కి కావాల్సినంత మేత అందిస్తూ ఎంచక్కా లైం లైట్ లో ఉండచ్చు.

ఓదార్పు యాత్ర ఇంకా అవ్వలేదు అనుకుంటా కదా,ఈయన కి పార్టీ లో జరిగిన అవమానానికి ఎవరైనా గుండె ఆగి మరణించి ఉంటే?చక్కగా వీళ్ళకోసం కూడా ఓదార్పు "సాగి"స్తూజగన్ కొత్త పార్టీ ఒక రూపు దాల్చే వరకు గడపచ్చు.

ఆయన పార్టీ ఆయన ఇష్టం కానీ ఇప్పుడయినా కాస్త జగన్ కొంచం కొత్తగా ఫొటొ లకి పోజులిస్తే బాగుండు. సెప్టెంబరు 3 2009 నుండీ ఒకటే పోజు చూసీ చూసీ బోరు కొట్టింది.

Monday, November 15, 2010

Wednesday, October 13, 2010

శభాష్ ఇండియాఒక 15 రోజుల క్రితం వరకూ కూడా నేను మన వాళ్ళు ఎలా నిర్వహిస్తారో కామవెల్త్ క్రీడలు,అంతర్జాతీయ మీడియా ముందు సగం పోయిన పరువుని పూర్తిగా పోగొడతారా,కాస్తయిన నిలుపుతారా అనే సందేహం ఉండేది.

ఈ పోటీలు మొదలయిన రోజు నుండీ దాదాపు గంట పాటయినా వీటిని వీక్షిస్తున్నాను. సూపర్ అసలు నిర్వాహణ. మీలో చాలా మంది ఓపెనింగ్ సెర్మనీ చూసే ఉంటారు,ఎంత బాగుంది అసలు, మధ్యలో క్రీడాకారుల మార్చ్ తప్పించి,ఆద్యంతం ఆసక్తి కరంగా మన సంస్క్రుతి ని ప్రతింబింబించేటట్లుంది. ముఖ్యం గా ఆ మెహెందీ ఆర్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా.

మన కామన్వెల్త్ నిర్వాహణ సూపర్ అని అనడానికి రెండు కారణాలున్నాయి.

మొదటిది,ఈ మధ్యే కామన్వెల్త్ క్రీడా గ్రామ విశేషాలతో కూడిన ఒక మెయిల్ వచ్చింది. అందులో ఫొటోలే ఈ పోస్టుకి పెట్టినవి.

ఇక రెండొది,ఓ రెండు నెలలక్రితం సింగపూరు లో మొట్టమొదటి సారి నిర్వహించిన యూత్ ఒలింపిక్ గేంస్ టెక్నాలజీ టీంలో పని చేసే అవకాశం రావడంతో వీటి నిర్వాహణ, ఇక్కడి స్టేడియం లని బాగా దగ్గరగా పరిశీలించాను.

మన కామన్వెల్త్ క్రీడా వేదికలు,నేను సింగపూరు లో చూసిన వేదికలకి ఎక్కడా తీసిపోయినట్లు అనిపించలేదు.ఇవే కాదు, నిర్వాహణ కూడా.
పైగా మనకి సెక్యూరిటీ ఇష్యూ ఒక పెద్ద తలనెప్పి.నిజం గా చిన్న సంఘటన కూదా లేకుండా నిర్వహించడం అంటే మాటలు కాదు.


డ్రైనేజీ తదితర ప్రాబ్లంస్ అంటారా,అవి వాడే వాళ్ళని బట్టి ఉంటుంది. కామన్వెల్త్ క్రీడా గ్రామంలో అథ్లెట్లు నానా చెత్తా డ్రెయినేజీలలో వెయ్యడంతో డ్రెయిన్స్ చాలా మూసుకుపోయి ఇబ్బంది వచ్చింది అని చదివాను. దానిలో నిర్వాహణా లోపం ఏదీ నాకు కనపడలేదు.


సింగపూరు ప్రభుత్వం ఈ క్రీడలు నిర్వహించడానికి తమకి బిడ్ రాగానే ఏర్పాట్లని మొదలెట్టేసింది. వీళ్ళ పని వేగం,కార్య దక్షత,అతి చిన్న అంశాల పట్ల కూడా అతి శ్రద్ధ చూసి నాకు మనసులో ఓ మూల కాస్త డవుటు గా అనిపించేది,మన కల్మాడీ ఏమి చేస్తాడొ అని.

ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోయినా,మన నాయకులు ఎంచక్కా మన అనుమానాలని మాత్రం నిజం చేసేసారు.జూన్ లో అనుకుంటా మన ప్రధాని ఏదో స్టేడియం ని ఓపెన్ చెయ్యగానే మీడియా అంతా స్టీరియో ఫోనిక్ సౌండులో అరిచి గీ పెట్టింది,అబ్బే ఏమిటి ఈ ఏర్పాట్లు అని.అంతర్జాతీయ మీడియా సరే,మన నాయకులు,మీడియా కూడా ఇంత అతి అవసరమా అనిపించింది నాకు.

ఇక ఆనాటి నుండీ మొదలు,ఏ రోజు పేపర్ చూసినా పెదవి విరుపు వార్తలే. నిజం నిష్ఠూరం గానే ఉంటుంది కానీ మన నాయకులు అలా మీడియాకెక్కి గోల చెయ్యకుండా ఉండాల్సింది.

కల్మాడీ తొలగింపు ఈ నాయకుల గలాటా ఫలితమో గొప్పతనమో అని నేను అనుకోను.ప్రతిపక్షాలు ప్రతీ సారీ అబ్బే బాలేదు అనడం,ప్రభుత్వం లైటు తీసుకోవడం జరిగేదే.ఆడాళ్ళ రిజర్వేషన్లు,అణు బిల్లు తదితర అంశాలలో చూడలేదూ, మన ప్రతిపక్షాలు ఎంత గాట్ఠిగా నో అన్నా కానీ ప్రభుత్వం తన పని కానిచ్చేసింది.

కానీ ఇక్కడున్నది అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు. వారు సంత్రుప్తి చెందకపోవడంతో మన ప్రధాని రంగం లోకి దిగారనిపించింది.

మన కల్మాడీ గోల జరిగేటప్పుడే ఇక్కడ యూత్ ఒలింపిక్ గేం స్ మొదలయ్యాయి. మా టీం లో వివిధ దేశా లకి చెందిన వారుండేవారు.వాళ్ళలో కొందరు మన కామన్వెల్త్ పోటీలకి కూడా హాజరు కావాల్సినవారున్నారు. వీరిలో ఓ ఇద్దరు ముగ్గురు ఇండియా అంటే ఇంతెత్తున ఎగిరిపడి ఛీ అనే రకాలు. ఇక వాళ్ళకి పండగ లా ఉండేది,ఈ వార్తలు చదువుతోంటే.

అసలు పోటీలు ప్రారంభమవుతాయా అన్నంతగా పరిహసించేవాళ్ళు. ఇదంతా చూసి నాకనిపించేది, లోటు పాట్లనేవి ఎక్కడయినా ఉంటాయి. చైన లో జరిగిన ఒలింపిక్స్ లో లేవా లోపాలు,లేదా లండన్ లో జరగబోయే పోటీలలో ఉండవా ఏమీ లోపాలు?


అన్ని చోట్లా లోపాలుంటాయి కానీ మనది 100 % ప్రజాస్వామ్య దేశం అవడంతో మీడియా కి స్వేచ్చ ఎక్కువవడం వల్ల మనము ఇలా బయట పడ్డాము అంతే. అయినా క్రీడలు మొదలయ్యాకా కూడా క్రీడాకారుల పరుపులు,బాత్రూములు అలా ఉంటే అనాలి కానీ ఇంకా హ్యాండొవర్ చెయ్యముందే ఇంత గొడవ అవసరమా అనిపించింది.

మన దేశ పరిస్థితి ఎక్సెట్రా మాట్లాడేవాళ్ళని ఒకటే అడిగాను,నేను మా దేశం లో మీడియా ముందుకెళ్ళి మా ప్రధాని దద్దమ్మ అనగలను. మీరలా అనగలరా అని.అంతే,....ఆశ్చర్యంతో నోరెళ్ళపెట్టడం వాళ్ళవంతయ్యింది.(మన నాయకులు ఇంకా చక్కటి గ్రాంధీక భాష ఉపయోగించగలరని చెప్పలేదు లెండి.చెప్పి ఉంటే,యే గుండెనెప్పో వచ్చి పడిపోతే...? నాకెందుకు తలనెప్పి.)

మన నాయకులు గడ్ది కరవడం మానరు కనుక, ప్రభుత్వం ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలప్పుడయినా మీడియా ని కొంత వరకు నియంత్రిస్తే బాగుంటుందనిపిస్తుంది. ఏమంటారు?

మన దేశ ప్రస్తుత పరిస్థితులని వెనకేసుకురావడం నా ఉద్దేశ్యం కాదు. అంతర్జాతీయ మీడియా ఈ పోటీలకి ముందు, అధ్వాన్న పరిస్థితులని గగ్గోలు పెట్టినా కానీ ఇంత చక్కగా నిర్వహిస్తున్నామని గర్వపడుతున్నాను.

ఇంతకీ నేను చెప్పదలచుకున్నది ఏమిటి అంటే,మన క్రీడా నిర్వాహణా సామర్ధ్యం అభివ్రుద్ధి చెందిన దేశాలకి ఏమీ తీసిపోలేదని.

నా వాదనని బలపరచడానికి సింగపూరు స్టేడియాల ఫోటోలు కూడా పెడదామనుకున్న కానీ,అందుబాటులో లేవు.మీరే గూగుల్లో YOG2010అని టైప్ప్ చేసి చూసెయ్యండే.

మొదటిసారి ఇండియా వెళ్తూ ఎలా ఉంటుంది ఢిల్లీ అని నన్నడిగిన ఒక విదేశీయుడికి ఠక్కున గూగుల్ లో మన మురికివాడల ఫొటోలు చూపించి ఇదే ఇండియా అని చెప్పి, ప్రస్తుతం ఢిల్లీ లో పనిచేస్తున్న ఒక జాత్యాహంకార మనిషి మొహం చూడలని నా మనసు తెగ తహ తహ లాడుతోంది.

మన ఓపెనింగ్ సెర్మనీ చూడగానే ఆ మనిషి కి మెయిల్ చేద్దమనుకున్నా ఇదీ ఇండియా అంటే అని. కానీ,ఆవేశపడకూడదని ఆగా. ఒకవేళ క్రీడా నిర్వాహణ తుస్సుమంటే అని అనుమానం. ఇప్పుడవన్నీ పటాపంచలయిపోయాయి కదా.

Thursday, September 16, 2010

మా పాలవెల్ల్లిమా ఇంట్లో పాలవెల్లి కట్టి వినాయక చవితి పూజ చేసాము ఈసారి.అందులో విశేషమేముంది అంటారా...మరి ఈ ఫొటో చూడండీ.

ఎప్పుడో ఒక 3 సంవత్సరాలక్రితం ఇంట్లో ఉన్న చెక్కలతో పాలవెల్లి తయారు చేసాము. అంతే, మళ్ళీ ఈసారి. గడుల సంఖ్య అదీ పక్కన పెడితే ఈ పాలవెల్లి ప్రత్యేకత ఏమిటో తెలుసా? పాలవెల్ల్లి ఎలా చెయ్యాలా అని తెగ ఆలోచించి అప్పుడెప్పుడో ఒక షాపులో గార్డెనింగు వస్తువులమ్మే సెక్షన్లో ఈ చిన్న ఫెన్సింగ్ చూసినది గుర్తొచ్చి దానినే పాలవెల్లిగా మార్చేసాము.

అందుకే అంటారేమో దేనికి ఎక్కడ రాసిపెట్టి ఉందో అని.


గడుల సంఖ్య,రంగు పట్టించుకోకుండా మా పాలవెల్లిని చూడండే.

ఆణిముత్యాలు

టీవీ లలో కనపడుతున్నాము అనేసరికి కొంత మందికి ఒళ్ళూ పై తెలీదనుకుంటా. నోటికొచ్చిందల్లా వాగడమే.

కింద ఉదహరించిన కొన్ని ఆణిముత్యాలు చూడండి.

1)"ఎంతో పవిత్రం గా ఉండే ఈ నాలా(మురుగు కాలువ) ని అధికారులే ఇలా చేసారు"

నాలా లు పవిత్రం ఏమిటో మీకేమయినా అర్ధం అయ్యిందా?

2)ఎన్ని సంవత్సరాల నుండీ ఇక్కడే ఉంటున్నాము. ఇప్పుడు వచ్చి ఈ భూమి ప్రభుత్వానిది ఖాళీ చెయ్యండి అంటే ఇది మా మీద ప్రభుత్వం చూపుతున్న వివక్ష కి నిదర్శనం.

ఇంకా నయం,రాజ్ భవన్ దగ్గర చాలా సంవత్సరాల నుండీ ఉంటున్నారని అది కూడా మాదే అనలేదు.

3)స్కూలులో పిల్ల గాళ్ళని అట్లా కొట్టడాన్ని మేము ఖండిస్తూ, ఈ స్కూలు మూసివేయాల్సిందిగా ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాము.

పాపం పసి వాళ్ళని అలా కొట్టడం అమానుషమే, కాదనలేము,కానీ ప్రతీ దానికీ "మూసివేత" ఒక ఫ్యాషన్ అయిపోయింది. అలా మూసెస్తే విద్యార్ధుల పరిస్థితి ఏమిటి అనేది ఈ "నిత్య విద్యార్ధులకి"(అదేదో సంఘం పేరు చెప్పి యూనివర్సిటీలలో గడిపేవారు) అర్ధం కాదు కదా.

4)మా డిమాండ్లని పరిష్కరించకుంటే ప్రాణ త్యాగానికయినా సిద్ధం.

ప్రతీవాడిదీ జాతీయ సమస్యే. ట్యాంకులు,సెల్ టవర్లు,హైకోర్టులు కావేవీ ఆందోళనా స్థలాలుగా అనర్హం.
చావమనండి. ఇలాంటి వాళ్ళకి హైరానా పడుతూ బందోబస్తు చేస్తూ వీళ్ల చేతిలో పాపం పోలీసులు రాళ్ళ దెబ్బలు తినే బదులు అసలు వీళ్ళ చెత్త ఆందోళన లకి మీడియా వెళ్ళకుండా అడ్డుకుంటే ఇలాంటివి తగ్గుతాయి.

5)ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బంతా ఈయన దగ్గర పెట్టమండీ.రాత్రికి రాత్రే ఇలా ఉడాయిస్తాడనుకోలేదు. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.

అవును,ఆర్ధిక మంత్రి గారు వీరికి ష్యూరిటీ ఇచ్చి పెట్టుబడి పెట్టించారు కదూ.

6) మాకు దక్కల్సిన సీట్లు కేటాయించకుండా ఈ పరీక్ష నిర్వహించారు. దీనిని రద్దు చేయాలి.

పరీక్ష నోటిఫికేషన్ వెలువడినప్పటినుండీ వీరు ఏమి చేస్తున్నారో మరి.పరీక్ష అయ్యాకా రద్దు చేయమని వీజీ గా సిఫారసొకటి.

ఈ వేర్పాటు వాదులు సులభ్ కాంప్లెక్స్ లలో కూడా తమ వాటా అడుగుతారేమో.

ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి.మీరూ మరికొన్ని చెప్పండి.

Sunday, September 12, 2010

కొత్త శాపం

వినాయక చవితి ఉదయం. టీవీ ల వాళ్ళు పండగయినా పబ్బమయినా తమ వాయింపుడిని ఆపేది ఉండదు కాబట్టి జగన్ ఓదార్పు లాగ "సాగి"పోతున్నాయి రొటీన్ కార్యక్రమాలు.

రంజానూ,చవితి పండగల హడావిడిలో బ్రేకడానికి న్యూసు కూడా ఏమీ లేక గోళ్ళు గిల్లుకుంటున్నారు ఛానెళ్ళవాళ్ళు. ప్రతీరోజూ ఉదయం చర్చా కార్యక్రమమం పేరుతో జుట్లు ముడేసే యాంకర్లకి టాపిక్కేదీ దొరకట్లేదు. చూడబోతేనేమో స్టూడియోలో నాయకులొచ్చేసి కూర్చున్నారు.

కార్యక్రమం మొదలయ్యింది.

టీవీ 9 స్టూడియో:
స్టూడియో లో బెల్లంనాయుడు,పులకేశి,బీహెచ్ ఆశీనులై ఉన్నారు.తానో పెద్ద చర్చల నిర్వాహుకుడిని అని ఫీలయ్యే గజనీ కాంత్ చర్చ మొదలెట్టాడు.

బెల్లమ్నాయుడు గారూ మీరు చెప్పండి ఈనాటి రాజకీయ పరిస్ఠితి మీద మీరేమంటారు?

ఏముందయ్యా అనడానికి ఆరేళ్ళనుండీ విసిగిపోయాము అధికారం కోసం ఎదురు చూసీ చూసీ. కాంగ్రెసు వాళ్ళు కొట్టుకు చస్తే మాకు లాభం అనుకుంటొంటే మధ్యలో ఈ పులకేశి ప్రత్యేక నినాదం,ఓ పక్క నుండి ఆ సుప్రీం హీరో మా ఓట్లకి చిల్లెట్టేసినారు. మా పార్టీ సీయీవో స్పీచ్చి లాగా ఇసిగించకు నన్ను.

పులకేశి గారూ మీరు చెప్పండి.

ఏంది భాయ్ నీ లొల్లి? ఓ పక్క నేనడిగింది యాడిస్తరోనని పరేసాంతో నాకు దిమాక్ పని జేస్తలే. ఏందయ్యా,నాకు ఎర్ర బుగ్గ కారు ఈయలే అని పరేసాన్ తో నేను ఏదో పార్టీ పెడితే నా సుడి బాగుండి నాకు నాలుగు డబ్బులొస్తన్నయ్.పిచ్చ్చి స్టూడెంట్స్ ఆవేశం తో నేను జాతీయ ఫిగర్ అయి ఖుశిగుంటే నా రాష్ట్రం నాకు ఇప్పుడు ఇచ్చెస్తారు అప్పుడు వచ్చెస్తది అని మీ మీడీయ రాసి నాకు ఠీక్ సె నిద్ర గూడా పట్టనీయట్లా.

ఇట్లా కలిసి ఉంటేనే గదయ్యా నేను ప్రత్యెక రాష్ట్రం పేరు మీదా మా వాళ్ళు సినిమాల పేరు మీద దందాలు చేసుకునేది.మమ్మల్ని ఖుశీగుండనీయరా ఏంది?

బీహెచ్ గారూ మీరేమంటారు?
ఆయనున్నప్పుడు మమ్మల్ని తొక్కేసిండు.ఆయన పోయేపాటికి మా వయసైపోయింది.ఏదో మాట వరసకి పదవులక్కర్లేదు,పార్టీ బాగుండాలి అంటాం గానీ నా కంటే పెద్దాయన ఆ సీట్లో కూర్చుంటే మా మనసాగుతుందా?

సాక్షి టీవీ లో గజన్ యాత్ర నుండి లైవ్ వస్తోంది.

ఏదో ఎమోషన్లో ఓదారుస్తా అన్నాను అందరినీ.మా నాన్న సీటు నాకిచ్చెస్తే మాట దాటేసినా ఏమయ్యేది కాదు.ఆ సీటంటే ఎవరికి మోజుండదు?సీటు కోసం ఎండనక వాననకా తిరుగుతున్నా కానీ నన్నెవరూ పట్టించుకోవట్లేదు.ఛా..నేను చేసే యాత్ర రాజకీయం కాదు అని చెప్పడం పెద్ద చిక్కే తెచ్చి పెట్టింది. ఎంతసేపూ "మా నాన్న బ్రతికే ఉన్నారు మీ గుండెల్లో" అనో ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారనో ప్రతీ ఊరిలో చెప్పడం బోరు కొడుతోంది.. నా అక్కసు వెళ్ళ గక్కుకుంటే కానీ నాకు త్రుప్తి ఉండదు.


హెచ్చెం టీవీ వారు సీయం ఇంటి నుండి లైవ్:

ముఖ్యమంత్రి గారూ ప్రజలకి మీ సందేశం ఏమిటి?

ఏమాటకామాటే చెప్పుకోవాలయ్యా,ఇంతకముందెప్పుడూ ఇలా నన్ను ప్రత్యేకంగా పట్టించుకున్న పాపాన పోలేదు ఎవ్వరూ. ఈ సీటు మహిమ అంతా.కొత్తలో ఏదో నేను దానయ్యని అన్నా కానీ,సీటు వదలబుద్ధికావట్లేదు.అమ్మ జపం చేస్తూనే ఉంటాను తోక జాడించే సీను లేదు కాబట్టి అమ్మ కూడా నన్నేమీ తొలగించదు.


టీవీ 5 లో మహిళలకి పండగ సీజన్లో సరైన డిస్కౌంట్స్ లభించలేదు అన్న అంశం మీద మాట్లాడటానికి మహిళా నాయకురాలు వింధ్య స్టూడియోలో రెడీగా ఉన్నారు.

పండగ పూట కూడా ఏమిటండీ మహిళలు మహిళలు అంటూ మీ గోల?ఎవరెలా పోతే మాకేమిటి?ప్రతీ వాళ్ళూ మహిళల సమస్య మీద మమ్మల్ని కలవడమే.ఏదో గొంతు చించుకు అరవమంటే మగవారు అడ్డ గాడిదలు అనో మరోటొ తిడుతూ అరుస్తా కానీ నేనేమన్నా ఆరుస్తానా తీరుస్తానా?మనలో మన మాట,రోజూ అలా హై పిచ్చ్ లో అరవాలన్నా వీజీ కాదమ్మాయ్.

టీవీలు చూస్తున్న ప్రజలు నిర్ఘాంత పోతున్నారు అలా నాయకులు నిజాలు కక్కేసరికి.

ఇంతకీ నాయకులు ఎందుకు నిజాలు మాట్లాడారంటారు?
-----------------------------
-----------------------------
-----------------------------
-----------------------------
-----------------------------
-----------------------------
మన రాష్ట్ర ప్రభుత్వం మొన్న శుక్రవారం శలవు మార్చినంత హడావిడిగా వినాయకుడు రాజకీయ నాయకులకి కొత్త శాపాన్ని ఇచ్చాడు శుక్రవారం రాత్రి.

శాపమేమిటి అంటే,వినాయక చవితి నాడు టీవీలో కనిపించే ప్రతీ నాయకుడు/నాయకురాలు నిజాలే మాట్లాడతారు అని :).

Monday, August 30, 2010

ఆహా....నిజంగా ఇప్పటి విద్యార్ధులు ఎంత అద్రుష్టవంతులో. వీరిని చూస్తోంటే నాకు అనిపిస్తోంది, ఛా!! నేను ఒక 10-15 ఏళ్ళు లేటుగా పుట్టి ఉండాల్సిందని.

అప్పుడు "శివ" లేదా మరోటో చూసి నేర్చుకోవాల్సి వచ్చేది కాలేజీ ఫైట్లు గట్రా. ఇప్పుడు 2-3 గంటలు సినిమా చూసి పోరాటాలు నేర్చుకోక్కర్లేదు కదా!!. ఎంచక్కా మన నాయకులు ఒక అరగంట లో ఉపదేశిస్తారు "దాడి" ఎలా చెయ్యాలో.


సెమిస్టరంతా లెక్చరర్లని పట్టించుకోకపోయినా చివరాఖరికి ఇంటర్నల్సు,ప్రాక్టికల్సు ఎదురుగా కనపడేసరికి మన బాల్కి "నిప్పురవ్వో","ధర్మ క్షేత్రమో" చూసినంతగా జడుసుకుని చదవాల్సొచ్చేది. పరీక్షలు దగ్గర పడగానే లెక్చరర్లు కనిపిస్తే రాని నవ్వు మొహాన పులుముకుని విష్ చెయ్యల్సి రావడం ఎంత బాధాకరమో అనుభవిస్తే కానీ తెలీదు.

అదే ఇప్పటి విద్యార్ధులకి ఎన్ని ఆప్షన్సో. లెక్చరర్స్ నచ్చకపోతే ఏదో ఒక "కాస" (కార్యాచరణ సమితి) పేరు చెప్పి చితక్కొట్టచ్చు..లేదా నేనే ఒక "ఫలానా" కాస అని పెట్టి నాయకుడయిపోవచ్చు.మార్కులు తక్కువొస్తే నేను ఫలానా ప్రాంతానికి చెందుతా కాబట్టే మార్కులు వెయ్యలేదని ఆందోళన చెయ్యచ్చు. లేదా ఇంకేదో చెప్పి కాలికి వేస్తే మెడకి,మెడకి వేస్తే కాలికి అన్నట్లు మాట్లాడి నాకు మార్కులు తక్కువ రావడానికి కారణాన్ని ఎటో తోసెయ్యచ్చు.

నేను చదువుకునేటప్పుడు నాన్నగారికి ఫీజు విషయం చెప్పలంటే ఒకింత భయం వేసేది. పాపం ఆయనకి ఇబ్బంది అని. ఇప్పట్లా "బోధనా రుసుము" అడిగితే చితగ్గొట్టండి అని పిలుపునిచ్చే మా గొప్ప నాయకులెవ్వరూ అప్పుడు లేరాయె.

ఇప్పుడు విద్యార్ధులకి ఎన్ని శెలవలో.ఒక నెల రోజులు సరిగ్గా తరగతులు జరుగుతాయో లేదో ఏదో "కాస" నాయకులకి ఈ నిశ్శబ్దం నచ్చదు. వారి ఆందోళన మూలంగా శెలవులు.

ఈ "...విద్యార్ది కాస" నాయకులు మన టాలీవుడ్ హీరోలకి ఏ మాత్రం తీసిపోరు. ఈ నాయకులలో ఒక్కరూ "విద్యార్ధి" అనుకుందామన్నా కానీ అనుకోలేము.మన అగ్ర హీరోలు సినిమాలలో కాలేజీ స్టూడెంట్ వేషం వేసి "యూత్" అని అరిచి గీ పెట్టినా మన మనసు అంగీకరిస్తుందా?
(అదేదో పార్టీ "యూత్" వింగ్ లీడర్ కూడా ఏమీ తీసిపోడు లెండి ఈ విషయంలో.)

నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా చెప్పండీ?అయినా "నేతి" బీరకాయ అనట్లేదూ..అలాగే వీళ్ళనీ అంగీకరించాలేమో.

(ఈ నెల 28 న జరిగిన దాడిలో గాయపడ్డ లెక్చరర్లకి సానుభూతి మరియు క్షమాపణలతో)

Thursday, August 12, 2010

ప్చ్చ్..ఎందుకిలా


ఈ మధ్య మా అమ్మతో ఫోనులో మాట్లాడుతుండగా "XYZ" గారి టాపిక్ వచ్చింది.ఆవిడ మా దూరపు బంధువు.అవడానికి దూరపు బంధుత్వం అయినా కానీ బాగా తెలుసు ఆవిడ నాకు.

సరదా కబుర్లు రాస్తూ వచ్చా ఇన్నాళ్ళూ బ్లాగులో.కానీ ఈరోజు ఎందుకో ఉండబట్టలేక ఈ పోస్టు.

ఆవిడ మన రాష్ట్రం లో ఒకప్పుడు పెద్ద లాయరు.భార్యా భర్తా ఇద్దరూ లాయర్లే.ఒకప్పుడూ అంటే ఎప్పుడనుకున్నారు?1960 లా మాట ఇది.మాంచి వాగ్ధాటి ఆవిడకి.అందుకే అంత బాగా రాణించగలిగిందేమో ఆ వ్రుత్తిలో అనిపిస్తుంది.ఇంగ్లీషు,తెలుగు దదడలాడీంచెస్తుంది అంతే.వాళ్ళ ఊరు వెళ్ళి ఫలానా వాళ్ళ ఇల్లు ఏది అంటే వెనకటి పాత తరం మనుషులు ఎవరయినా ఇట్టే చెప్తారు.నా ఇంటర్మీడియట్ తరువాత మొదటిసారి ఆవిడని చూసాను.అప్పటికే ఆవిడ రిటైర్ అయిపోయారు.మొదట్లో అబ్బా,బోర్ మనిషి అనిపించేది.ఆరోగ్యం పట్ల ఆవిడ శ్రద్ధ అమోఘం అనిపిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తే.కొత్తలో ఆవిడ ఆహారపు అలవాట్లు అవీ చూసి నవ్వొచ్చేది.ఆక్యూ ప్రెషర్ అనీ,హెల్తు డ్రింకులనీ ఏవేవో చేసుకుంటూఉండేది ఆవిడ.మొదట్లో బోరు అనిపించినా రాను రాను ఆవిడంటే గౌరవం పెరిగింది.

ఈవిడ భర్త మాత్రం సరి అయిన శ్రద్ధ తీసుకోక ఆరోగ్యాన్ని చేజేతులా పాడుచేసుకున్నారు.ఆవిడ పిల్లలు అందరూ విదేశాలకి ఎగిరిపోయారువాళ్ళు ఎంత రమ్మన్నా కానీ ఈ మాజీ వకీలులు ఇద్దరూ వెళ్ళలేదు. పాపం లంకంత ఇంట్లో ఈవిడ ఒక్కర్తే ఉండేది,అనారోగ్యపు భర్తతో.ఎవరినో ఇంట్లో పెట్టుకున్నారు వీరి బాగోగులు చూసుకోవడానికి.కానీ సొంత వాళ్ళతో ఉన్నంత కలివిడీగా ఉండలేరు కదా.పైగా ఎక్కడో దూరం గా ఉన్న పిల్లలు వారానికి ఒక సారి ఫోను చేసి మాట్లాడితే చాలు మురిసిపోయేది ఈవిడ.ఇక్కడ ఇంట్లో వీరిని చూసుకోవడం కోసం పెట్టుకున్న మనిషి ఎంత బాగా వీరిని చూసుకున్నా సరే ఈవిడకి పిల్లలు దగ్గర లేని లోటు బాగా ఫీల్ అయ్యేది.

కాల చక్రం ఆగదు కదా.కొన్ని సంవత్సరాలకి ఈవిడ ఒక్కరే మిగిలారు.శరీరం సహాయ నిరాకరణ ప్రారంభించింది మెల్లిగా.పిల్లలు అప్పుడప్పుడు రావడం కూడా తగ్గించేసారు.ఇండియా లో ఉన్న ఒక్కగానొక్క కూతురు ఈవిడని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంది.నా తోడపుట్టిన వారు అందరూ విదేశాలలో ఉన్నారు కదా,వారికి ఎందుకు నీ ఆస్తి,అంతా నాకు రాసేయి అని బలవంతం చేసి రాయించుకుంది.ఈవిడా మారు మాట్లాడకుండా రాసేసింది పాపం.

అసలు కధ అంతా అక్కడే మొదలు.ఇంతలో సడెన్ గా అమెరికా నుండి కొడూకు ఉరుము లేని పిడుగు లా ఊడిపడ్డాడు.చెల్లికి ఆస్తి మొత్తం రాయడమేమిటి అంటూ గొడవ పెట్టి వీలునామా తిరగతోడాడు.మొత్తానికి వాదోపవాదాల తరువాత అస్స్తి అందరికీ చెందేటట్లు రాయించారు.

అసలు ఈవిడ పిల్లలెవరికీ ఈ ఆస్తి అవసరం లేదు వాళ్ళు ఉన్న పొజిషన్స్ కి.కానీ డబ్బెవరికి చేదు?

ఒకానొక శుభ ముహుర్తాన ఈవిడని హాస్పిటల్ కి తీసుకెళ్ళి శాశ్వతం గా అక్కడే వదిలి ఎవరి ఇళ్ళకి వారి తిరిగి వెళ్ళిపోయారు.

కొన్ని రోజులకి ఆ పిచ్చి తల్లికి నిజం తెలిసింది,ఇది ఒక ఖరీదయిన ఓల్డేజీ హోంకి అనుబంధ ఆసుపత్రి అని.

అంతే,ఇక ఆవిడ మెమొరీ క్షీణించడం మొదలెట్టింది.ఇప్పుడు ఎంత దగ్గరి వారు వెళ్ళినా మీరెవరు అంటుంది.మొన్న కొడుకు వచ్చినప్పుడూ మాత్రం అలా ఏడుస్తూ ఉండిపోయిందిట రోజంతా.మరి గుర్తు పట్టిందేమో.

ఈ మధ్య మా ఇంకొక కజిన్ వెళ్ళి పలుకరిస్తే,మీది ఏ వూరు అందిట.ఫలానా అని చెప్తే,ఓ ఆ ఊరా..మా ఊరు వెళ్ళలంటే ఆ ఊరు మీద నుండే వెళ్ళాలి అందిట.ఎన్ని డబ్బులు,పేరు ప్రఖ్యాతులు మన యవ్వనం లో సంపాదిస్తే ఏమి లాభం?మనము ఎన్ని జాగ్రత్తలతో ఆరోగ్యాన్ని కాపాడుకున్నా కానీ మన శరీరం సహకరించనప్పుడు ఇలాగే ఉంటుందేమో అన్న ఊహే భయంకరం అనిపించింది నాకు.


ఎందుకో నాకు మనసంతా భారం అయిపోయింది ఆవిడ గురించి విన్నాకా. అందరి పిల్లలూ అలా ఉంటారని కాదు కానీ...అలాంటి పిల్లలు లేని వారు అద్రుష్టవంతులు నిజంగా.

ఈ మధ్య చదివిన క్రింది వాక్యం గుర్తొచ్చింది నాకు.
పిల్లల్ని కనడం కంటే ఒక కొబ్బరి చెట్టు నాటడం మేలు.పిల్లలేమి ఇస్తారు కన్నీళ్ళు తప్ప,కనీసం ఆ చెట్టు కొబరినీళ్ళయినా ఇస్తుంది.

Tuesday, August 10, 2010

జై జవాన్ ,జై హో భారత్


వచ్చెస్తోంది వచ్చెస్తోంది స్వాతంత్ర్య దినోత్సవం.ఇప్పుడు స్వాతంత్ర్య దినోత్సవమయినా మరే జాతీయ పండుగయినాజస్ట్ హాలిడే అంతే కదా.ఆ పండుగలు కనుక ఏ శుక్రవారమో సోమవారమో వస్తే లాంగ్ వీకెండ్ అని సంతోషం.

ఎవరినో గేలి చెయ్యడానికో ఆక్షేపించడమో కాదండీ.నేనయినా అలాగే ఆలోచిస్తాను.మనలో ఎంత మంది ఝండా వందనానికి వెళ్ళి ఉంటాము ఈ మధ్య కాలంలో?వాటికి వెళ్తేనే దేశ భక్తి ఉన్నట్లా అని అడుగుతారని నాకు తెలుసు.కానీ ఒక్క సారి వాటికి వెళ్తే వచ్చే "నా దేశం" అనే ఫీలింగే వేరు.ఇప్పటికీ మనలో చాలా మందికి మన ఝండా అలా రెప రెపలాడుతూ వెనక "జణ గణ మణ" వింటే అదో ఫీలింగ్ కలగదూ?

అసలు తప్పు సగం మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్న చానెళ్ళదేమో అనిపిస్తుంది నాకు.చిన్నప్పుడు మా నాన్నగారు ఆగస్టు పదిహేను ,జనవరి 26 అప్పుడు కూర్చోబెట్టి పరేడ్ చూపించేవారు.పరేడ్ పూర్తిగా చూడటం అయ్యేది కాదు స్కూలు వల్ల.నాకు గుర్తున్నంత వరకూ మన దేశ రాజధానిలో ఝండా వందనం ఉదయం ఏడు-ఏడుంపావు కల్లా అయిపోయేది.అది మిస్స్ అయ్యేవాళ్ళము మాత్రం కాదు.

ఇప్పుడు పిల్లలకి బలవంతంగా కూర్చోబెట్టినా అవతల కార్టూన్ నెట్వర్క్ లో "బెన్-10" ఏమి చేస్తున్నడో,పోకీమోన్ కొత్త ఎపిసోడ్ మిస్స్ అవుతున్నాము అనే ఆత్రుత తో మన కోసం ఏదో కాసేపు బలవంతంగా చూస్తారంతే.

ఇప్పుడు డీడీ లో తప్ప అసలు ఆ పరేడ్ ఎన్ని ఛానెల్స్ లో వస్తుంది?కొంచం కొంచం క్లిప్పింగులు చూపించడం వేరు,పరేడ్ మొత్తం ప్రత్యక్ష ప్రసారం వేరు.ఆ పరేడ్ అయ్యే గంత-గంటన్నరలో ఈ ఛానెల్సు తమ "బ్రేకింగు న్యూసులని" ఆపితే ఏమి సొమ్ము పోతుందో.మన ఛానెళ్ళ వాళ్ళు జాతీయ పండుగలయినా,మరే పర్వ దినమయినా కానీ ఆడవారు అయితే చీరలు,మగ వారు షేర్వాణీలు వేసుకుని తయారయిపోయి రొటీన్ బోరింగ్ కార్యక్రమాలని నిర్వహిస్తుంటారు.లేదా మధ్య మధ్యలో "ఈ రోజు మన దేశ స్వాతంత్ర్య దినోత్సవమా,గణ తంత్ర దినోత్సవమా" లాంటి చచ్చు ప్రశ్నలతో ఎస్సెమ్మెస్ కాంటెస్టులు.మధ్యాహ్నం ఒక రెండున్నర గంటల "బ్లాక్ బస్టర్" మూవీ ని యాడ్స్ వల్ల ఒక నాలుగ్గంటలు సాగదీయడం.సాయంత్రం లేటెస్ట్ గా రిలీజయినా మూవీ స్టార్స్ తో చిట్ చాట్.ఇంతే కదా.

మనకి ఎంటర్టెయిన్ మెంట్ ఉండాలి కాదనను కానీ కనీసం ఈ జాతీయ పండుగలప్పుడయినా కాసేపు మన సైనికులు నిర్వహించే కవాతు వగైరా చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది.

అసలు ప్రభుత్వం కూడా ఈ భావం పెంపొందించే దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.రాజధానిలో ఆ కార్యక్రమం జరిగినంతసేపూ దేశమంతా ప్రైవేటు చానెళ్ళ ని ఆపెస్తే బావుండు."శుభాకాంక్షలు","విరగ్గొట్టే వార్తలు"(బ్రేకింగు న్యూస్)ఉండవు హాయిగా.మీడియా హక్కులని కాలరాయడం అంటారేమో నేను ఇలా రాసినందుకు.మన రాజ్యాంగం కూడా మన ఝండా మీద బోలెడు ఆంక్షలు పెట్టినట్లుంది.అందరూ తమ వాహనాల మీద భారత ఝండాని ఎగురవేసుకోకూడదు ఎక్సెట్రాలు.

ఇక మన రాజకీయ నాయకులు దేశభక్తి విషయంలో ప్రదర్శించే నటనా కౌశలం అధ్భుతం.ఎంత సేపూ తమ ఫోటో,కింద పార్టీ "అమ్మ","అన్న" ల ఫోటొలు,మరి కాస్త కింద మందీ మార్బలం పేర్లేసుకుని ఇచ్చే యాడ్ లో అసలు మెసేజీ కనపడదు.రాజకీయ సభలకి జనాలని పోగేసినట్లు ఈ నాయకులు ఝండా వందనం చేయడానికి ఎందుకు సమీకరించరో మరి.

మనము వెళ్ళి సరిహద్దు వెంబడి గస్తీ కాయలేకపోవచ్చు కానీ ఒక్క సారి వారి సేవలని తలచుకుని " జై జవాన్ ,జై హో భారత్"అనుకుంటే చాలు. తమ ప్రాణాలని పణం గా పెట్టి మరీ గస్తీ తిరుగుతూ,దురద్రుష్ట వశాత్తూ ప్రాణాలు కోల్పొయిన జవానులకి ఇచ్చే మనమిచ్చే నివాళి.


పెద్దవారికయినా,చిన్న వారికయినా ఏది వింటే,చూస్తే అదే మన మనసులో కొన్ని రోజులుండిపోతుంది.(తెలుగు వారికి ఆ మధ్య "రాజువయ్య " పాట వెంటాడినట్లు)

ఇంకో చిన్న ఉదాహరణ.ఆ మధ్య మా మామయ్యగారు మరికొంత మందితో కలిసి ఉత్తర భారత యాత్ర లో భాగం గా "వాఘా" సరిహద్దు కి వెళ్ళారు.అక్కడ జరిగే పరేడ్ చూస్తే ప్రతీ భారతీయుడి అణువణువు లో దేశభక్తి పెంపొందుతుందిట.ఒక పక్క మన సైన్యం,మరొక పక్క పాకిస్తాన్ సైన్యం కవాతు చేస్తాయి.

యాత్ర లో మామయ్యగారితో పాటు ఉన్న వాళ్ళలో 60 పైబడిన స్త్రీలు, (మోకాళ్ళ నెప్పులతో బాధ పడే వారు) కూడా ఉన్నారు.మన సైనికులు అందించిన ఝండా పట్టుకుని "భారత్ మాత కీ జై" అంటూ అవలీలగా పరుగు పెట్టారుట ఒక 100 మీటర్లు.తరువాత మామయ్యగారు వారిని అడిగారు,మీరు అలా ఎలా పరిగెత్తారు అని. దానికి వారిచ్చిన సమాధానం:
"ఏమో నండీ,అందరూ భారత్ మాతా కీ జై అని అరుస్తోంటే అలా తెలీకుండానే పరిగెత్తాము".


భారత్ మాతా కీ జై

Friday, July 9, 2010

ప్చ్.వైయెస్సారు మరణించకపోయుంటే..
ఏమిటో ఈ టపా రాద్దామని ఎన్ని రోజుల నుండో అనుకుని అలా పోస్టుపోన్ చేస్తూ వచ్చాను కానీ ఈరోజు జరిగిన ఒక సంఘటన ఈ టపా కి ప్రేరణ.

చాలా రోజులయ్యింది మన తెలుగు చానెళ్ళు చూసి అని చూడటం మొదలెట్టా."మహా నేత" జయంతిట కదా ఈరోజు.నిన్నే అనుకున్నా,ఎట్టి పరిస్థితిలోనూ ఈరోజు "సాక్షి" టీవీ చూడకూడదని.ఉత్తప్పుడే వైయెస్సార్ మహా నేత,యుగపురుషుడు అని కీర్తిస్తూ పాత పాటే పాడే ఆ చానెల్ ఇక ఎంత హడావిడి చేస్తుందో తెలుసు కదా.ఛానెల్ ప్రసారాలలో ఆయన ఫోటో ఎల్ల వేళలా స్క్రీను మీద ఉండెటట్లు చూడటం తప్ప కార్యక్రమాల నాణ్యత మీద ఫోకస్ పెట్టినట్లు అసలు అనిపించదు."రావణ్" సినిమా గురించీ ఇలాగే ఏవో ఏవో ఊహించేసుకున్నా,చివరికి అది తుస్సంది కదా,అలాగే మొత్తానికి మన సాక్షి చానెల్ ఈరోజు మూగబోయింది.

హమ్మయ్యా,ఆ గోల లేదు అనుకుంటోంటే,వనితా టీవీ ఆ బాధ్యత తీసుకుంది.ఎలాగూ ఆ చానెల్ పెద్దగా చూడను కాబట్టి ఓకే.వారు చెప్తే నిజం అవుతుంది ఏ వార్త అయినా కానీ అని గాఢం గా నమ్మే వేమూరి వారి చానెల్ వారు ఎప్పుడో జగన్ వెనకాల పడటం మొదలెట్టారు.పొగిడో తెగిడో జగన్ జగన్,ఇది తారకనామం అయిపోయింది వారికి.ఇక టీవీ 9 అయితే ఈరోజు జయంతి మీద ప్రోగ్రాం చేస్తూ ఆ ప్రోగ్రాం నిండా ఆయన మరణ తాలూకు ద్రుశ్యాలే.

ఇక ఆయన వర్ధంతి రోజు వెయ్యడానికి ఏమీ మిగల్లేదు వీరికి. అయినా రీ యూజ్ కాన్సెప్ట్ ని బాగా వంట పట్టించుకున్న ఆ చానెల్ కి ఇది ఒక సమస్య కాదు కదా.

ఆయన చనిపోతే రాష్ట్రం కన్నీటి సంద్రం అయ్యిందిట.చిన్న సైజు స్విమింగు పూలు కూడా కాలెదనిపిస్తుంది నాకు.మీడియా ఆయన అద్రుశ్యం అయినప్పటినుండీ ఆ ఎపిసోడ్ ని బాగా స్లో పాయిజన్ లాగ జనాల్లోకి ఎక్కించేటప్పటికి మరునాటికల్లా పిచ్చి జనాలు సెంటిమెంటు కార్చెసారు.ఇక ఆయన మరణ వార్త కన్ ఫర్మ్ అయ్యింది మొదలు "సూర్యుడే శెలవని","రాజువయ్యా" పాటలు కూడా తమ వంతు పాత్ర పోషించాయి.
ఇక ఆయన మరణ వార్త విని ఆగిన గుండెల గురించి చర్చ చాటభారతమే అవుతుంది.ఆగితే ఆయనతో ఆర్ధిక లావాదేవీలున్న వాళ్ళ గుండెలు ఆగాలి కానీ...ఇంకా నయం, పశు పక్ష్యాదులు కూడా తట్టుకోలేక ప్రాణం విడిచాయి అనలేదు.

సీరియళ్ళలో కోడలి కష్టాలు చూసే కన్నీరు కార్చేసే జాతి మనుష్యులు ఎక్కువ రియాక్ట్ అయిన మాట వాస్తవం.ఆయనే కాదండీ,ఎవరయినా పోయాకా వారి గురించి అంతా మంచే కనిపిస్తుంది,వినిపిస్తుంది మనకి. ఎక్కడో మన పీవీ లాంటి వాళ్ళ గురించి తప్ప.

అప్పుడెప్పుడో దూరదర్శన్ మాత్రమే ఉన్నప్పుడు ఎవరయినా రాష్ట్రపతో ప్రధానమంత్రో మరణిస్తే కార్యక్రమాలు అన్నీ ఆపేసి టూ... అంటూ వయోలిన్ వాదం వినిపించేది అంతే.

ఇప్పుడు ఎంత అంగబలం అర్ధ బలం ఉన్నవాడు మరణిస్తే అంత ప్రచారం.తాను బతికుండగా కూడా ఎప్పుడూ ఇంత ప్రచారాన్ని వైయెస్ పొంది ఉండరు.

అసలు ఆయనని ఏ ప్రాతిపదికన యుగ పురుషుడు అంటారో అర్ధం కాదు.ఏదో ఎఫ్.యం. రేడియో చానెల్ వారి ట్యాగ్ లైన్ "విను వినిపించు" లాగ ఈయన అధికారం లో ఉన్నన్నాళ్ళూ "తిను,తినిపించు" అంటూ దర్జాగా ఖజానా ఖాళీ చేసారు అంతే కదా.ఏవో కొన్ని ప్రజోపయోగ కార్యక్రమాలు చేసారు కాదనను కానీ యుగపురుషుడు అని కీర్తించడం మాత్రం తగునా చెప్పండి.

ఊరూరా గాంధీ విగ్రహాలున్నట్లు,ఇక వైయెస్సార్ విగ్రహాలు కూడా ఉంటాయేమో అన్ని విడతల ఓదార్పు యాత్ర పూర్తయ్యేసరికి.
అసలు ఛానెల్స్ వార్తలు చూస్తే జగన్,పేపర్ తిరగేస్తే జగన్.లేదా ఎక్కడో ఎవరినో ఓదారుస్తూ జగన్.ఏమిటండీ ఈ గోల.ఈ గోలంతటికీ కారణం వైయెస్సార్ మరణమే కదా.

అదే ఆయనే మరణిచకపోయి ఉంటే..అన్నది అందుకే.

Friday, July 2, 2010

"ఓదార్పు" సక్సెస్ కి నా సలహాలు
పాపం అదేదో యాత్ర చేసి జగన్ మైలేజీ తెచ్చుకుందామంటే "అమ్మ" పడనీయట్లేదాయే.అడగనిదే అమ్మయినా పెట్టదంటారని కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్ళి మొరపెట్టుకున్నా కానీ "అమ్మ" 15 నిమిషాలలో మొత్తం "సావధానం" గా ఆలకించి నో అందిట పాపం.పరస్పర పలకరింపులు గట్రా అవ్వడానికే ఒక 5 నిమిషాలు పడుతుంది,అలాంటిది సావధానం గా ఆవేదన మొత్తం ఆ పావుగంట లో అమ్మ ఎలా విందో అర్ధం కాలేదు నాకు.

ఏదయినా సాధ్యమే లెండి ఆవిడకి.ఆ పార్టీ వ్రుద్ధులలో కొంతమందికి రాహుల్ ని ప్రధాని గా చూసి కన్ను మూస్తే చాలుట.రాను రాను "అమ్మ" పైత్యం ముదురుతోంది అందరికీ.ఇక 2014 ఎన్నికలప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో.ఇక ఈ "అమ్మ"ని పోల్చటానికి ఉపమానాలు ఏమీ మిగలవేమో మన నాయకులకి అప్పటికి.

ఈ మహాతల్లికి మన పీవీ పేరంటేనే పడదనుకుంటా.రాజీవు,ఇందిరల పేర్లు పెడితే సులభ్ కాంప్లెక్సులయినా వచ్చి ఓపెన్ చేసెస్తుంది ,కానీ మన పీవీ గారికోసం ఒక్క పది నిమిషాలు కేటాయించదు.చనిపోయిన వాళ్ళందరూ "మహా నేత" లు కదూ,కానీ మన పీవీ ఎందుకు మినహాయింపో దానికి.

ఇంతకీ నేను చెప్దామనుకున్నదేమిటంటే,జగన్ వెళ్ళి ఓదార్చడం మాట దేవుడెరుగు కానీ,తల పక్కకి వాల్చి అలా దీనం గా మొహం పెట్టిన జగన్ ని చూసి అర్జంటుగా వెళ్ళి అతన్ని ఓదార్చాలనిపించింది.అస్సలు జగన్ కి మైలేజీ తెచ్చుకోవడం ఎలాగో బొత్తిగా తెలీదనుకుంటా.మన రాములమ్మ,అదేదో సంఘం నేత ఒకాయన,బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఓవర్ నైట్ పాపులర్ అయిపోలేదూ డ్రామాలు నడిపి.


రాములమ్మ చూడండి,ఒక్క మాటతో రాత్రికి రాత్రే పాపులర్.మీడియ అంతా ఆవిడ ఇంటి ముందు హడావిడి. రాములమ్మ తన స్పీచ్ తో నిప్పులు చెరిగింది,బొగ్గులు రాల్చింది అని మీడియా గోల పెడుతోంటే,టీవీ క్లిప్పింగులలో చూసాను ఆవిడ గారి వివాదాస్పద(?) స్పీచ్."నరికెయ్యండి" అని అంటున్నాప్పుడు అసలు ఆవేశమే లేదు మనిషిలో.కనీసం గొంతు కూడా పెంచి అరవలేదు."ఈ పెద్దోళ్ళున్నారే" అనే డైలాగ్ చెప్పేటప్పుడు కనీసం మన ఉ.కి.(ఉదయ్ కిరణ్) గొంతు లో పలికిన రోషం కూడా లేదు.


అయినా మీడియా నోట్లో నానుతోందా లేదా.పైగా ఈవిడ గారిని అరెస్టు చేస్తే,రేపు బందుట తెలంగాణాలో.తమ "పొమ్మంది నాదం" సినిమాకి "మంచు" ఫ్యామిలీ చేస్తున్న హడావిడి కామెడీ ని మించిపోయింది రాములమ్మ నాటకం.కాబట్టి ఆ యాత్రేదో దిగ్విజయమవ్వాలంటే మన రాజకీయ నాయకులని చూసి మైలేజీ తెచ్చుకోవడం ఎలాగో జగన్ కాస్త నేర్చుకుంటే చాలు టూరు సక్సెస్.

Sunday, June 27, 2010

కాసిని కబుర్లు

గత వారం చానెళ్ళు మారుస్తోంటే సైన నెహ్వాల్ మ్యాచ్ లైవ్ వస్తోంది.ఆహా విదేశం లో ఉండి మన క్రీడాకారిణి మ్యాచ్ టీవీ లో లైవ్ చూసే భాగ్యం అనుకుంటూ చూసా.చాలా బాగా ఆడి టైటిల్ నెగ్గింది ఆ అమ్మాయి. ఇప్పుడే హెడ్లైన్స్ కోసం అలా పేపర్ చూస్తోంటే సైన మరో టైటిల్ గెలిచింది అని వార్త.

ఏమిటో అసలు పేపర్లలో ఈ అమ్మాయి ఊసు పెద్దగా లేదు వారం లో రెండు టైటిల్స్ (ఈరోజు దానితో కలిపి మూడు) గెలుచుకున్నా కానీ.రెండొ పెళ్ళి వాడిని చెసుకున్న సానియ కోసం మాత్రం పడిగాపులు పడతారు ఈ మీడియా వాళ్ళు రోజుల తరబడి.

టీవీ లలో కూడా కవరేజీ రావలసినంత రాలేదు అని అనిపించింది.ఈ అమ్మాయి గెలవడం ఏమో కానీ ఆమె కోచ్ గోపీ చంద్ ఇంటర్వ్యూలకి తయారయిపోతాడు ముందు.అప్పుడెప్పుడో ఆయన గెలిచిన ఒకేఒక టైటిల్ ని ఇంటి పేరు చేసి పడేసారు మనవాళ్ళు ఆయనకి.

అసలు విషయం వదిలెసి ఇలా అనవసర వాటికి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళని మనిషివా మీడీయా పర్సన్ వా అని తిట్టాలనిపిస్తుంది నాకు.

ఇక ఈరోజు పేపర్లో "మంచు పూలు" అంటూ తాను అన్నగారంతటి నటుడిని అని తెగ ఫీలయ్యే "బాబు" గారి పుత్రిక,పుత్రుల ఇంటర్వ్యూ చూసాను.


ఆ "మంచు" పుత్రుడు ఈ మధ్య నటుడిగా ఓకే అనిపిస్తున్నాడు.ఆ పుత్రిక వచ్చీ రాని తెలుగు మాట్లాడటం ఫ్యాషన్ అనుకుంటూ నడిపే టాక్ షో అయితే దారుణం.దానిని ఆవిడగారు సూపర్ హిట్ అనుకుంటూ ఉంటుంది.తానేదో మల్టీ టాలెంటెడ్ అని ఈవిడ గారి ప్రఘాడ నమ్మకం.ఆ మాత్రం స్వోత్కర్ష ఉండాలి లెండి,లేకపోతే సినీ ఇండస్ట్రీ లో కష్టం.

ఈరోజు ట్విట్టర్ లో మన సినీ రంగం వారు ఎవరున్నారని చూస్తోంటే ఈ అమ్మాయి కనపడింది.ఈవిడ పోస్ట్ చేసిన ఒక ఫోటో చూస్తే నాకు కిషన్ గారు ఇక్కడ చెప్పినదానికంటే దారుణం గా దేవింది కడుపులో.మన స్టైలిష్ స్టార్ తో ఈ అమ్మాయి కలిసి తీయించుకున్న ఫొటో.విడివిడిగా ఇద్దరినీ చూడటమే కష్టం,ఇక జంటగా అంటే...బంపర్ ఆఫరే.

నా బ్లాగు నింపుకోవడానికయినా ఈవిడ ప్రోగ్రాంస్ రెగ్యులర్ గా చూడాలని నిర్ణయించుకున్నాను.

ఇక చివరగా,రావణ్ సినిమా విడుదలయిన రెండో రోజు చూసా నేను. "మణి రత్నం కీ ఆగ్" అనిపించింది నాకు ఈ సినిమా చూడగానే.

Sunday, May 30, 2010

పదీ,పదీ,ఇరవై,ఇరవై ఐదు.....

మొన్న ఎంసెట్,10 వ తరగతి రిజల్ట్స్ వచ్చినప్పటినుండీ చూస్తున్నా,బ్లాకుల్లో టిక్కెట్లమ్మేవాళ్ళ అరుపుల్లాగ 10,10,20 అంటూ ఒకటే అరుపులు వివిధ కాలేజీ/స్కూళ్ళ వాళ్ళు.అసలే విద్యాసంస్థ ల యాడ్స్ చిరాగ్గా ఉంటాయి మామూలుగా చెప్తేనే.ఇక ఈ ర్యాంకుల ప్రకటించికోవడం లో వాళ్ళ తీరు బ్లాక్ టిక్కెట్ అమ్మేవాళ్ళని గుర్తు తెచ్చింది.ప్రతీ విద్యా సంస్థా తాము చరిత్ర స్రుష్టించామని,తిరగరాసామని ఒకటే గోల సినిమాలలో ...వారి వంశం లాగ.కొన్ని విద్యా సంస్థలయితే ఇంకో అడుగు ముందుకేసి,ఆల్ రౌండర్లని తయారు చేస్తాము అంటూ విద్యార్ధులు వివిధ క్రీడలు,సాంస్కౄతిక కార్యక్రమాల క్లిప్పింగ్స్ ఒకటి.అసలు ఈ రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో ఇవన్నీ ఉంటాయి అంతే నమ్మశక్యమా?లేదా చిన్ని చిన్ని ఎల్కేజీ పిల్లలు యోగా నో ప్రాణాయామానో చేస్తున్నట్లు చూపించడం.అసలు మన నట సింహాన్ని మించిపోతున్నాయి ఈ విద్యా సంస్థలు కామెడీ చెయ్యటంలో.

అదేదో స్కూలు అయితే గత 3-4 నెలల నుండీ చూస్తున్నా,అడ్మిషన్లు ప్రారంభమయినవి అని యాడ్.ఇంటర్నేషనల్ స్కూలు,కాన్సెప్ట్ స్కూలు,టెక్నో స్కూలు పేరు ఏదయితేనేమిటి,అన్నింటా పిల్లలని కోచింగు అనే మిక్సీ లో వేసి బయటకి తియ్యడమే కదా.

ఇలాంటి స్కూలు,కాలేజీల లో అడుగుపెట్టాకా వారు ఇచ్చే కోర్సు వివరాలు చూసి అందులో మనకి(ఇక్కడ పిల్ల గురించి ఆలొచించము కదా)సరిపడేది ఎన్నుకోవాలంటే తాతలు దిగొస్తారు.ఆ ఎంట్రన్సు,ఈ ఎంట్రన్సు కి కలిపి అనో,ఇంకేదో చెప్పి ఓ 5-6 కోర్సులు వాటి ఫీజులు మన ముందుంచుతారు.ఈ కోర్సులని ఎన్నుకోవడం కంటే ఏ కొరియా దేశపు ఫుడ్ కోర్టు కో వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చెయ్యడం తేలిక.విద్యా సంస్థలని అని ఏమి లాభం?మనమే స్వయం గా పిల్లలని వెయ్యడానికి ఏ మిక్సీ బ్లేడు పదునుగా ఉందో చూసి మరీ వేస్తోంటేను.మొన్న ఆ మధ్య సాయంత్రం 6-7 గంటల మధ్య ఒక కార్యక్రమం చూసాను.ఆరోజే ఏదో ఎంట్రన్సు ఎగ్జాం జరిగింది.ఆ పరీక్ష లో ఎన్ని మార్కులొస్తే ఎక్కడ సీటు వస్తుంది,ఏ బ్రాంచీ లో వస్తుంది వగైరా వివరాలు చెప్పే కార్యక్రమం అది.ఆ కార్యక్రమానికి పిల్లల కంటే తల్లితండ్రులే ఎక్కువ కాల్ చేసారు.మా అబ్బాయి కి ఇన్ని మార్కులు రావచ్చు సీటు రావచ్చా,రాకపోతే ఎలాగ అన్న ఆదుర్దా చాలా మందిలో.వీళ్ళ వరస ఎలా ఉందీ అంటే,ఇంజనీరింగు చెయ్యకపోతే ఇక మా పిల్ల/పిల్లాడు వేస్టు అన్నట్లు.

అసలు నాలుగు,ఐదు తరగతుల నుండీ ఐ.ఐ.టీ ఏమిటో అర్ధం కాదు నాకు.ఎంతసేపూ ఎంట్రన్సులకి బట్టీ పడుతూ కూర్చుంటే చాలా,ఆ పసిమనసులకి ఇంక ఏమీ అక్కర్లేదా? అసలు మనము పిల్లల విశ్లేషాత్మక ఆలోచన ని ఎక్కడ ఎదగనిస్తున్నాము?ఈ మధ్య విద్యా సంస్థల యాడ్స్ లలో "డిజిటల్ టీచింగు" అంటూ కొత్త కాన్సెప్టు ఒకటి.నల్ల బల్లల మీద చెప్తే విద్యార్ధులకి ఎక్కదేమో మరి.
ఎంతసేపూ ఏ స్కూలు కొత్త కాన్సెప్ట్ తో వస్తోంది అని చూస్తున్నామే కాని,ఎవరు పిల్లలకి కాన్సెప్టు అర్ధమయ్యేలా పాఠాలు చెప్తున్నారో అని ఆలోచించట్లేదు.అందుకే,ఇలాంటి ఆర్భాటాలకి దూరం గా ఉన్న ప్రభుత్వ పాఠశాలల పిల్లలు కార్పోరేటు కి ధీటు గా నిలిచారు.

Monday, May 24, 2010

సింహా చూసొచ్చాను

హా,మొత్తానికి సింహాన్ని చూసొచ్చా మొన్న శనివారం.ఆరోజు పొద్దున్నే నేవీ షో ఉంటే వెళ్ళి సాయంత్రానికి అలసిపోయి వచ్చాను.మానేద్దామా అని ఒక్క నిమిషం అనిపించింది.కానీ,ఇన్ని రోజులూ ఎదురు చూసి ఇలా చివర్లో మానెయ్యడం నాకే నచ్చక,నాలుగు మెతుకులు తిని కాస్త ఎనర్జీ తెచ్చుకుని బయలుదేరా.

హాల్ లో చూద్దునా ఒక వందమంది కూడా లేరు.సినిమా హిట్టు అని టాక్ వచ్చేసరికి ఓవర్సీస్ లో కలక్షన్స్ డ్రాప్ అయ్యాయి అని డిసైడయిపోయా.సగం మంది వచ్చేది సింహం చేసే చిత్ర విచిత్ర విన్యాసాల కోసమే కదా.హిట్టు సినిమా లో ఆ విన్యాసాల మోతాదు తగ్గిందని ఎక్కువ మంది రాలేదేమో అనుకున్నా.

ఇక సినిమా సంగతి చూద్దాము.సినిమా మొదలే ఒక ఫైటు తో.సింహం ఎంట్రీ ఎలా ఉంటుందో ఎనీ గెస్?ఒక సఫారీ లో వచ్చి,దానిలో నుండి మామూలుగా డోర్ తీసి మొదట షూ చూపిస్తూ దిగడం కాదు.డోర్ బద్దలు కొట్టుకుని దిగుతాడు "బాబు".
మన సింహం కొట్టగానే పక్కనే అంబులెన్స్ లో ఉన్న ఒకడు కోమా లో నుండి బయట పడతాడు.

కాలేజీ లో బాబు ని ఆకర్షించాలని చూసే కొలీగ్,ఈవిడ కోసం పడి చచ్చే బొంగురు గొంతు వేణు మాధవ్ అక్కడ తెలుగు లెక్చరర్.
ఈ తెలుగు లెక్చరర్ పాత్ర తో కామెడీ చేయించామనుకున్నట్లున్నారు.ఎంత సేపూ హైటూ,వైటూ,ఏజి గురించిన కుళ్ళు జోకులే కామెడీ అనుకుంటే చేసేది ఏమీ లేదు.ఈ పాత్ర గురించి ఇంతకు మించి వేస్ట్.

ఫస్ట్ హాఫ్ లో "బాబు" అందరినీ కొడుతుంటాడు.సెకండ్ హాఫ్ లో నరుకుతుంటాడు అంతే,ఎలా కొట్టినా రక్తం ఏరులై పారుతుంది తెర మీద ఇదీ కధ ఒక్క మాట లో చెప్పాలంటే.పాత కక్ష లని గుర్తు చేసి కర్తవ్య బోధ చేసే బామ్మ,స్టూడెంట్ రూపం లో ఉన్న హీరోయిను,ఓ నాలుగు కామెడీ క్యారక్టర్ లు,ఎప్పటి లాగే ప్రిన్సిపాల్ గా ధర్మవరపు ఇదీ స్టొరీ.


ఆరోజు నేను నేవీ షో లో అన్ ఆర్మ్ డ్ కంబాట్(Unarmed Combat) గురించిన డెమో చూసా.మన క్రిష్ణ బాల అదే విన్యాసాన్ని తెర మీద చేసేసరికి ఒహో అనుకున్నా.

మన బాబు ఫోర్డో, మరోటో అలాంటి కారుతో సఫారీ లాంటి పెద్ద వాహనాలని ఢీకొని గెలుస్తాడు కూడా.ఇది చూడగానే మా కజిన్ గుర్తొచ్చాడు.తను తన దగ్గర ఉన్న ఫోర్డ్ కారు తీసేసి ఎస్.యూ.వి కొందామనే ఆలోచన లో ఉన్నాడు మరి.మన బాబు విన్యాసం చూడగానే మా కజిన్ తన కారు మార్చడం దండగ అనిపించింది.


తెర మీద "ఇంటర్మిషన్" అని రాగానే ఠక్కున లేచా,మాకు ఇక్కడ విశ్రాంతి ఉండదు అని మర్చిపోయి.వెంటనే వెనకాల నుండి "నో ఎస్కేప్,కూర్చోవాల్సిందే" అని అరిచారెవరో.

సింహం నన్ను డిసప్పాయింటు చేసాడు తన ట్రేడ్ మార్కు విగ్గు లేకుండా.డైలాగులలో అతి కూడా తగ్గింది.కానీ వంశం,రక్తం డైలాగులు మామూలే.


సెకండ్ హాఫ్ లో "బాబు" బొబ్బిలి దగ్గర డాక్టర్.ఈయన భార్య నయన తార నడిచొచ్చిన చమన్ లాల్ బ్రదర్స్ దుకాణం లా ఉంది.మన డాక్టర్ బాబు ఒక సారి రైల్వే స్తేషన్ లో విలన్ లని కొడుతూ ఉంటాడు.ఆ కొట్టే 5-6 నిమిషాలలోనే ఒక 5-6 రైళ్ళు వెళ్ళాయి ఆ స్టేషన్ లో.అదేమిటో ఈ స్టేషన్ విజయవాడ కంటే బిజీ అనిపించింది.


డైలాగులు మాత్రం కరక్ట్ గా సూట్ అయ్యేవి పెట్టారు.
1)ఈ వంశం వాళ్ళని లేవనీయకూడదురా..లేస్తే ఆపలేము
కరక్టే కదా,ఒక్క హిట్టు వస్తే ఇంకో 10 పైత్యపు సినిమాలు చేసి ప్రాణం తీస్తారు.దాని కంటే ముందు విజయ యాత్ర లలో నేనే ఆక్సిజన్,గాలి ఫలానా పార్టీ కి అని మాట్లాడతారు అప్పటి వరకు కుక్కిన పేను లా ఉన్నవారు కాస్తా.

2)చూడకు,రెండో వైపు చూడకు,చూస్తే తట్టుకోలేవు
ఇదీ కరక్టే...మీకు అర్ధమయ్యింది కదా
3)రికార్డులు రాయాలన్నా మేమే....
అవును,ఇది ఈ వంశం వాళ్ళకే చెల్లు

బ్రహ్మానందం,అలీ,క్రిష్ణ భగవాన్,వేణు మాధవ్ లు అనవసరం అనిపించారు.ఈ నలుగురికి బదులు ఇంకో నలభై రౌడీలని పెట్టుంటే ఇంకాస్త రక్తం చిమ్మి కొంచం పెద్ద హిట్టు అయ్యేదేమో.

గిన్నీసు పుటల్లోకేక్కిన హాస్య నటుడి నటన మూస ధోరణి లో ఉంటోది ఈ మధ్య.పైన చెప్పినట్లు ఏజ్ మీదో,బట్ట తల మీదో,లేదా పర్సనాలిటీ మీదో జోకులు లేదా చెంప దెబ్బలు తినడం, ఇంతే సగం సినిమాలలో ఈయన హాస్యం అంటే.

మొత్తానికి సింహాన్ని చూసొచ్చిన త్రుప్తి తో ప్రశాంతం గా నిద్రపోయా

Wednesday, May 19, 2010

భలే మంచి రోజు....
ఎన్నాళ్ళో వేచీన ఉదయం,....నేను ఈ శనివారం గత కొన్ని వారాలుగా ఎదురు చూసిన సినిమా చూస్తున్నానోచ్.

సింహం లాంటి చిన్నొడే సింగపూరొచ్చాడే,
మెర్క్యురి లాంటి మెదళ్ళని ఆరగించాడే

నేను మా ఫ్రెండ్ కి చెప్పి పెట్టా,సింహం కానీ ఇటు వైపు వస్తే ఒక కేకెయ్యరా, జీవితమే ఒక ఆట,సాహసమే పూబాట అనుకుంటూ వచ్చెస్తా అని.

కానీ ఆ మిత్ర ద్రోహి నాకు చెప్పకుండా చూసొచ్చేసాడు. తీరికగా సోమవారం చెప్పాడు ఆఫీసులో మొన్న సింహాన్ని చూసా అని.

అంతే,వేంఠనే నేనూ ఈ శనివారం కి బుక్ చేసి పడేసా. ఈ సినిమా కి వెళ్తున్న,మీరూ ఏమయినా చూసి తరిస్తారా అని మా కజిన్ని అడగ్గానే,ఏంటి ఆ ధైర్యం అసలు నీకు,ఏదో డీవీడీ లో చూసిన అర్ధం కానీ అంది.క్రిష్ణ బాల లో హీరో ని కాదు చూడాల్సింది,స్టార్ కమెడియన్ ని చూడు నా కళ్ళతో,ఆ పాము కుబుసం విగ్గు,ఆ డైలాగులు అంటూ నేను ఎందుకు ఆ సినిమా కి వెళ్తున్నానో చెప్పా,వాళ్ళని కూడా (తోడు) తీసుకుపోవడానికి..ఆహా కన్విన్స్ అవ్వదే,పైగా బాబోయ్ నేను ఆయన సినిమాలు మానేసి కొన్ని సంవత్సరాలు అయ్యింది,నేను హాల్ లో చూసిన ఆయన చివరి సినిమా "...ద్వీపం" అంది.

అక్కడే,నువ్వు మరి తప్పు లో కాలేసేది,అప్పటికి ఇంకా సారు ఎదగలేదు,మీరు సింహం,పులి అనే మంది మాగధులు లేరు చుట్టూ..సార్ ఫ్యాక్షన్ సినిమాల నుండీ నేను మిస్ కాకుండా సినిమాలు చూస్తున్నా,ఒక్కసారి రండి మజా తెలుస్తుంది అన్నా.ఊహ్హూ,ససేమిరా అంది,పైగా నాకు మర్నాడు ఒకసారి నిద్ర లేచాకా ఫోన్ చెయ్యి,నీ లాంటి వాళ్ళే ఇలాంటి సినిమాలని హిట్ చేసేది అంటూ కాసేపు దీవించింది.నేను నాకు కావాల్సినప్పుడల్లా "సీతయ్య" ని అయిపోతుంటా.ఐ మీన్,కాసెపు చెవిటి వాణ్ణయిపోయి ఎవరి మాటా వినను.

ఈ సినిమా చూడటం "ఒక చారిత్రక అవసరం" అని నా అభిప్రాయం.బాగోలేదా ఈ పదం?ఏమో,ఈ మధ్య అందరూ ఈ పదాన్ని వాడుతోంటే నేనూ వాడేసా.

ఆ మధ్య చదివా,తన 150 వ చిత్రం గా ఈ హీరో తో తెలుగు సినిమా పెద్ద దిక్కు(?) గారు "పరమ వీర చెత్త" తీస్తున్నారుట.ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకునేటట్లు తీస్తారుట.ఆ దర్శక రత్న గారు అంత కష్టపడకుండా తన మామూలు బోరింగ్ పంధాలో తీసినా కానీ క్రిష్ణ బాల గారి సినిమా అనగానే అందరూ మాట్లాడుకుంటారు అని తెలీదు కాబోలు.

ఇకపోతే వెరయిటీ సినిమా పేర్లు పెట్టే దర్శకుడు ఈ హీరో తో సినిమా తీస్తున్నారుట."బాబు" ఫ్యాన్స్ పవర్ఫుల్ పేర్లు కోరుకుంటారు,ఈ దర్శకుడు వెరయిటీ రెండూ కలగలిసి టైటిల్ "నరికేసా" ట్యాగ్ లైన్ "ఔను,వాళ్ళందరూ అడ్డొచ్చారు" అని పెడితే?

టైటిల్ నచ్చకపోతే,సజెస్ట్ చెయ్యండి మరి.

Saturday, May 15, 2010

ఏమి చేస్తాం?మన రాష్ట్రం లో ఈ మధ్య ఎండలకి ప్రజలు అల్లాడినట్లు,మాంచి న్యూస్ లేక న్యూస్ ఛానెళ్ళ పరిస్థితీ ఇంచుమించు అలాగే ఉంది.నిన్నే పాత బస్తీ లో ఒక ఘటన జరిగింది,ఏమో మరి అది కూడా మన ఛానెళ్ళకి పెద్ద "కిక్" ఇచ్చినట్లు లేదు.ఏమో లెండి,ఆ ఘటన జరిగిన "స్థల మహత్యం" అని మనం సరిపెట్టేసుకోవడమే.

హక్కుల సంఘాలు కూడా కిక్కురుమన్నట్లు లేదు.బాధితుడు "పౌరుడు" కాడో,మరి ఆయనకి హక్కులు ఉండవు అనుకున్నారో మరి.

మళ్ళీ న్యూస్ ఛానెళ్ళ దగ్గరకి వస్తే,వార్తలు లేవు కాబట్టి తాగుబోతులు తప్ప తాగి గొడవ చేస్తే అది కూడా న్యూసే.ఒకసారి కాదు,ప్రతీ బులిటన్ లోనూ..ఈరోజే మెరుగయిన సమాజం కోసం పాటుపడే ఒక ఛానెల్ వారు తిరుమల కొండ మీద డ్రగ్స్ అవీ దొరుకుతున్నాయి అంటూ తాము చేసిన స్టింగ్ ఆపరేషన్ చూపించారు.పాపం ప్రాణాలకి తెగించి ఈ ఆపరేషన్ చేసారుట.

ఎవరికోసమో ఆ తెగింపు? ఎంచక్కా,ఏవి ఎక్కడ దొరుకుతాయో అన్ని డీటెయిల్సూ ఇచ్చారు.వీరి కధనం చూసి అధికారుల్లో చలనం సంగతి ఏమో కాని,తిరుమల లో అవి ఎక్కడ దొరుకుతాయో తెలియని వాళ్ళకి చక్కటి విషయఙానాన్ని అందించారు.

మళ్ళీ ఈ ఛానెళ్ళలో"ప్రాస" కోసం ప్రాకులాట ఒకటి. ఉదాహరణ:"హార్ట్ ఆఫ్ హైదరాబాద్" "హార్ట్ ఎటాక్ ఆఫ్ హైదరాబాద్" అని మొన్న ఒక ఛానెల్ లో ప్రయోగం విన్నాను.ఏమిటి ఈ అర్ధం పర్ధం లేని ప్రయోగాలు.ఎండల వల్ల పైత్యం ఎక్కువవుతోందేమో.

మా అమ్మ పైత్యానికి విరుగుడు "బెల్లం" అని చెప్తూ ఉంటుంది.మీడియా లో పైత్యం వాళ్ళందరికీ రోజూ పొద్దున్నే కాస్త బెల్లం ముక్క పెడితే సరి చేతిలో. ఇలాంటి పైత్య ప్రయోగాలు తగ్గుతాయి.


ఇంకా మన మీడియా ధోనీ అన్న మాటలు పూర్తిగా వినకుండా,ఆయన అన్న మాటలని "ఐపీ ఎల్ లేట్ నైట్ పార్టీలు" అన్న దగ్గర ఆపేసి ఇంక ఆ పార్టీల ద్రుశ్యాలు,వాటి గురించి కధనాలు.


మన రిపోర్టర్ లకి గడ గడా మాట్లాడెయ్యాలి అనే సూత్రాన్ని నర నరానా జీర్ణించుకుపోయేలా చేసినది ఎవరా అన్నది సమాధానం దొరకని బేతాళ ప్రశ్న. ఒక న్యూస్ ఛానెల్ లో ,కాస్త అందరి కంటే బెటర్ అనుకున్నావిడకి కూడా గడ గడా మాట్లాడెయ్యాలి అనే తాపత్రయమే.తన సినిమా సక్సెస్ సందర్భం గా ఒక హీరో గారు యాత్ర చేస్తున్నారు.దానిని ఈవిడ ఇలా చెప్పారు

"సింహం" సక్సెస్ అయినందుకు క్రిష్ణ బాల రాష్ట్ర వ్యాప్త యాత్ర చేపట్టారు.ఆయన ఇంకా X,Y,Z పుణ్య క్షేత్రాలు కూడా సందర్శిస్తారని సమాచారం.దీనిని బట్టి రాబోయే రోజులలో సింహం రాష్ట్రమంతా పర్యటించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

పరిస్థితులు కనిపించడం అనే ప్రయోగం అసహజం గా అనిపించింది నాకు ఈ సంధర్భంలో.ఏమంటారు.

గడ గడా మాట్లాడటం కొంతమందికి స్వతాహా గా వస్తుంది,కొంతమంది అభ్యాసంతో నేర్చుకుంటారు.నేర్చుకోవాలి అనే స్ప్రుహ ఇప్పుడిప్పుడే ఈ రంగం లోకి వచ్చే చాలా మందికి ఉన్నట్లు లేదు.హై పిచ్ లో అరుస్తూ సంగీత దర్శకుల లాగ చేతులూపుతూ ఏదో నాలుగు ముక్కలు చెప్పడమే రిపోర్టింగ్ అనుకుంటోంటే ఏమి చేస్తాము చెప్పండి.


కొంతమంది చెప్పేది నాకు అసలు ఏమీ అర్ధం కాదు. తెలుగు సినిమా పెద్ద దిక్కు గారి సినిమా చూసినట్లు మొహం పెట్టి అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటా అలాంటప్పుడు.
ఏమీ చెయ్యలేనప్పుడు మనం మన సీయం గారిని ఆదర్శంగా తీసుకోవాలి.ఆయన చూడండి కష్టంగా ఉంది అని వాపోతారు తప్ప సీటు వదలరు,అలాగే మనం కూడా ఇలా బ్లాగుల్లో రాసుకోవడమో,లేద నోరార తిట్టుకోవాలి తప్ప టీవీ చూడటం మాత్రం మానకూడదు.

Monday, May 10, 2010

అమ్మాయిల జనన రేటు పెరగాలిమొన్న ఆదివారం సాయంత్రం సడెన్ గా అనుకున్నాను నేను,మన దేశం లో ఇక ఆడపిల్లల జన రేటు పెరిగితే బాగుండు అని.
భ్రూణ హత్యలు చూసో,ఏదో కమీషన్ సమర్పించిన నివేదిక చదివో ఇలా అనట్లేదు.నాకు అంత సామాజిక స్ప్రుహ కూడా లేదు.కానీ ఒక్కటి మాత్రం నిజం,మన మంచి కోసం,మన పిల్లల బాగు కోసమే చెప్తున్నా.

విషయం లోకి వస్తే,ఆదివారం సాయంత్రం నేను మన "గిగా స్టార్" నటవారసుడి "మగ ధీరుడు" వీక్షించడం జరిగింది.ఒకసారి హాల్ లో చూసేసా ఈ సినిమా ని.టికెట్,పాప్ కార్న్,కూల్ డ్రింక్ ఖర్చులు,లేట్ నైట్ షో కాబట్టి,సినిమ అయ్యాకా,అదనపు చార్జీ ఇచ్చి ఎక్కాల్సిన క్యాబ్ ఇవన్నీ గుర్తొచ్చి మొదటి సారి ఏమీ ఆలోచించకుండా సినిమా చూసా :).


ఇంట్లొ కూర్చుని రెండో సారి కాబట్టి వారసుడిని పరిశీలించా బాగా.

ఓ 13 సర్జరీలు,కాస్మోటిక్ ట్రీట్మెంట్లు ఇప్పించిన తరువాత గానీ తెర మీదకి వదల్లేదు ఈయన గారిని అని చదివాను.అయ్యబాబోయ్,లేకపోతే...ఊహకి అందట్లేదు కదా..

ఈ సినిమా లో,గిగాస్టార్ పాట ని వారసుడి మీద రీషూట్ చేసారు కదా,ఏమన్నా బాగుందా అసలు ఈ కొత్త పాట. స్టయిల్ అంటూ వారసుడికి ఆ పిలక...


అప్పట్లో అంటే మన గిగాస్టార్ గారికి లెగసీ లేదు కాబట్టి ఫ్రీ గా బాడీ కదుపుతూ,మంచి ఎక్స్ప్రెషన్స్ తో ఎటువంటి టెన్షన్ లేకుండా నటించారు.
వీరి వారసుడి దగ్గరకి వచ్చేసరికి గిగాస్టార్ వెనకేసుకున్న ఇమేజీ బరువు ఇటు షిఫ్ట్ అయిపోయింది.సో.మొదటి సినిమా నుండీ మనకీ,వారసుడికీ ఇద్దరికీ పరీక్షే.అసలే మన వారసులలో చాల మందికి నటన రాదు.వారసత్వం గా వచ్చే ఆ ఇమేజీ బరువు,సర్జరీలూ,కాస్మోటిక్ ట్రీట్మెంట్లు ఇచ్చి ఇచ్చి తనకు తానే కొత్త గా కనిపిస్తూ,కన్ ఫ్యూస్ అవుతూ నటించే సినిమాలు మనకి పరీక్ష కాదూ?


ఇదంతా వదిలెస్తే,మన తెలుగు సినిమా నాలుగు స్తంభాలకీ మగ పిల్లలు ఉన్నారు.వీరిలో ఒక ఇద్దరు అప్పుడే మన ముందుకు వచ్చేసారు కూడా.

వస్తే వచ్చారు,వాళ్ళ సినిమాలు వాళ్ళు చేసుకుంటే పోలా,వీరి తండ్రుల సినిమా లకి సీక్వెల్ అనో,రీ మేక్ అనో "సూపర్"ఐడియా అనుకుని,సినిమా తీసి ఆ కళా ఖండాలని మన మీదకి వదుల్తారు.దానిలో మళ్ళీ వంశపు తొడ చప్పుళ్ళు,రికార్డులు మాకే సొంతం లాంటి డైలాగులు,వారి మీద పాటలు ఇవన్నీ అదనం కొత్త నటుల "అసమాన" నటనకి.


అప్పుడే "బ్లాగార్జున" గారి 'సీతాంజలి" రీమేక్ అని టాక్.బ్లాగార్జున అప్పట్లో అలా నిజం గా ఏదో జబ్బు చేసిన వాడిలా మొహం పెట్టి డైలాగులు చెప్పినా దర్శకత్వ ప్రతిభ,కెమేరా పనితనం,సంగీతపు మాధుర్యం లో అవన్నీ మనకి కనపడలేదు కాబట్టి ఆనందిచేసాము చూసి.

మళ్ళీ ఇప్పుడంటే ఎలా...


రాబోయే 10-15 సంవత్సరాలలో మనము తప్పకుండా "మగవారి మాటలకి మీనింగ్స్ వేరులే", "సవాలు-2","సైకిల్ చెయిన్ శివ" ఇంకా చాలా చూడాలి.ఇవన్నీ ఒక ఎత్తు,మన నట "సింహ" వారసుడు వచ్చినప్పుడు ఎవరయినా నట సింహం గారి సినిమా లకి సీక్వెల్స్ అనో రీమేక్ అనో మొదలెడితే ఎలా అనే నా భయం."గ్రైండ్ చెయ్యవే ఆంటీ కూతురా" అని నట "సింహ" వారసుడు పాడతాడేమో....

కానీ ఇక్కడ ఒకరి వారసులని మాత్రం అభినందించాలి.తానేదో ముక్కు సూటి మనిషి,పంక్చూఅలిటీ,నిజాయితీ లాంటి కబుర్లు చెప్పే ఆ హీరో గారి వల్గర్ సినిమాలకి రీమేక్,సీక్వెల్స్ ఐడియాలు ఇంకా ఆయన గారి వారసులకి రాకపోవడం.ఎప్పటికీ రాకుండా ఉండేటట్లు కరుణించు భగవంతుడా!


ఇప్పుడు ఇక ఈ సీక్వెల్స్ ఎలాగూ తప్పవు.అందుకని ,కనీసం ఈ వారసులకయినా అబ్బాయిలు లేకపోతే మనకి రీ రీ మేక్ లు,రెండో సారి సీక్వెల్స్ బాధ తప్పుతుంది."బంగారు కోడి పెట్ట" అని మన పిల్లలు/మనుమలు పాడుకోక్కర్లేదు.

అందుకే అన్నాను,ఆడపిల్లల జనన రేటు పెరిగితే బాగుండు అని.

((ఈ పోస్ట్ కి ప్రేరణ అయిన ప్రదీప్ కి ధన్యవాదాలతో)

Friday, May 7, 2010

బ్యాక్ ప్యాక్ జర్నీలు-లగేజీ రాంబాబులుఅర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడవటం ఏమో కాని,విదేశాలనుండి ఒంటరిగా అబ్బాయిలు ప్రయాణం అంటే భయపడే రోజులండీ బాబూ ఇవి. ఎవరయినా ఒంటరిగా ఇండియా వెళ్తున్నారు అని అలా వినడం ఆలశ్యం,కొంచం ఇది మా వాళ్ళకిద్దురూ అంటూ చేతిలో లగేజీ తో ప్రత్యక్షం అయిపోతారు కొందరు రాంబాబులు.పోనీ ఆ లగేజీ అందుకునే వాళ్ళు ఏమయినా ఈ అబ్బాయి ఇంటి దగ్గర ఉంటారా అంటే అదీ లేదు.ఈ అబ్బాయి కూకట్ పల్లి అయితే లగేజీ ఓనర్లు ఎల్బీనగరో మరి కాస్త అవతలో ఉంటారు.


ఈ అబ్బాయి కరక్ట్ గా ఏ సినిమా కో బయలు దేరినప్పుడో ఫోను వస్తుంది మేను వస్తున్నాము అని లగేజీ తీసుకోవడానికి.సరే, అని ఇంట్లో వాళ్ళకి ఫలాన లగేజీ వీళ్ళకి ఇవ్వండీ అని చెప్పి బయలుదేరుతాడా,సినిమా మొదలయ్యిందో లేదో వీళ్ళ ఫోన్లు మొదలు.ఇక్కడ ఉన్నాము అక్కడ ఉన్నాము,మీ ఇల్లు ఎక్కడ అని.చీ ఈ గొడవంతా ఎందుకు అని పోనీ ఎయిర్ పోర్టు కి వచ్చి లగేజీ తీసుకోండి అంటే, దానితో మరో తలనెప్పి.తీరికగా వస్తారు మహానుభావులు మెల్లిగా తీరిక చేసుకుని.అప్పటివరకు మన హీరో పాపం ఆటో,టేక్సీ,హొటెల్ బుకింగ్ మనుషుల నుండి ఎలా వేగుతాడో ఊహించుకోండి.

ఒకరోజు నేను మన శంషాబాద్ ఎయిర్ పోర్టు లో లగేజీ కోసం ఒక్క 15 నిమిషాలు ఎక్కువ సేపు ఎదురు చూడటానికే మా ముత్తాతలు అందరూ కనిపించేసారు లైన్ గా నిలబడి,టేక్సి,హోటెల్ బుకింగు రాజాల వేధింపులకి.

అసలు ఈ గోల అంతా విదేశాలలోనే మొదలవుతుంది.కొంత మంది ఉంటారు,ఎవరయినా ఇండియా వెళ్తున్నారు అని చూచాయిగా తెలిసిందా,వెళ్ళేవాడు చచ్చాడే.

అస్సలు మొహమాటం ఉండదు ఈ రాంబాబులకి.కొంచం ఈ టీవీ పట్టుకెళ్ళండి అంటారు ఏదో చాక్లెట్టు తీసుకెళ్ళండి అన్నంత ఈజీ గా. మా కొలీగ్ ఒకడు ఇండియా వెళ్ళాడు.వాడి ప్రయాణ ప్రహసనమే ఈ పోస్టు కి స్ఫూర్తి.

మా ఊరే కావడం తో ఏమయినా ఇస్తావా మీ నాన్నగారికి అన్నాడు.మా అక్క ఒక బ్యాక్ ప్యాక్ పంపించమని అల్లప్పుడెప్పుడో పడేసిన ఆర్డర్ గుర్తొచ్చి ఆ బ్యాగ్ ఇస్తాను నీకు క్యాబిన్ బ్యాగేజీ లాగ యూజ్ చెసుకో అని ఒక ఉచిత సలహా కూడా పారేసా.సరే అన్నాడు మన వాడు.వీడికి ఈ లగేజీ తప్ప వేరేది ఏమీ లగేజీ లేదు అన్న విషయం మా ఆఫీసులో రాంబాబు కి తెలిసింది అంతే,చెకిన్ లగేజీ నేను ఇస్తాను అండీ అన్నాడు ఏదో దానం ఇస్తున్నంత ఉదారంగా.ఓన్లీ క్యాబిన్ లగేజీతో వీడిని ఫ్లయిట్ ఎక్కనీయరేమో అని మన రాంబాబు ఒత్తిడికి గురయ్యడేమొ అనిపించింది నాకు.


అసలే మా కొలీగు మనసు వెన్న కంటే మెత్తనిది.స్టవ్ మీద పెట్టకుండానే కరిగిపోయే వెన్న లాంటి మనసన్నమాట. సరే,అన్నాడు.తను ఇండియ వెళ్ళడం ఏమో కాని నాకు హింస మొదలు మా రాంబాబుతో.ఒకసారి ఫోను చేసి ఆ మీరు ఎంత లగేజీ ఇస్తున్నారు అంటాడు.నాది ఒక్క బ్యాగేనండీ అన్నాను.ఓ అలాగా అని పెట్టేసాడు.మళ్ళీ కాసేపటికి ఫోను,నా దగ్గర ఉన్న బ్యాగు సరిపోవడం లేదు,మీ దగ్గర వేరేది ఉంటే తెస్తారా అని.సర్లే అని పెట్టేసాను ఫోను.ఇలా ఒక 2-3 సార్లు చేసి విసిగించాడు రాంబాబు నన్ను.మొత్తానికి మా కొలీగ్ తో అందరము ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాము.మా రాంబాబు మాత్రం రాలేదు ఇంకా. హీరో గ్రాండ్ ఎంట్రీ లాగ చేతిలో ఒకసూట్ కేసు తోసుకుంటూ మరొక చేతిలో చందనా బ్రదర్స్ ఇచ్చే ఒక బిగ్ షాపర్ లాంటి సంచీ నిండుగా సామానులు కుక్కుకుని వచ్చాడు.రాంబాబు ని దూరం నుండి చూసిన మేము చటుక్కున తల తిప్పేసాము,ఎలాగూ వచ్చాకా వీడి సుత్తి తప్పదు గా అని.

రాంబాబు సూట్ కేసు వెయ్ చేస్తే 25 కిలోలు ఉంది,ఇంకా ఆ సంచీ సామాను బోనస్.సూట్ కేసు చెకిన్ లో వేస్తాను,కానీ ఈ సంచీ కుదరదేమో అన్నాడూ మా కొలీగ్

రాం.బా.:అయ్యో అలా ఎలాగండీ అన్నీ తీసుకెళ్ళాలి.
కొలీగ్: మీరే అడ్జస్ట్ చేసి ఇవ్వండి నాకు ఇబ్బంది లేదు.నా క్యాబిన్ బ్యాగేజీ మీ సూట్ కేసు లో వేసెస్తాను,ఓపెన్ చెయ్యండి సూట్ కేసు .
రాం.బా: అబ్బెబ్బే అస్సలు ఖాళీ లేదండీ,తెరవడం కుదరనే కుదరదు

ఆఖరుకు గత్యంతరం లేక ఓపెన్ చేసాడు.చూద్దుమా,ఆ సూట్ కేసు నిండా బోలెడు కొత్తా,పాత వస్తువులు.కొత్తవాటివి అట్టపెట్టెలు తీసెద్దము అంటే ఒప్పుకోడు.మీ వాళ్ళకే కదా,అమ్మడానికి అయితే అట్టపెట్టెలు కావాలి కాని అన్నా విసుగ్గా.

ఆహా,కుదరదు అంటాడు రాంబాబు.మీ ఇష్టం మరి,త్వరగా ఇస్తే నేను బయలుదేరుతా,అని కొలీగ్ అనటంతో అన్యమనస్కం గా రాంబాబు ఒక 2 అట్టపెట్టెలు తీసి పారేసి మమ అనిపించాడు.

అలా చెకిన్ బ్యాగేజీ అయ్యింది,ఉండాల్సిన దాని కన్న ఒక 2-3 కిలోలు ఎక్కువ ఉన్నా కాని ఏ కళనుందో కౌంటర్ లో తెల్ల పిల్ల మాట్లాడలేదు.

ఇక క్యాబిన్ బ్యాగేజీ వంతు.ఆ సంచీ ఒక 12 కిలోలు ఉంది.కౌంటర్లో తెల్లపిల్ల,ఎప్పుడూ ఫ్లయిట్ ఎక్కలేదా అన్నట్లుగా లుక్కింది దాని బరువు చూసి.మేము చాలా సార్లు ఇలా పట్టుకెళ్ళాము తెలుసా అన్నాడు రాంబాబు.నాతో కాదు,దానితో చెప్పు అని పక్కకి తప్పుకున్నాడు కొలీగ్.ఇదే మాట ఆ కౌంటర్ లో ఉన్న పిల్లతో అంటే అది అప్పుడు,ఇప్పుడు కుదరదు,లోపల తీసేస్తారు నీ ఇష్టం అని చెప్పి విసుగ్గా మొహం పెట్టింది.

ఏమీ కాదండీ,వీళ్ళు ఇలాగే అంటారు,లోపల ఆపితే అప్పుడు చూద్దాము అంటాడు.ఏంటి చూసేది,ఇంత లగేజీ నేను తీసుకెళ్ళనంతే,మొహం చిటపటలాడించాలని ప్రయత్నిచాడు కొలీగ్.రాంబాబు ముందా ఆ కుప్పిగెంతులు?."ఏంటండీ,మీరు తీసుకెళ్తారని నమ్మకంతో తెస్తే?"అంటాడు ఏదో వీడు కావాలని వద్దు అన్నట్లు.

రాంబాబు మొహం చూసిన వాళ్ళు పాపం వీడికి ఏదో ఎక్కువ లగేజీ ఇచ్చి విసిగిస్తున్నాడు మా కొలీగ్ అనుకునే ఉంటారు.

అసలు,ఏమి ఉన్నాయి దీనిలో...^%&*%$#@ అని తిట్టుకుని ,మా కొలీగ్ కాస్త పై పైన చూసాడు.దాని నిండా పాత లుంగీలు,చెప్పులు,మన్ను,మశానం.
ఓ,వీడు ఈ దేశం వదిలి వెళ్ళిపోతున్నాడు కదూ,ఏమీ వదలడన్నమాట అనుకున్నాము.

మొత్తానికి మా కొలీగ్ చేతిలో ఆ బిగ్ షాపర్ పెట్టి,లోపలకి పంపి కానీ కదల్లేదు రాంబాబు.లోపల ఏమి జరిందో నాకు తెలీదు.ఇంకా లోపల డ్యూటీ ఫ్రీ బాటిళ్ళు 2 కూడా పురమాయించాడండోయ్.

కొసమెరుపేమిటంటే,ఇంత లగేజీ అక్కడకి పట్టుకెళ్ళాకా,ఈ లగేజీ ని రాంబాబు బావమరిది కలక్ట్ చేసుకుంటాడుట కార్ లో వచ్చి.సరే, అయితే నన్ను ఆ అర్ధ రాత్రి కాస్త బస్ స్టాండ్ లో దింపమను మీ బావమరిది ని అని కొలీగ్ అడిగితే,అబ్బే,వాడు ఉండేది సికిందరాబాదు అండీ,మీరేమో
ఇంలీబన్ అంటున్నారు,రెండూ చెరోవైపూ కదూ అంటూ దీర్ఘం తీసాడు.

ఇలా ఉంటారు,మనుషులు.

నాయకులూ జిందాబాద్


ఊరికే నాయకులని ఆడిపోసుకుంటాము కాని అది తప్పు అని ఈ మధ్య నాకు ఙానోదయం అయ్యింది.చదవండి మరి ఎందుకంటున్నానో

ఏదో అనుకుంటాము కానీ,మన నాయకులు నిజంగా గ్రేట్ అండీ బాబూ.వీళ్లకి ప్రజల నాడి తెలీదు,ఏదో అలా ఎలెక్షన్లలో నిలబడి డబ్బు మంచినీళ్ళలా ఖర్చుబెట్టి గెలుపుకి కౄషి చెస్తారు అనుకుంటామా,అక్కడే మనం పప్పులో కాలేసేది మరి.

కొంత మంది "మహా" నాయకులకి తాము గెలుస్తామో,ఓడతామో ముందే తెలుస్తుందండోయ్.


ఆ మధ్య పేపర్ లో చదివాను,2009 ఎన్నికలలో తాను ఓడిపోతాను అని అసలు నోరు సరిగ్గ తిరగని,కుర్చీ మీద బోలేడు ఆశలు పెట్టుకున్న నాయకుడికి ముందే తెలుసుట.అదే విషయాన్ని అధిష్టానికి కూడా చెప్పారుట ఆయన.ఆహా,ఓహో ఏమి నిజాయితీ,ఎంత ముందు చూపు.గెలిచినా కూడా అధిష్టానం అమ్మ అంటే భయపడే నాయకులున్న ఆ పార్టీలో ఏకం గా "అమ్మ"కే ఓడిపోతాను అని చెప్పటానికి నిజం గా ఎంత ధైర్యంఉండాలంటారు.ఇంతకీ,ఇది నిజమా,అని కనుక్కోవడానికి స.హ.(సమాచార హక్కు)చట్టం దీనికి వర్తించదేమో కదా.ఓడిపోతానని తెలిసి ఎందుకు పోటీ చెయ్యటం అని మనము అనుకోకూడదంతే.పాపం అధిష్టానానికి ఆయన్ని మించిన నాయకులు దొరక్క బతిమాలి ఆయనని నిలబెట్టినట్లుంది అనుకోవాలన్నమాట.అలాంటప్పుడు వాళ్ళకి ప్రజల నాడి తెలీదు అనడం మరి తప్పా కాదా


ఏంటో, మనలాంటి వాళ్ళకి ఒక మాట అన్నాకా మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి వుండదు.పర్యావసానాలు భరించాల్సిందే.అదే నాయకులకయితే,ఉందిగా బ్రహ్మాస్త్రం."నా వ్యాఖ్యలని వక్రీకరించారు" అని ఒక మాట పడేస్తే పోయే.ఎంచక్కా బయటపడిపోవచ్చు
అదే,నా లాంటి వాళ్ళు ఆ మాట అంటే,ఏరా అబద్ధాలు కూడానా అంటూ మీదకొస్తారు.

మన నాయకులు అపర "గజినీ" లండీ బాబూ.ఈ వరం వల్లే వీళ్ళకి ఎంచక్క, ఏమీ గుర్తు వుండవన్నమాట.హన్నా,ఇచ్చిన మాట నిలబెట్టుకోరు అని ఆడిపోసుకోవడం తప్పు కదూ.

పొద్దున రాగానే బ్రేక్ఫాస్ట్,11 కి టీబ్రేక్,మళ్ళా లంచ్,టీబ్రేక్,6 కి బస్ ఎక్కడం ఇలా ఎవరయినా సాఫ్ట్ వేర్ వాళ్ళని అభివర్ణిస్తే నాకు మా చెడ్డ కోపం వస్తుంది సుమా.ఊరికే మమ్మల్ని ఆడొపోసుకుంటారు కానీ,అసలు పని లేనిది మన ప్రజాప్రతినిధులే.(మహా అయితే ఒక 10 మంది సిన్సియర్ ఏమో లెండి వీళ్ళళ్ళో,వాళ్ళకి నా క్షమాపణలు). పొద్దున్నే సభకి వస్తారు,ఏదో ఒక అంశం మీద సభ ని స్తంభింపచేసి వాయిదా వేయిస్తారు సభని 12 వరకు.మళ్ళా మామూలే,సభ 4 కి వాయిదా పడుతుంది.కాసేపు సజావుగా సాగుతుందో లేదో,సమయం మించిపోవడమో,మరలా వాయిదానో.ఒకోసారి ఏకంగా 2,3 రోజులు సభ వాయిదా పడి ఎంచక్కా లాంగ్ వీకెండ్ అన్నమాట.

ఇచ్చిన మాట నిలబెట్టుకోరు అని నాయకులని అంటారు కానీ,పైన చెప్పినట్లు వాళ్లు "గజిని" లు కదండీ, పోనీలే అది వాళ్ళ తప్పు కాదు అని సరిపుచ్చుకోవాలంతే.కాని కొంత మంది నాయకులు ,ఎలాగోలా ఇచ్చిన మాట నిలబెట్టేసుకుంటారు,ఎందుకంటే ఇంకా వీళ్ళు రాజకీయాలకి కొత్త కాబట్టి."మార్పు" అంటూ దూసుకొచ్చిన నాయకుడొకరు ఎంచక్కా తన పార్టీ స్వరూపాన్ని ఎలా మార్చేసారో మనము చూసాము కదా,ఏదో ఒకటి మార్పు సాధించారా లేదా.

ఇంకొక నాయకుడేమో,అదేదో రాష్ట్ర సాధనే తన జీవిత ధ్యేయం అంటాడు.10 సంవత్సరాలు అయ్యింది,ఇంకా ఎప్పుడు సాధించేది అని పెదవి విరవకండి ,ఆయన మనకేమి ఫలాన రోజు సాధిస్తాను అని చెప్పారా ఏమిటి,జీవిత ధ్యేయం అన్నారు అంతే కదా.ఆయన జీవితం ఇంకా ఉంది కాబట్టి మనము ఇంకా ఓపిక పట్టాలన్నమాట.


మరి చెప్పెద్దామా అందరము....నాయకులూ జిందాబాద్

Thursday, April 29, 2010

మార్పుమనము బ్లాగులలో,పుస్తకాలలో టీవీ చానెళ్ళ వాళ్ళని ఎన్ని అక్షింతలేసినా...వీళ్ళలో మార్పు ఉండదు కదా.తిట్టి తిట్టి విసుగొచ్చి మనము మానెయ్యడమే కాని వీళ్ళు మారరు అని నిన్ననే నాకు ఙానోదయం అయ్యింది.ఎలా అంటారా,ఏదో అప్లికేషన్ ఫాం నింపా కష్టపడి. మా అమ్మ పుట్టిల్లు వగైరా వగైరా వివరాలతో సహా అడిగారు దానిలో,ఓపికగా నింపాను.అంతా చేసి "సబ్మిట్" కొట్టాకా "పాప్ అప్స్ బ్లాక్డ్" అని వచ్చింది.
ఇంతా నింపాకా,ఏంటిదీ "ఛీ" అనుకుంటున్న సమయం లో అయ్యిందన్నమాట ఙానోదయం.

నాకు ఙానదంతం రాలేదు లెండి అందుకే ఒకో విషయానికి ఒకోసారి ఙానోదయం అవుతుందన్నమాట.

ఇక విషయంలోకి వస్తే,మన తెలుగు యాంకర్లకి తెలుగు సరిగా రాదు అన్న సంగతి జగమెరిగిన సత్యం.
టింగ్లీషు మాత్రమె వచ్చు వీరికి.అది కూడా ఒక టపా లో రవిచంద్ర గారన్నట్లు "పాడీ"(పార్టీ)టైపు టింగ్లీషు.అసలు పూర్తిగా ఇంగ్లీషు లో మాట్లాడితే ఎలా ఉంటుందో అనుకుంటుండగా,దేవుడు నా కోరిక అర్జెంట్ గా ఒక 2 రోజులలోనే తీర్చేసాడు.

ఒక రోజు ఒక చానెల్లో యాంకరమ్మ పిల్లల డ్యాన్సుల మీద చర్చ నిర్వహిస్తూ మధ్య మధ్య లో ఫోను లో ఆ రియాలిటీ షో పార్టిసిపెంట్స్ తో మాట్లాడుతోంది.ఆ యాంకరమ్మ ఇంగ్లీషులో వేసిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి:

డిడ్ దే టోల్డ్ ఎనీ రీజన్
ఆర్ దే హరాజ్డ్(హెరాస్ కి వచ్చిన తిప్పలు)యూ ఆల్సో
వాట్ ఈజ్ యువర్స్ మదర్స్ రెస్పాన్స్

ఏదో అప్పుడప్పుడు తప్పులు సహజమే లైవ్ కార్యక్రమాలలో కానీ మరీ ఇన్ని తప్పుల తడకల ఇంగ్లీషు మాట్లాడితే ఎలాగండీ బాబూ?

ఇంకొక యాంకరు గారేమో (ఏదో ఆరోగ్య కార్యక్రమం అనుకుంటా)మీ ప్రోబ్లం సాల్వ్ అవుతుంది అనడానికి మీ ప్రోబ్లం సొల్యూషన్ అయిపోతుందండీ అంటాడు.ఈరోజు ఒక రిపోర్టర్ అయితే "సంకేతాలు" అనడానికి "సాంకేతాలు" అని పదే పదే వాడి నా చెవులలో సల సలా కరిగే నూనే పోసాడు.


తెలుగో ఇంగ్లీషో సరిగ్గా ఏదో ఒకటి అర్ధమయ్యేటట్లు మాట్లాడండి అంటే ఎలాగూ మన చానెళ్ళ వాళ్ళు వినిపించుకోరు.ముసలి హీరో ముందు ఇంక చాలు బాబూ నీ హీరోయిజం అని చెప్పినట్లన్నమాట. అందుకే కనీసం ఇలాంటి మార్పులు వస్తే బాగుండు

1)రిపోర్టర్ 2 చేతులూ ఉపయోంచి పట్టుకునే విధం గా మైకులు రూపొందాలి.అప్పుడే మనకి
సంగీత దర్శకుల/భరత నాట్య భంగిమ లనుండి విముక్తి.

2)మైకు ముందు నిర్దేశిత వాల్యూం కంటే ఎక్కువ గొంతు చించుకుంటే మైకు పనిచెయ్యకూడదు.మైకు పట్టుకున్న వాడికి,మైకు ముందు నిల్చుని గొంతు చించుకున్నవాళ్ళకి మైల్డ్ షాక్ వస్తే ఇంకా మంచిది.లేకపోతే వినలేక చస్తున్నాము ఆ గొంతులు.సూర్యకాంతం ఎందుకు పనికొస్తుంది ఆ గొంతుల ముందు.మైకు కనపడగానే రెచ్చిపోతున్నారు కొంత మంది ఈ మధ్య.న్యూస్ ప్రెజెంటర్ లకి కూడా వర్తిస్తుందండోయ్ ఇది.


3)ఇప్పుడూ చెప్పబోయేది జస్ట్ ప్రపోజల్ స్టేజ్ లోనే ఉంది,డెవలప్ చెయ్యాలి,ఏమిటంటే ఒక డిజిటల్
ఫిల్టర్ ఉండాలి.ఎక్స్ క్లూజివ్ అంటూ టీవీల వాళ్ళు ప్రాణం తోడేస్తారు కదా,అందుకని రోజులో 10 సార్లు కంటే ఎక్కువ సార్లు కనుక అదే న్యూసు,పిక్చర్ రిపీట్ అయితే ప్రసారం అవ్వకూడదన్నమాట.

4)వాళ్ళు చెప్పే చెత్త విని మనకి డిసైడ్ చేసే చాన్స్ ఇస్తున్నాము అని ఏదో తూచ్ గా అనకుండా నిజంగా ఇవ్వాలి.

చదివారుగా,వెంఠనే వేరే బ్లాగు చూడకుండా ఇంకా ఏమయినా సలహాలు చెప్పి మరీ వెళ్ళండి

(ఏంటో మార్పు మార్పు అంటున్నాను కానీ నేనే మారిపోతానేమొ చివరాఖరికి."మార్పు" అంటూ తన పార్టీ పరిస్థితి ని మార్చేసిన నాయకుడిలాగ అవుతానేమో.తెలుగు చానెల్స్ కి ఎక్కడ అడిక్ట్ అయిపోయి అడ్జస్ట్ అయిపోతానో అని భయమండీ.)

PS:నాకు చానెళ్ళని తిట్టాలి అని అస్సలు ఉద్దేశం లేదండీ.మెరుగయిన సమాజం కోసం,దుమ్ము రేపుతూ పని చేస్తున్న మన తెలుగు చానెళ్ళు కాస్త వినసొంపుగా అదేనండీ "వినబుల్" గా మాట్లాడితే విందామని ఒక కోరిక అంతే.

Tuesday, April 27, 2010

కానున్నది కాక మానదుగామా మామయ్య కొడుకు ఒకడు ఈ మధ్యే 10th క్లాస్ రాసాడు. పరీక్ష రాసి ఇంటికి వచ్చాడో లేదో,సాయంత్రం ఒక కాలేజీ ప్రతినిధి వచ్చాడు.మా కాలేజీ లో ఐఐటీ ఇంటర్ ప్యాకేజీ లో చేరితే మీకు రాయితీ,ఎంసెట్ క్లాసులు ఫ్రీ ఇంకా ఏమిటో చెప్పుకు వచ్చాడు.. కాని మా మామయ్య ముందు అలాంటి పప్పులు ఉడకవు.ఇంటికి వేరే రూట్ లో నుండి వస్తేనే పెట్రోల్ ఎక్కువ ఖర్చు అవుతుందేమో అని ఆలోచించే మామయ్యని అంత త్వరగా ఎలా బుట్ట లో వెయ్యగలరు?

ఆ ప్రతినిధి చెప్పింది అంతా సావధానం గా విని ఒక్కటే అడిగాడు,మాకు ఈ కన్సెషన్ లూ అవీ వద్దు కాని మా వాడు మామూలు ఇంటర్ కి ఎంత ఖర్చు అవుతుందో చెప్పు అని. అదేంటి సార్ పిల్లాడిని ఐఐటీ లో చేర్చను అనే తండ్రిని మిమ్మల్నే చూస్తున్నా,ఐఐటీ లో సీట్ వస్తే క్యాంపస్ ఇంటర్వ్యూ,తరువాత అమెరికా ప్రయాణం ఎక్సెట్రా చెప్పి మా మామయ్య కి డాలర్ డ్రీంస్ చూపించాడు.వూహూ,కరగడే మామయ్య.ఇక లాభం లేదనుకుని మామయ్య కొడుకు వైపు తిరిగి తాను బట్టీ పట్టిన కధ కొంచం ఇంట్రెస్టింగా మళ్ళీ చెప్పాడు.
కాసేపటికి మా మామయ్య కొడుకు,"వద్దండీ నేను మామూలు ఇంటర్ చదివి డిగ్రీ జాయిన్ అవుతాను.సివిల్స్ రాయాలని ఉందండీ" అనటం తో అదేదో వినరాని మాట విన్నట్లు అక్కడ నుండి బయలుదేరాడు ఆ ప్రతినిధి.నాకు అనిపించింది,ప్రస్తుతానికి ఈ కాన్సెప్ట్ లేదు కానీ,ఐఐటీ ఇంటర్ ప్యాకేజీ లాగే మన విద్యా వ్యాపారులు సివిల్స్-ఇంటర్ ప్యాకేజీ తో వస్తారేమొ అని.

కొన్నొ రోజులకి మామయ్య ఫోను చేసి చెప్పాడు,వాళ్ళ అబ్బాయిని ఫలానా కాలేజీ లో చేర్పించాడని.ఆ కాలేజీ పేరు వినగానే ఆశ్చర్యపోయాను నేను.ఎందుకంటే,ఇంతకముందు మామయ్య వద్దనుకున కాలేజీ వాళ్ళు నడిపేదే ఇప్పుడు మామయ్య చెప్పిన కాలేజీ కూడా.అదేమిటి,అది కూడా కార్పోరేటు కాలేజీ యే కదా,పైగా వాడు సివిల్స్ అదీ రాస్తాడు అన్నావు మళ్ళీ ఇప్పుడేమిటి ఇలా అన్నాను.


అలాగే అనుకున్నాను రా నేను కూడా,కాని కొద్ది రోజుల క్రితం ఈ కాలేజీ నుండి ఉత్తరం వచ్చింది.ఆ ఉత్తరం లో ఇలా ఉంది.

"మీ అబ్బాయి టాలెంట్ గురించి స్కూలు ద్వారా తెలుసుకున్నాము.మీరు కల గంటున్న సివిల్స్ సాధన మా కాలేజీ ద్వారానే సాధ్యం,ఎందుకంటే,యే ఇతర కాలేజీ లో లేని సివిల్స్-ఇంటర్ ప్యాకేజీ మా కాలేజీ లోనే లభ్యం.పైగా దీనితో పాటు ఎంసెట్ ఫ్రీ"
వీడిని ఇప్పటి నుండీ సివిల్స్ వైపు మళ్ళిస్తేనే కదరా వాడు సాధించగలిగేది,అయినా నమ్మకం కలగక నేను కాలేజీ కి వెళ్లాను.అక్కడ నా లాంటి వాళ్ళు ఉన్నారు కొంత మంది.ఈ ఇంజనీరింగు ఏముందండీ అందరూ చేస్తున్నదే గా,మీరు డిఫరెంట్ గా ఆలోచించటం నిజం గా గ్రేట్,మీ లాంటి వాళ్ళ కోసమే ఈ ప్యాకేజీ అంటూ వాళ్ళు పిల్లలని ఏ విధం గా సివిల్స్ కోసం తీర్చి దిద్దుతారో చూపించారు ప్రెజెంటేషన్ ద్వారా.

మా ప్రయత్నం మీ పిల్లాడి క్రుషి కలిసి తప్పక విజయం సాధించటానికి అంటూ "సాధన యంత్రం" కూడా తక్కువ ధరకే ఇచ్చారు.ఈ తాయెత్తు కొంటే,ఇంకొక "ధన ప్రవాహ" యంత్రం లో 60% తగ్గింపు ట,ఇది మీ బిజినెస్ కి పనికి వస్తుందండీ అనేసరికి నోట మాట రాలేదనుకో.పిల్లాడి గురించే కాక,నా గురించి కూడా ఆలోచించటం నిజం గా గ్రేట్ రా.అందుకే వెంటనే వాడిని జాయిన్ చేసేసా.పైగా నెక్స్ట్ ఇయర్ "సిద్ధ కార్య యంత్రం" లో కూడా తగ్గింపుట.రెండు విధాలా ప్రయోజనం అని నీతో కూడా చెప్పకుండా వాడిని అక్కడ జాయిన్ చెసేసా" అనేసరికి నోట మాట రాలేదు నాకు.

ఒరేయ్,పిచ్చి మామయ్య,ఇంటర్ నుండీ సివిల్స్ కోచింగ్ ఏమిటి రా,పైగా కార్పోరేటు కాలేజీ లో.నువ్వు మామూలు ప్యాకేజీ తీసుకోవట్లేదని ఆ కాలేజీ వాడే మాంచి ప్లాన్ తో వేరె పేరు చెప్పి నీ దగ్గరకి వచ్చి అదనం గా తాయెత్తుల పేరు చెప్పి డబ్బు వసూలు చేసారు (మొదట చెప్పిన ఇంటర్+ఐఐటీ ఫీజు కి అదనం అన్నమాట)అందామనుకుని నోటి దాక వచ్చి ఆగిపోయాను.రాసి పెట్టి వుంటే...అనుకుంటూ

(రకరకాల ఆఫర్లతో తల్లి తండ్రులని మాయ చేస్తున్న కాలేజీలు,సరికొత్తగా "తాయెత్తులు",వగైరాలు కూడా ఇస్తే ఎలా వుంటుందో అని ఊహించి రాసినదే ఇది.)

Sunday, April 25, 2010

కానున్నది కాక మానదుగామా మామయ్య కొడుకు ఒకడు ఈ మధ్యే 10th క్లాస్ రాసాడు. పరీక్ష రాసి ఇంటికి వచ్చాడో లేదో,సాయంత్రం ఒక కాలేజీ ప్రతినిధి వచ్చాడు.మా కాలేజీ లో ఐఐటీ ఇంటర్ ప్యాకేజీ లో చేరితే మీకు రాయితీ,ఎంసెట్ క్లాసులు ఫ్రీ ఇంకా ఏమిటో చెప్పుకు వచ్చాడు.. కాని మా మామయ్య ముందు అలాంటి పప్పులు ఉడకవు.ఇంటికి వేరే రూట్ లో నుండి వస్తేనే పెట్రోల్ ఎక్కువ ఖర్చు అవుతుందేమో అని ఆలోచించే మామయ్యని అంత త్వరగా ఎలా బుట్ట లో వెయ్యగలరు?

ఆ ప్రతినిధి చెప్పింది అంతా సావధానం గా విని ఒక్కటే అడిగాడు,మాకు ఈ కన్సెషన్ లూ అవీ వద్దు కాని మా వాడు మామూలు ఇంటర్ కి ఎంత ఖర్చు అవుతుందో చెప్పు అని. అదేంటి సార్ పిల్లాడిని ఐఐటీ లో చేర్చను అనే తండ్రిని మిమ్మల్నే చూస్తున్నా,ఐఐటీ లో సీట్ వస్తే క్యాంపస్ ఇంటర్వ్యూ,తరువాత అమెరికా ప్రయాణం ఎక్సెట్రా చెప్పి మా మామయ్య కి డాలర్ డ్రీంస్ చూపించాడు.వూహూ,కరగడే మామయ్య.ఇక లాభం లేదనుకుని మామయ్య కొడుకు వైపు తిరిగి తాను బట్టీ పట్టిన కధ కొంచం ఇంట్రెస్టింగా మళ్ళీ చెప్పాడు.
కాసేపటికి మా మామయ్య కొడుకు,"వద్దండీ నేను మామూలు ఇంటర్ చదివి డిగ్రీ జాయిన్ అవుతాను.సివిల్స్ రాయాలని ఉందండీ" అనటం తో అదేదో వినరాని మాట విన్నట్లు అక్కడ నుండి బయలుదేరాడు ఆ ప్రతినిధి.నాకు అనిపించింది,ప్రస్తుతానికి ఈ కాన్సెప్ట్ లేదు కానీ,ఐఐటీ ఇంటర్ ప్యాకేజీ లాగే మన విద్యా వ్యాపారులు సివిల్స్-ఇంటర్ ప్యాకేజీ తో వస్తారేమొ అని.

కొన్నొ రోజులకి మామయ్య ఫోను చేసి చెప్పాడు,వాళ్ళ అబ్బాయిని ఫలానా కాలేజీ లో చేర్పించాడని.ఆ కాలేజీ పేరు వినగానే ఆశ్చర్యపోయాను నేను.ఎందుకంటే,ఇంతకముందు మామయ్య వద్దనుకున కాలేజీ వాళ్ళు నడిపేదే ఇప్పుడు మామయ్య చెప్పిన కాలేజీ కూడా.అదేమిటి,అది కూడా కార్పోరేటు కాలేజీ యే కదా,పైగా వాడు సివిల్స్ అదీ రాస్తాడు అన్నావు మళ్ళీ ఇప్పుడేమిటి ఇలా అన్నాను.


అలాగే అనుకున్నాను రా నేను కూడా,కాని కొద్ది రోజుల క్రితం ఈ కాలేజీ నుండి ఉత్తరం వచ్చింది.ఆ ఉత్తరం లో ఇలా ఉంది.

"మీ అబ్బాయి టాలెంట్ గురించి స్కూలు ద్వారా తెలుసుకున్నాము.మీరు కల గంటున్న సివిల్స్ సాధన మా కాలేజీ ద్వారానే సాధ్యం,ఎందుకంటే,యే ఇతర కాలేజీ లో లేని సివిల్స్-ఇంటర్ ప్యాకేజీ మా కాలేజీ లోనే లభ్యం.పైగా దీనితో పాటు ఎంసెట్ ఫ్రీ"
వీడిని ఇప్పటి నుండీ సివిల్స్ వైపు మళ్ళిస్తేనే కదరా వాడు సాధించగలిగేది,అయినా నమ్మకం కలగక నేను కాలేజీ కి వెళ్లాను.అక్కడ నా లాంటి వాళ్ళు ఉన్నారు కొంత మంది.ఈ ఇంజనీరింగు ఏముందండీ అందరూ చేస్తున్నదే గా,మీరు డిఫరెంట్ గా ఆలోచించటం నిజం గా గ్రేట్,మీ లాంటి వాళ్ళ కోసమే ఈ ప్యాకేజీ అంటూ వాళ్ళు పిల్లలని ఏ విధం గా సివిల్స్ కోసం తీర్చి దిద్దుతారో చూపించారు ప్రెజెంటేషన్ ద్వారా.

మా ప్రయత్నం మీ పిల్లాడి క్రుషి కలిసి తప్పక విజయం సాధించటానికి అంటూ "సాధన యంత్రం" కూడా తక్కువ ధరకే ఇచ్చారు.ఈ తాయెత్తు కొంటే,ఇంకొక "ధన ప్రవాహ" యంత్రం లో 60% తగ్గింపు ట,ఇది మీ బిజినెస్ కి పనికి వస్తుందండీ అనేసరికి నోట మాట రాలేదనుకో.పిల్లాడి గురించే కాక,నా గురించి కూడా ఆలోచించటం నిజం గా గ్రేట్ రా.అందుకే వెంటనే వాడిని జాయిన్ చేసేసా.పైగా నెక్స్ట్ ఇయర్ "సిద్ధ కార్య యంత్రం" లో కూడా తగ్గింపుట.రెండు విధాలా ప్రయోజనం అని నీతో కూడా చెప్పకుండా వాడిని అక్కడ జాయిన్ చెసేసా" అనేసరికి నోట మాట రాలేదు నాకు.

ఒరేయ్,పిచ్చి మామయ్య,ఇంటర్ నుండీ సివిల్స్ కోచింగ్ ఏమిటి రా,పైగా కార్పోరేటు కాలేజీ లో.నువ్వు మామూలు ప్యాకేజీ తీసుకోవట్లేదని ఆ కాలేజీ వాడే మాంచి ప్లాన్ తో వేరె పేరు చెప్పి నీ దగ్గరకి వచ్చి అదనం గా తాయెత్తుల పేరు చెప్పి డబ్బు వసూలు చేసారు (మొదట చెప్పిన ఇంటర్+ఐఐటీ ఫీజు కి అదనం అన్నమాట)అందామనుకుని నోటి దాక వచ్చి ఆగిపోయాను.రాసి పెట్టి వుంటే...అనుకుంటూ

(రకరకాల ఆఫర్లతో తల్లి తండ్రులని మాయ చేస్తున్న కాలేజీలు,సరికొత్తగా "తాయెత్తులు",వగైరాలు కూడా ఇస్తే ఎలా వుంటుందో అని ఊహించి రాసినదే ఇది.)

వేడి బాబోయ్....వేడిబాబొయ్ ఎండాకాలం.ఎండలకి భయపడి కాదండీ బాబూ,కాలేజీలు,స్కూళ్ళ అడ్మిషన్ ల హడావిడి చూడలేక,వినలేక.మొన్నటి వరకు "శ్రీ చైతన్య" వాళ్ళు ఢంకా బజాయించి,శంఖం పూరించి మరీ పిలిచారు మా పరీక్షకి రండోయ్ అని. ఆ గోల భరించలేక నాకు అనిపించేది,అబ్బా,త్వరగా విద్యార్ధులు పరీక్షకి వెళ్తే బాగుండు,ఈ శంఖాలు,ఢంకాలు ఆగుతాయి అని.ఈ యాడ్స్ ని మనము చూడటం కంటే వింటాము అంటే కరక్టేమో.

సరిగ్గా చెప్పాలి అంటే స్కూలు,కాలేజీ యాడ్ ని చదువుతారు గబగబా ఒక 15-20 సెకన్లలో.నాకు ఈ యాడ్స్ చూస్తోంటే(వింటోంటే) చిన్నప్పుడు రేడియోలో "జ గ దాం బా సెంటర్ వి శా ఖ పట్నం" అని ఒకావిడ గొంతు వినిపించేది. అది గుర్తు వస్తుంది. కనీసం ఆ యాడ్ వింటే అసలు ఎమంటున్నారో అర్ధం అయ్యేది.ఇప్పుడేమో క్రింద ఇచ్చిన విధం గా యాడ్ వుంటుంది.

"గత 20 సంవత్సరాల నుండి ఇంటర్,ఐ ఐటీ,ఎంసెట్,ఏఐట్రిపులీ లలో అగ్రగామిగా కొనసాగుతూ ప్రముఖ అధ్యాపకులతో స్థాపించబడి,20 ఎకరాలా సువిశాల ప్రాంగణం లో నిర్మించిన జంతర్మంతర్ కాలేజీ అడ్మిషన్ లు ప్రారంభమయినవి.వివరాలకు సంప్రదించడి ఫోను 9866655444,9877766655. ఎక్స్పీరియెన్స్డ్ ఫ్యాకల్టీ,అధునాతన ల్యాబ్స్,రుచికరమయిన ఆహారం మా ప్రత్యేకత".ఇంకా గత సంవత్సర రిజల్ట్ లు కూడా అదనం ఈ యాడ్ లో.

అసలు ఏమి అర్ధం అవుతుంది ఈ యాడ్ వింటే. అయినా కాని ప్రతీ కాలేజీ అడ్మిషన్ లు ఫుల్లే. ఇంక అర్ధం అయ్యే విధం గా యాడ్స్ ఇస్తే.....

ప్రతీ పేపర్ లో రోజూ ఒక వార్త ఫలానా స్కూల్ టాలెంట్ టెస్ట్ అని.అసలు ఈ టాలెంట్ టెస్ట్ కి వెళ్ళిన దగ్గరనుండీ దోపిడీ మొదలు.అప్లికేషన్ దగ్గర నుండీ అన్నీ కొనుక్కోవాలి.ఇంకా ఈ ప్రైవేటు కాలేజీ,స్కూళ్ళలో వసతుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.అసలు వీళ్ళ యాడ్ కి, అసలు స్వరూపానికి నక్కకి నాగ లోకానికి ఉన్నత తేడా.వీటి గురించి మరొక పోస్టు లో చూద్దాము.


వీటి గోల ఎప్పుడు తగ్గుతుందో ఏమిటో.ఇప్పుడూ కాదు కానీ,రిసల్ట్ లు వచ్చిన తరువాత చూడాలి హడావిడి.చాలా సంవత్సరాల క్రితం ఒక కధ చదివాను.కార్పోరేట్ సంస్కౄతి విస్తరిస్తున్న తొలి రోజులలో అన్నమాట.ఆ కధ లో ఒక మామూలు గుమాస్త కొడుకు స్టేట్ ఫస్ట్ వస్తాడు.ప్రతీ కాలేజీ వాళ్ళు రావటం,ఒక దండ అబ్బాయి మెడ లో వేసి తమ దగ్గర జాయిన్ అవ్వమని అడగటం.ఈ కాలేజీల గోల భరించలేక ఆయన తన పిల్లాడిని దాచేస్తాడు. ఇదే ఐడియా పాటిస్తే మంచిద్దేమో ఇప్పుడు తల్లితండ్రులు అనిపిస్తోంది నాకు.

కాని ఇక్కడ విచారించదగ్గ విషయం ఏమిటి అంటే,తల్లి తండ్రులే(అందరూ కాదు అని మనవి) ఇప్పుడు పిల్లలకి రకరకాల ఆప్షన్స్ ఇంచి వారికి ఊపిరి ఆడనివ్వట్లేదు అని నా అభిప్రాయం.జీవితం లో ఐఐటీ ఇంజనీరో,మామూలు ఇంజనీరో,డాక్టరు తప్ప అసలు మిగతావి ఉద్యోగాలే కావు వీరి ద్రుష్టి లో.

"కార్పోరేటు కాలేజీ లో చదవని వాడు కాకి జన్మ ఎత్తున్" అని టీవీలో యే స్వామీజీ ఆయినా చెప్పేడో ఏంటో అనిపిస్తుంది కాలేజీ అడ్మిషన్ ల కోసం పడుతున్న హడావిడీ చూస్తోంటే. మౌలిక వసతులు లేని కాలేజీ లో చేర్పించమని నేను అనటం లేదు,కాని వేలం వెర్రి అయిపోయాయి ఈ అడ్మిషన్ లు అని నా భిప్రాయం.

మొన్న టీవీలో ఒక బాబా(స్వామీజీ) కాల్ చేసిన వాళ్లకి భవిష్యత్ చెప్పే ప్రోగ్రాం చూసా.దానిలో ఒక మాతౄ మూర్తి కాల్ చేసి,మా అమ్మాయి మొన్ననే ఫలానా స్కూల్ వారి టెస్ట్ రాసింది,మా అబ్బాయి ఇంటర్ రాసాడు.ఎంసెట్ వస్తుందా,వాళ్ళ భవిష్యత్ చెప్పమంది.అందుకు అ బాబా చెప్పిన సమాధానం విని జాలేసింది నాకు ఆవిడ మీద.ఆయన సమాధానం ఇలా ఉంది

" మీ అమ్మాయి బాగానే కష్టపడుతుంది,కాని కష్టానికి తగ్గ ఫలితం అప్పుడప్పుడు దొరకదు.మీరు కొంచం డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టవలిసి వస్తుంది ఆ అమ్మాయి మీద.ఇక అబ్బాయి విషయానికి వస్తే,ఇతను శాస్త్ర సాంకేతిక విద్య కోసం బాగా దూరం వెళ్ళాల్సి వస్తుంది."

ఇక్కడ ఆ బాబా చెప్పినది నిజమా కాదా అని వదిలేస్తే,తమం పిల్లల నైపుణ్యం,శక్తి సామర్ధ్యాలు తెలుసుకోకుండా తల్లితండ్రులు తమ ఆలోచనలని పిల్లల మీద రుద్దుతున్నారు.మీ అమ్మాయి/అబ్బాయి సామర్ధ్యం మీకు కాకపోతే ఎవరికి తెలుస్తుంది చెప్పండి.ఒక వేళ వాళ్ళు తమ అంచనాలకి తగ్గట్లు లేకపోతే ఆ నిజాన్ని ఒప్పుకోలేరు.ఏదో ఒక టాలెంట్ స్కూలో,టెక్నో స్కూలు లోనో వేసేసి వాళ్ళ టాలెంట్ అమాంతం పెంచెయ్యాలని ఆశ.

నాకు తెలిసిన ఒక ఇంజనీరు గారు ఎప్పుడూ తమ పిల్లల చదువు పట్టించుకున్న పాపాన పోలేదు.ఆ...6,7 తరగతులలో ఏమి పట్టించుకుంటాము,కాస్త పెద్ద అయ్యాక ఏదొ ఒక మాంచి హాస్టల్ ఉన్న టాలెంట్ స్కూల్ చూసి వేసేస్తె సరి అంటుండేవారు.అప్పట్లో నేను పిల్లలకి ట్యూషన్లు వెలగబెట్టాలెండి,ఆ ఉత్సాహం తో వాళ్ళ అబ్బాయిని పరీక్షించా.అసలు,ఆ అబ్బాయి కి లెక్కలలో బేసిక్స్ రావని అర్ధం అయ్యింది.అది పట్టించుకోకుందా ఆ ఇంజనీరు గారు ఒక "మాంచి" స్కూలు చూసి దానిలో వేసారు.30-40 వేలు వదిలాయి, అయినా మార్కులు ఇంతకు ముందు లాగే రావటం తో ఆ స్కూలు బాలేదు అని ఒక నింద పడేసి మళ్ళీ మామూలు స్కూలు లో వేసారు.
ఆ స్కూలు బాగుంది,లేదు అనేది పక్కనబెడితే,ఇంజనీరు అయ్యుండీ ఆయన బాధ్యతారాహిత్యానికి నవ్వు వచ్చింది నాకు.

నాకేమి తక్కువ,ఒక 40 వేలు కట్టలేనా పిల్ల/పిల్లాడి కోసం అనుకునే తల్లి తండ్రులు మనలో చాలా మంది వుంటారు.తాము అనుకున్నన్ని మార్కులు రాకపోతే ఆ ప్రతాపం పిల్లల మీద చూపించి ఆ చిన్ని మనసుల మీద చెరగని గాయం చేస్తున్నాము.లేదా,తప్పు నీది కాదు లే నాన్న,స్కూలు/కాలేజీ బాలేదు అని సర్దిచెప్పి ఏమి సందేశం ఇస్తున్నాము?


ఎంత సేపూ మార్కులూ,సీట్లు,పర్సెంటేజీ ల గొడవే కాని,వాళ్ళలో నిజాయితీ,ఆత్మ విశ్వాసం పెంపొందించడానికి ఎంత మంది క్రుషి చేస్తున్నారు?

అందరు పిల్లలూ ఒకే రకమయినా శక్తి సామర్ధ్యాలు కలిగి వుండరు.ఇది గుర్తించిన రోజున మనకి పేపర్ లలో,"విద్యార్ధి ఆత్మ హత్య" లాంటి హెడ్డింగులు కనపడవు.

Thursday, April 22, 2010

ఈ హీరో కి మినహాయింపు ఇవ్వండి ప్లీజ్....


ఈ మధ్య పేపర్ లూ టీవీలలో తెలుగు సినిమా ఖర్చు నియంత్రణ,హీరోల పారితోషికాలు వగైరా వార్తలే కదా.దీని మీద నా అభిప్రాయం చెప్పడానికి కాదండీ ఈ టపా,ఎవరు ఎంత ఖర్చు పెట్టి సినిమా తీసుకుంటే నా బోటి వాళ్ళకి ఏమిటి చెప్పండి.నా జేబు లో నుండి ఒక్క రూపాయి వెళ్ళదు కదా పారితోషికాలకి.సో,నో టెన్షన్.

ఈ మధ్య నాకు మన తెలుగు అగ్ర హీరోలలో ఒకరయిన "దండగమారి క్రిష్ణ బాల" గారి "సింహం" సినిమా గురించి బోలెడు మెయిల్సు,కార్టూన్లు వచ్చాయి.అసలు ఇంక యే ఇతర హీరో సినిమా కి కూడా ప్రజలు ఇంత ఎక్సైట్ అయ్యి తమ క్రియేటివిటీ ని చూపించరేమో అనిపిస్తుంది నాకు.ఆహా,ఓహో,ఏమని చెప్పాలి,ఎన్నని చెప్పాలి ఆ కార్టూన్లు,మెయిల్సు గురించి.సో,ఇందు మూలముగా నేను తెలుగు సినిమా పెద్దలకి విన్నవించునది ఏమనగా,ఈ క్రింద వివరించిన సహేతుకమయిన కారణాలని చూసి,మీ తాజా నిర్ణయం నుండి ఈయన గారికి మాత్రమే* మినహాయిపు ఇచ్చి ఈ హీరో గారు ఎంత పారితోషికం తీసుకుంటే అంత ఇచ్చి ఆయన సినిమాల ని** విడుదల చేయవలసిందిగా కోరడమయినది.

1)ఈయన గారి సినిమాలు సైడ్ ఎఫెక్ట్స్ లేని సహజ ఒత్తిడి నివారిణులు.ఫ్యాక్షన్,యాక్షన్ యే సినిమా అయినా కాని డైలాగ్ కంటే ముందు యాక్షన్ అలవోకగా వచ్చేస్తుంది.కళ్ళల్లో "రౌద్రం" పలికిస్తున్నా అనుకుని కామెడీ పలికించటం ఈయన కి వెన్నతో పెట్టిన విద్య.సో,చూసిన వారు ఎంత హాయిగా నవ్వుకుంటారో ఊహించండి.

2)హీరో గారే కామెడీ కూడా చేసెయ్యటం వల్ల కమెడియన్ ఖర్చు సేవ్ అవుతుంది.

3)"క్రిష్ణ బాల" గారి సినిమా అనౌన్స్ చెయ్యగానే ప్రజల క్రియేటివిటీ అమాంతం ఎవరెస్ట్ అంత ఎత్తు కి ఎదిగిపోతుంది.సో,పరోక్షం గా ప్రజల మేధో వ్రుద్ధికి కారకులు.

4)కామెడీ,యాక్షన్ ఏక కాలం లో చేయగల హీరో గా ఆయన పేరు మన టాలీవుడ్ పేరు రికార్డులకెక్కడం ఖాయం. అది ,ఆ చెవి నా ఈ చెవినా పడి హాలీవుడ్ కి చేరిందంటే హాలీవుడ్ లో కూడా ఒక కొత్త ఒరవడి మొదలవుతుంది.జేంస్ కేమరన్ గారు మన హీరో ని పెట్టి టైటానిక్-2 తియ్యచ్చు.ఒక్కసారి ఊహించుకోండి.అదిగో అప్పుడే నవ్వెస్తున్నారు.విడుదలయ్యాక ఇంకెన్ని నవ్వుల పువ్వులు పూయిస్తుందో ఈ సినిమా.


*----మన "క్రిష్ణ బాల" గారు కాకుండా ఇంకా ఎవరికి మినహాయింపు కోరచ్చో చెప్పండి.నాకయితే ఇంకెవరూ తట్టలేదు.("మల్లు దుర్జన్" ని అనుకున్నా కానీ,ఈయన గారి సినిమాలని వికారం గా వున్న వాళ్ళకి చూపిస్తే కాసేపట్లోనే తిన్నది బయటకి వచ్చేసి హాయిగా వుంటుంది తప్ప క్రిష్ణ బాల గారి అంత ఎఫెక్ట్ కనపడలేదు నాకు)


**:ఈయన గారి సినిమాలకి కొత్త దర్శకులు,రైటర్ లకి అవకాశం ఇవ్వద్దు అని మనవి.ఎందుకనగా,పాత మూస డైలాగులు,తొడ విరగొట్టుకుని వంశం గురించి చెప్పే డైలాగుల్ కే కదా "క్రిష్ణ బాల" గారు ఫేమస్.ఒకవేళ,కొత్త వాళ్ళు వచ్చి కొత్తగా ఆలోచించి ఇవన్నీ తీసెస్తే....అందుకే పాతవారినే కొనసాగించి సినిమాల మీద సినిమాలు తీసెయ్యండి.

ఒకవేళ,హీరో గారి పారితోషికం సరిపోలేదంటే,అఖిలాంద్ర ప్రేక్షకులము అందరమూ కలిసి తలా ఒక రూపాయి వేసుకుని పారితోషికాన్ని అడ్జస్ట్ చేసేద్దాము.హాయిగా కాసేపు నవ్వుకోవడానికి టిక్కట్టు ఖర్చు మీద రూపాయి అదనం అంతే,కదా.

Disclaimer: ఈ సలహాని సినీ పెద్దలు పాటించిన తరువాత సైకాలజిస్టులకి,స్ట్రెస్స్ బస్టర్ పుస్తకాలకి డిమాండ్ తగ్గితే పూచి నాది కాదు.

నాకు తెలిసిపోయిందోచ్


ఇంతకముందు చక్కగా ఉత్తరాలు రాసునే వాళ్ళము.అది పోయి ఫోను,ఈ మెయిల్సు వచ్చాయి.మొదట్లో నాకు యు.యెస్.యే.నెట్ ఐడీ వుండేది ఈమెయిల్ స్రుష్టించుకున్న కొత్తలో.ఆ సైటు సర్వర్ కి నా మెయిల్సు చూసే భాగ్యం లేక పోవటం తో అది పెయిడ్ సైట్ అయిపోయింది,నేను యాహూ కి మారిపోయాను.తరువాత జీమెయిల్ కూడా వాడటం మొదలెట్టాను.కొన్ని రోజులకి అందరూ ఆర్కుట్ అంటొంటే అలా వింటూ ఉన్నానే కాని దానిలో ఐడీ క్రియేట్ చేసుకోలేదు.

ఎవరినయినా ఫొటోలు పంపమంటే ఆర్కుట్ లో వున్నాయి,చూడు అనేవారు.ఛీ,మరీ క్రీ.పూ.మనిషిగా జమకట్టెస్తున్నారు,ఇక దాని సంగతి చూద్దామని ఆర్కుట్ లోకి వచ్చాను.మొత్తానికి కాస్త అర్ధం ఆయి వాడటం మొదలేట్టేసరికి ఫేస్ బుక్ వచ్చేసింది.ఏంటీ నీకు ఫేస్ బుక్ లేదా అని అడిగించుకునే స్టేజీ కి వచ్చాను.అయినా సరే దాని వైపు కన్నెత్తి చూడలేదు.ఈ మధ్య కొత్తగా ట్విట్టర్ వచ్చింది కదా,దానినీ యధాప్రకారం పట్టించుకోలేదు.కాని శశి ధరూర్ దుమారం విని,చూసి దాని సంగతి చూద్దామని బయలుదేరాను.

మొత్తానికి అకౌంట్ మొదలెట్టి దానిలోకి ఒకసారి తొంగి చూసాను.దానిని నేను క్రింధి విధం గా అర్ధం చేసుకున్నాను.


1) ఇది కూతలు కూసే (ట్వీటే) ప్రదేశం.

2)ఎసెమ్మెస్ ల కంటే సులభమయిన ఆంగ్లం వాడచ్చు.పైగా పీపుల్ ని ట్వీపుల్ అని ఇంకా రకరకాల కూతలు.పడుకుంటున్నా,ఇప్పుడే జిం లో నుండి వచ్చాను ఇలా సెలెబ్రిటీ లు ఏమి రాసిన దాని కోసం వెర్రి జనాలు ఎంత ఎదురు చూస్తారో నవ్వు వచ్చింది.పైగా సదరు సెలిబ్రిటీ చెప్పేవరకు అసలు ఆ అకౌంటు వారిదో కాదో కూడా తెలీదు.సెలెబ్రిటీలు కూసిన కూతలనే(ట్వీట్స్ అండీ) పాయింటు గా తీసుకుని మన పేపర్ల వాళ్ళు ఎంచక్కా తమ పేపర్ నింపేస్తున్నారు(గాసిప్ సైట్లు,కొన్ని పేపర్లవాళ్ళు).

3)ఈ కూతలు ఒకోసారి కుర్చీ కి ఎసరు కూడా పెడతాయండోయ్.కాని వీటి వల్ల మన రాజకీయ నాయకుల కుర్చీలకి వచ్చిన ముప్పు ఏమీ లేదు అని శివమణి లాగ డ్రంస్ కొట్టి మరీ విన్నవించుకుంటున్నాను.యేల అనగా,మన రాహుల్ గాంధీ,సింధియ లాంటి యువ(?) నాయకులు తప్ప ఎవరూ దీనిని వాడరు.మిగతా నాయకులు అంతా "సెక్కెట్రీ" అని కేకేసి పని కానించుకునే వాళ్ళే కాబట్టి వారికి కుర్చీ గురించిన చింత అక్కర్లేదు.

డైరెక్ట్ గా టీవీలకి దొరికిన వాళ్ళే "బంగారం" లా జీవించెస్తున్నారు మన దేశం లో.సో,ఒకవేళ ఎవరయినా నాయకుడు ఇంకొక నాయకుడి గురించి కూస్తే మాత్రం పట్టించుకుంటారా చెప్పండి. శసి ధరూర్ ని పీకేసారుగా అనకండి. ఏదో ఆయన కాస్త బాధ్యత గా వ్యవహరించి తప్పుకున్నాడూ గానీ లేకపోతే "కులం" ట్రంప్ కార్డు వాడెయ్యరూ అసలు సిసలు నాయకులు.లేదా ప్రతిపచ్చమో,అధికార పార్టీ కుట్రో,లేదా నా ఎదుగుదల చూసి ఓర్వలేకే ఈ "కూతలు",అంటూ కుర్చీ మాత్రం వదలరు.

అదీ,మొత్తానికి నేను ఇక్కడ మిస్స్ అయ్యేది ఏమీ లేదు అని డిసైడయిపోయి మళ్ళీ దాని వైపు కూడా చూడట్లేదు.

Tuesday, April 20, 2010

మన పేపర్ వాళ్ళ యాడ్ సెన్స్ (సరదాకి --27)

ఏది ఏమయిన కాని మన పేపర్ల వాళ్ళు తమ పేపర్లలో యాడ్స్ ఆపరు అన్న సంగతి తెలిసిందే.ఈ గోలా నా లాగ ఇంటర్నెట్ లో పేపర్ చూసే వాళ్లకి అయితే బాగా అర్ధం అవుతుందేమో.పాప్ అప్ బ్లాకర్ పెట్టినా గానీ కొన్ని తప్పవు,యాడ్స్ ఆపక్కర్లేదు,కానీ ఆ యాడ్స్ ప్లేస్మెంట్ విషయం లోనే తంటా.
కావాలంటే పైన ఫొటో చూడండి మీకే అర్ధం అవుతుంది మన పేపర్ వాళ్ళ సెన్స్.

ఫొటో చూసినా అర్ధం కాలేదా,అదేనండీ మన వైయేస్ ఆర్ గారి హెలికాప్టర్ మిస్స్ అయింది అని వార్త ప్రచురించి కిందే ఏదో మాట్రిమోనీ సైట్ వారి యాడ్,"పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నారా" అంటూ. దానిని చూస్తే ఎలా వుంది అంటే,"ఆపదలో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా" అన్నట్లుగా లేదూ?

Thursday, April 15, 2010

వీరు కూడా "ఓదార్పు" యాత్ర చేపట్టడం అత్యవసరం(సరదాకి-26)


ప్రస్తుతం రాష్ట్రం లో మండుతున్న ఎండలు,భంగపడ్డ యువరాజు గారి "ఓదార్పు"యాత్ర తప్ప ఏమీ బర్నింగ్ ఇష్యూస్ లేవు. నాకు మాత్రం ఇంకొకళ్ళూ కూడా ఓదార్పు యాత్ర చెపడితే బాగుంటుంది అనిపిస్తోంది.వారెవరనుకుంటున్నారు?
అయితే ఇది చదవండి మరి.

యువరాజు గారి ఓదార్పు యాత్ర వల్ల ఎవరికి ఓదార్పు దొరుకుతోంది అనేది బేతాళ ప్రశ్న కాబట్టి దానిని వదిలేద్దాము.ఒకటి మాత్రం అర్ధం అయ్యింది నాకు,అనుకున్నది సాధించలేనప్పుడు ఇలా "ఓదార్పు" య్యాత్రలు చేపట్టి ప్రజలు(?) మా పక్షమే సుమా అని అధిష్టానానికో లేదా అడ్దుపడ్డ సైంధవులకో చూపించచ్చు.కానీ వారు పట్టించుకుంటారా లేదా అన్నది 5 కోట్ల రూపాయల ప్రశ్న(మిలియన్ డాలర్ ని ఇలా రూపాయల లోకి మార్చా,డాలర్ 50 రూపాయల చొప్పున లెఖ్ఖ వేసా లెండి)

హైదరాబాద్ లో పాపం మన జర్నలిస్టు అన్నలు,అక్కలకి మండే ఎండలలో మీర్జా ల ఇంటినుండి కూల్డ్రింక్సు,కుల్ఫీలూ అందలేదట కష్టపడి 10 రోజులనుండీ కవర్ చేస్తున్నాగాని.అప్పుడెప్పుడో అభిషేక్ ఐశ్వర్య ల పెళ్ళికి ఇలాగే గొడవ చేసారు.ఇప్పుడేమో మాకు రాచ మర్యాదలు జరిగాయి బచ్చన్ల ఇంటి ముందు, ఇక్కడేమో మీర్జా లు అసలు పట్టించుకోవట్లేదు అంటూ ఒకటే ఏడుపు.

నాకు ఒకటి అర్ధం కాదు,పిలవని పేరంటానికి వెళ్ళి ఇలా అయ్యిందని గోల పేడితే ఎలాగ?ఇంకా కామెడీ ఏమిటీ అంటే,మనందరమూ ఇక్కడ బ్లాగులలో అనుకుంటున్న సామెత ని(ఊళ్ళో పెళ్ళికి,కుక్కల....)దమ్మున చానెల్ వారు వాడటం,వేరే చానెల్ వారి జర్నలిస్టులని చూపిస్తూ.ఇంకా వుందండోయ్,ఇలా వగరుస్తూ(ఇది ట్రేడ్ మార్కు అయిపోయింది కదా)చెప్పే రిపోర్టరు ఎక్కడో లేడు,తాజ్ క్రిష్ణా ని చుట్టుముట్టిన జర్నలిస్టులకంటే ఒక 5 అడుగులు వెనక వున్నాడేమొ మహా అయితే,అంతే.దానికి ఈయన గారు వాళ్ళని కుక్కలతో పోల్చడం.అసలు ఈ అక్కసుకి అసలు కారణం ఈయనగారికి అక్కడ చోటు దక్కకపోవడం అని నా అనుమానం.

ఇంకా ఈరొజు దమ్మున్న చానెల్ వారు ఇంకొక రహస్యం కూడా చెప్పారండోయ్.మీడియా వాళ్ళు సానియా టెన్నిస్ ఆడటం మొదలెట్టినప్పటినుండీ కవర్ చెస్తున్నారట.ఏమో బాబు నాకు మాత్రం సానియా పేరు 2002 కి ముందు తెలీదు.పోనీ నేను బావిలో కప్పనే అనుకుందాము,మీ అందరికీ ఎప్పటీ నుండీ తెలుసు?


ఇంతకీ ఈ రహస్యం ఇప్పుడు ఎందుకు విప్పాడు అంటే,సానియా కి 6 యేళ్ళప్పటినుండీ కవర్ చేస్తున్నా కానీ తమని కవరేజ్కి అనుమతించలేదుట.ఇన్ని ఏడుపులు ఎందుకు చెప్పండి,ఇంతకీ చెప్పోచేది ఏమిటి అంటే,హైదరాబాదు లో తమకు దక్కాల్సిన మర్యాద దక్కలేదని తెగ ఇదయిపోతున్న జర్నలిస్టులు కూడా ఒక ఓదార్పు యాత్ర చేపడితే ఒక పనయిపోదూ?

దొరికితే ప్రజల నుండి ఓదార్పు దొరుకుతుంది లేదా తమ కవరేజ్ ని నిబ్బరం గా తట్టుకున్న ప్రజలని ఓదార్చచ్చు.

Tuesday, April 13, 2010

Saradaaki-25


ఉగాది రోజు రాయలసీమ లో "రమ" గారింటికి వెళ్తోంది "అదేదో" టీవీ యాంకర్ "స్వాతి". తాము వస్తున్నాము అని ముందుగా చెప్పిన కాని ప్రతీసారి తమకు ఎదురయ్యే స్వాగత మర్యాదలు ఏమయ్యయబ్బ అనుకుని ఒకసారి అడ్రస్సు సరిచూసుకున్నారు స్వాతి ఆమె కెమేరా మ్యాన్ ఏడుకొండలు.మెల్లిగా ఇంటి తలుపు తట్టగానే,ఏడుకొండలు తన కెమేర ని రెడీగా పట్టుకున్నాడు."ఆ అస్తన్నా!",అని ఒక కంచుకంఠం వినపడగానే ఖంగుతిన్నారిద్దరూ.ఇంతలో ఒక భారీ ఆకారం తలుపు దీసి "ఆ టీవీవోల్లు మీరేనా,ఆడ కూసోండి,ఇప్పుడే అత్తా" అంటూ లోపలకి వెళ్ళింది.

తన చేతిలో కెమేరా ఆన్ లో ఉంది అని రియలైజ్ అయిన ఏడుకొండలు దాని ఆఫ్ చెయ్యబోయాడు,ఇంతలో పీక మీద తళ తళ లాడిన ఆయుధాన్ని చూసి మిన్నకుండిపోయాడు.కాసేపటికి "రమ" ఉరఫ్ "రవణమ్మ" వచ్చింది.పండగ కదా,
కూసింత పనులెక్కువుంటాయి అంటూ నవ్వేసరికి స్వాతి కి ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు.అసలు ప్రతీ ఎపిసోడ్ ఎలా వుంటుంది,తమ కోసం ఇంటిని ప్రత్యెకం గా అలంకరించి,తాము తలుపు కొట్టగానే టీవీలో తమ చానెల్ మాత్రమే చూసేటట్లు అంతా సెట్ చేసుకున్నాకే అప్పుడే వచ్చినట్లు తాను లోపల అడుగు పెట్టేది.కాని ఇక్కడ సీను ఏమీ అర్ధం కావట్లేదు.హాయిగా టీవీలో పాత సినిమా చూస్తున్న పెద్దాయనని ధైర్యం చేసి అడిగింది,తమ "అదేదో" చానెల్ పెట్టుకుంటే రికార్డ్ చేసుకుంటాము అని.అంతే,ఆయన చూసిన చూపు జీవితం లో మర్చిపోదు మరి.

ఇంతలో "రమ" వచ్చింది వంట మొదలెడదామ అంటూ.ఇదేమిటి ఇలాగా,కనీసం మీరు కాస్త మీ వంటిల్లు అలంకరించి మీరు మంచి చీర కట్టుకోండి,కాస్త ఈ స్టీలు గిన్నెలు కాకుండా ఎమయినా గాజు,సిరామిక్ వేర్ లాంటివి... అంది ధైర్యం చేసి.అంతే,రమణమ్మ గయ్యిన లేచింది."ఏందీ,వంటిల్లంతా అలంకరించాలా,నేను మాంచి వర్కు చీర కట్టుకుని టిక్కు టిక్కు మని ఆ గాజు గిన్నేలలో గరిటాడిస్తే మీరు దానిని సూపిత్తారా,ఎప్పుడయినా వంట చేసావా ఇంట్లో నువ్వు,
నేను ఇలాగే వంట సెత్తాను,అంతే!" చేసేది లేక షూటింగ్ మొదలెట్టారు అలాగే.
ఇక చూడంది వాళ్ళ సంభాషణ.
స్వాతి:ఈరొజు మన కార్యక్రమంలో రాయలసీమ నుండి రమ గారు తమ ఇంటి రుచులని మనకి చూపించబోతున్నారు.అవేమిటో వారినే అడిగి తెలుసుకుందాము.నమస్తే రమ గారు.
రమణమ్మ:నా పేరు రమ కాదు,రమణమ్మ,సిన్నగా ఉంటదని రమ అని సెప్పా అంతే.నన్ను మా యమ్మ ఆళ్లెట్టిన పేరుతోనే పిలవాలి.
ఇంతలో కెమేరమ్యాన్ కెమేరా ఆఫ్ చేసి వచ్చి మ్యాడం కాస్త నెమ్మదిగా నవ్వుతూ మాట్లాడండి అని చెప్పాడు.అంతే,"యేంటీ నెమ్మదిగా నవ్వుతూ మాట్లాడాలా,నేను ఇట్టాగే మాట్లాడతా,ఎంది నన్ను తియ్యవా నువ్వు అని గుడ్లురిమేసరికి మళ్ళీ కెమరా ఆన్ చేసాడు.
స్వాతి"రమణమ్మ గారు,ఈరొజు పండగ కదా,ఏమి చెస్తున్నారు ఇంట్లో.
రమణమ్మ:పొద్దుగూక అందరమూ తలస్నానాలు సెసినాం,మా సిన్న బిడ్డ ముంగటంతా ముగ్గులు పెట్టింది,నేనేమో రాత్రి పాసి గిన్నెలుంటే ఇప్పుడే కడిగినా.
స్వాతి:మీ ఇంట్లో వంట గురించి చెప్ప్పండి.
రమణమ్మ:పప్పుశారు,పెరుగు.నేను కీళ్ళనొప్పులతో లెగలేకపోతున్నా అనుకో అందుకే ఏమీ సెయ్యట్లా ఈరొజు.
స్వాతి:రమ గారు మా ప్రేక్షకుల కోసం ఏమి చూపించబోతున్నారు
రమణమ్మ:ఆ,ముక్కల పులుసు సూపిత్తా.
స్వాతి:సరే కావాల్సిన పదార్ధాలు చెప్పండి.

రమణమ్మ:అన్ని కూరగాయ ముక్కలు,సింతపండు
స్వాతి:ఉప్పు,నూనే కూడా కావాలి కదండీ
రమణమ్మ:స్టవ్వు,గిన్నే కూడా కావాలి
స్వాతి:దీని తయారి విధానం ఇప్పుడు చూదాము
రమణమ్మ:ముక్కలన్నీ కోసి తాలింపు లో పడెయ్యాలి.
స్వాతి:ఇవి మగ్గటానికి కాస్త టైం పడుతుంది కదండీ,ఇంతలో మీ గురించి చెప్పండి,ఎంత మంది మీరు
రమణమ్మ:13 మందిమి
స్వాతి:ఓహ్,అంత మందా,మీరు ఎన్నోవారు
రమణమ్మ:13
స్వాతి:ఆఖరివారన్నమాట
రమణమ్మ:13 మందిలో 13 ఆఖరేగా
స్వాతి:చిన్నవారు కదా,మీకు మీ అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములలో ఎవరంటే ఇష్టం బాగా
రమణమ్మ:అందరిష్టమే.
స్వాతి:ఖాళీ సమయంలో ఏమి చేస్తుంటారు
రమణమ్మ:మా వారి కుటీర పరిశ్రమ లో ఒక చెయ్యి వేస్తాను
స్వాతి:ఓహ్ నిజంగా గ్రేట్,ఇంతకీ మీవారు ఏమి తయారు చెస్తుంటారు
రమణమ్మ:(పక్కనే వున్న అలమార లో నుండి ఒక చిన్న గుండ్రటి వస్తువు తీసి)ఇది
స్వాతి:ఇదేమిటండీ

రమణమ్మ తన చేతిలో ది కింద జారవిడిచింది.అంతే,స్వాతి,ఆమే కెమేరా మ్యాను ఏడుకొండలు ఠారెత్తిపోయారు అది బాంబని తెలిసి.
ఇంతలో ఆ ముక్కలు మగ్గటంతో కాస్త చింతపండు పులుసు పోసింది దానిలో రమణమ్మ.
స్వాతి:దీని ఇంకా ఎంత సేపు మరగనీయాలండీ
రమణమ్మ:సింకు లో మిగిలిన అంట్లు పూర్తి అయ్యేంతవరకు
స్వాతి:పులుసు మరిగిందండీ,ఇప్పుడు ఏమి చెయ్యాలి
రమణమ్మ:ఏంది తెలీదా,తాలింపేసి దింపెయ్యాలి
స్వాతి:దీని మీద గార్నిషింగ్ ఎలా చెయ్యాలండీ
రమణమ్మ:ఏదందీ?
స్వాతి:ఆ,ఏమీ లెదండీ.

గబగబా తాలింపు వేసి వేడి వేడి పులుసు కాస్త గరిటలో తీసి స్వాతికించ్చింది.
స్వాతి:అయ్యో,వేడండీ ఎలా తాగను?
రమణమ్మ:ఏందీ,టీవీలలో మాత్రం అబ్బా,వావ్ అంటావుగా వెంటనే రుసి సూసి,సూడంతే
అంతే,దెబ్బకి యాంకరమ్మ నోరు కాలి ఒక నెల రోజులపాటు ప్రేక్షకులకి ఏక్తా కపూర్ సీరియళ్ళ లో ఆడవాళ్ళలా అలంకరించుకుని చేసే వంట కార్యక్రమాలు బందు.

Monday, April 12, 2010

Saradaaki-24


ఏమిటో అసలు ఈరొజు నిద్ర పట్టక అలా ఐపీయెల్ చూస్తూ అంతర్జాలం లో టపాలు చూస్తోంటే సుజాత గారి "చదువుల" టపా కనపడింది.అది చూడగానే ఇది రాయాలనిపించింది.ఈ రోజుల్లో మన దేశం లో పిల్లలని చూస్తే జాలి వేస్తోంది.అసలు నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాల క్రితమే ఈ జబ్బు మొదలయ్యింది తల్లితండ్రులలో.అవును,తల్లి తండ్రులదే తప్పు అంటాను నేను.

అసలు పిల్లలకి చిన్న చిన్నపజిల్స్ పూర్తి చెయ్యటము,కధల పుస్తకాలు చదవటము అనే కాన్సెప్ట్ ని పరిచయం చెయ్యనిది వారే కదా.1995 కల్లా బాగా కేబుల్ టీవీ ఇంటింటా వచ్చేసింది.పైగా అప్పుడే మధ్యతరగతి వారు కాస్త డబ్బు కళ్ళ చూడటం,ఊరూరా షాపింగు మాల్సు పుట్టడము అన్నీ అప్పుడు మొదలయ్యినవే కదా.అంతే,ఇంక అప్పటి నుండీ పిల్లల శైలి లో మార్పు గణనీయంగా కనపడుతోంది.
ఆ,ఎమున్నాయండీ మా ఊరిలో ఒక గ్రంధాలయమా,పార్కా అంటారు ఏదన్న ఆంటే,అంతే కానీ అందుబాటులో వున్నవి అందిద్దామనుకోరు.కనీసం ఇంట్లో కూర్చుని ఆడే ఆటలయినా ఆడచ్చుకదా పిల్లలతో.మొక్కై వంగనిది అనే సామెత ఊరికే చెప్పలెదుగా మన పెద్దవాళ్ళు.ఎప్పుడయితే తల్లితండ్రులలో ఈ ధోరణి అలవడిందో అప్పుడే పుట్టాయి హోం ట్యూషన్లు,"ఈ" చ్లాసులు,లేదా ఆఫ్టర్ స్కూల్ స్టడీ అవర్సు.హ్యాండీ గా వుండటంతో చాలా మంది తల్లితండ్రులు కూడా వీటికే మొగ్గు చూపుతున్నారు.
కాస్త తెలివయిన వారెవరయినా ఆర్టు,పెయింటింగ్,క్లాసులు పెట్టుకుంటే మాంచి గిరాకీ ఈ ఎండలలో.చాలా మంది తల్లి తండ్రులకి తమని విసిగించకుండా పిల్లలు ఎంగేజ్ అవ్వటం కోరుకుంటారు,సో ఇక ఇలాంటి క్లాసుల నిర్వాహకులకి 2 నెలలలో కాసుల పేర్లు చేయించుకునెంత కాసులు రాల్తాయి మరి.
ఆ,పాత కాలం లో లాగ పిల్లలు ఎండా కాలం శెలవులు గడపాలంటే ఎలా కుదురుతుంది అంటారేమో,పోనీ ఇప్పటి ట్రెండు కి తగ్గటుగానే గడపనీయండి బట్ తల్లితండ్రులుగా కొంచం మీ సహకారం అందించండి.కలిసి అలా బజారు కి వెళ్ళి కూరలు కొనుక్కురావడమో,వీలుంటే కలిసి ఆడటం లాంటివి చేసి చూడండి,దానిలో వున్న మజా మీకే తెలుస్తుంది.అనుభవం తో చెప్తున్నా మరి :)

Friday, April 9, 2010

Saradaaki-23ఈ మధ్య బ్లాగులోకం లో మన తెలుగు చానెళ్ళని అనవసరంగా అడిపోసుకుంటున్నారర్రా,అందరూ కలిసి.తప్పు కదూ.పాపం ఎంత కష్టపడి వాళ్ళు అలా సానియా ఇంటి ముందు కాపలదారుల్లాగ నిలువు కాళ్ళతో నిలబడి ఇప్పుడే కుడి నుండి యెడమకి సానియ కదిలింది అనో,వాళ్ళ అమ్మ ఇప్పుడు గెడ్డం పుచ్చుకుని బతిమాలుతోంది అనో,అర్ధరాత్రి ఇద్దరూ కలిసి యే ఇసుక్రీము తిన్నారు అనో లెదా ఇదిగో పెళ్ళి యేర్పాట్లకి సాక్ష్యం అంటూ అప్పుడే ఆటో లోంచి దింపిన బియ్యం బస్తాని చూపెడుతూ కష్టపడి రిపోర్టింగ్ చెస్తోంటే మీకు ఆటలయిపోయిందా.


అసలు ఈ రిపోర్టర్లకి ఉన్న ఇంకొక అపురూపమయిన విద్య కూడా తెలుసండొయ్.అదే పరకాయ ప్రవేశం.ఎంచక్క అవతలి వారి మనసులో ఏముందో చక్కగా మనకి వర్ణించెస్తారు.అవతల స్టూడియోలో నుండి కోటు సరిచేసుకుంటూ న్యూసు రీడర్ "ఆ,మూర్తీ ఇప్పుడు వున్న పరిస్థితులలో సానియ షోయబ్ ఎలా స్పందించబోతున్నారు" అని ప్రశ్న సంధిచడం ఆలస్యం చక్కగా ఒకటేసారి సానియా షోయబ్ మనసులలోకి పరకాయ ప్రవేశం చేసేసి "ఆ శ్వేత,సానియా షోయబ్ ఈ పరిణామాలని నిశితం గా పరిశీలిస్తున్నారు.ఏది ఎమయినా కాని 15 నే పెళ్ళి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నారు. అయితే ఈ ఆటంకాలని ఎలా ఎదుర్కోవాలి అని గత రాత్రి చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు."అంటూ గడగడ చెప్పెస్తాడు.కావాలంటే సానియా ఇంటి ముందు నిల్చునే అవతల పాకిస్తాన్ లో షోయబ్ బావ ఎమనుకుంటున్నడో కూడా చెప్పెయగలరు.

పాత బస్తీ పరిస్తితుల మీద పోలీసు ఆఫీసర్లే ఏమీ చెప్పనప్పుడు ఈ రిపోర్టర్లే కదండీ,పరిస్థితి ప్రశాంతమనో ఇంకోటో చెప్పెస్త్తున్నారు.పైగా వీరు న్యాయ నిపుణులు కూడా.చక్కగా కేసులు,వెర్డిక్ట్ లు కూడా చెప్పెస్తుంటారు.

ఇప్పుడు చెప్పండి ఇలా మల్టీ టాలెంటెడ్ మేధావులతో కూడిన చానెళ్లని కామెంట్ చేయడం తప్పు కాదంటారా.

Wednesday, March 31, 2010

Saradaaki-22

నిన్న కాసెపు దుమ్ము రేపె చానెల్ చూసానో లేదో,చానెళ్ళ మీద టపా రాసెయ్యాలని ఆవేశం వచ్చేసింది.కాంతం,శంభులింగంల ని మళ్ళీ నెక్స్ట్ టపా లో కొనసాగిస్తాను.
నిన్న కాసేపు దుమ్ము రేపె చానెల్ చూసాను.కాసెపు ఎమో ఏదో వాస్తు యంత్రమో మరోటో గురించి యాడ్.ఇక నా సహనాన్ని కోల్పోయి చానెల్ మారుద్దామనుకుంటుండగా న్యూస్ స్టార్ట్ అయ్యింది.అందుకే అంటారు,కానున్నది కాకమానదు అని .ఆ న్యూస్ బులిటన్ అంతా ఒకటే టాపిక్ మీద అంటే నమ్మగలరా మీరు.
హైదరాబాదు లో కర్ఫ్యూ కదా,అలాంటి వాతావరణం లో మన దమ్మున చానెల్ వారు ఒక గర్భిణీని ఆసుపత్రి కి తీసుకెళ్ళారుట.అదీ సారాంశం.ఒకటే విషయాన్ని ఎన్ని రకాలుగా మార్చి మార్చి చెప్పవచ్చొ నేర్చుకున్నాను నేను.యాక్టివ్ వాయిస్,పేసివ్ వాయిస్ ఎక్సెట్రా లే కాకుండా ఇంకా మనము ఊహించలేనన్ని రకాలుగా అదే వార్తని చెప్పి మొత్తానికి ఆ బులిటన్ ని నింపేసారు.చివరాఖరుకి సదరు గర్భిణీ భర్త గారు దమ్మున్న చానెల్ కి ధన్యవాదాలు చెప్పే సీను మాత్రం భలెగా వుంది.చక్కగా బట్టీ పట్టి గడగడా పొగడ్తలు కురిపించేసాడు.ఓకే,సాయం చేసారు,గొప్ప పనే చేసారు.బట్ దానిని బ్రేకింగ్ న్యూసు గా వేసుకుంటూ,కింద స్క్రోలింగూ వేస్తూ,ఒక న్యూసు బులిటన్ అంతా అదే వార్త తో నింపెయ్యడం అవసరమా అని నా చిన్ని మెదడు కి అంతు పట్టని ప్రశ్న.ఒక్క చానెల్ నే తప్పు బట్టి ఎమి ప్రయోజనం చెప్పండి.అందరూ అందరే.ఇలా బ్రేకింగు న్యూసు లు బ్రేకీ,కుటుంబ పరువు బజార్న పడేసి(సదరు తండ్రి ఎలాంటి వాడయిన కాని,ఇలా చెయ్యకూడదు అని నా భావన) ఒక తండ్రి గుండె ని "బ్రేక్" చెసిన ఘనత కూడా మన ఛానేళ్ళ సొంతం.
మొత్తానికి ఇలా న్యూసు బులిటన్ మొత్తం ఒకటే వార్త తో నింపెయ్యడంతో హాశ్చర్యపోయిన నేను,నా బెటర్ హాఫ్ రాగనే చెవిన పడేసా ఈ వార్త,టీ20 లో లక్ష్మణ్ సిక్సర్ కొట్టినంత ఉత్సాహంగా.నన్ను వెర్రిపీనుగ లా చూసేసరికి అర్ధం కాలేదు నాకు.కాసేపటికి ఆ చానెల్ ఆన్ చేసి,తను నన్ను పిలిస్తే వెళ్ళాను.మరలా సేం టూ సేం న్యూస్.
ఇప్పుడు అర్ధం అయ్యింది,ఇంతక ముంది ఇచ్చిన లుక్కు కి అర్ధం.మొత్తానికి నా పరిస్తితి 6 కొట్టిన ఉత్సాహం లో నెక్స్ట్ బాల్ లో క్లీన్ బౌల్డ్ అయిన లక్ష్మణ్ లా అయ్యింది.
కాసెపటికి అదే చానెల్ లో మరొక ప్రోగ్రాం మొదలయ్యింది.కర్ఫ్యూ కారణం గా ఆగిపోయిన శుభ కార్యాల మీద చర్చ అది.ఒక పెద్దాయన ఏమో మా ఇంట్లో బారసాల ఆగిపోయింది అంటాడు.ఇంకొక ఆవిడ ఏమో రంగరంగ వైభవం గా చేద్దమనుకున్న వాళ్ళ చెల్లెలి కొడుకు పెళ్ళి ఆగిపోయింది అని బాధ పడుతుంది.
శుభ కార్యాలు ఆగిపోతే బాధే కాదు అని అనలేము కాని,ఏమీ చెయ్యలేము కదా.ఆ ప్రోగ్రాం చూస్తే నాకు ఏమనిపించింది అంటే,కర్ఫ్యూ కి కారణమయినా వారి మీద కంటే బయటకి వెళ్ళనీయటం లేదని పోలిఈసుల మీద అక్కసు ఎక్కువ గా గోచరించింది అందులో పాల్గొన్న వ్యక్తుల మాటల్లో.పైగా పోలీసులు అతి చేస్తున్నారని ఫిర్యాదు ఒకటి.ఇలా చెస్తే ఇలా అంటారు,లేకపోతే మా వైఫల్యమంటారు అని ఆ మధ్య ఒక పోలీసు మిత్రుడు వాపోవటం గుర్తు వచ్చింది నాకు. రంగ రంగ వైభవం గా పెళ్ళి చేదామనుకున్న ఆవిడ చెప్పిన ఒక మాట విని మూర్చ వచ్హింది నాకు.ఇలాంటి ముహుర్తం దాటిపోతే మరల 2 యేళ్ళ వరకూ లేదట.అలాంటి ముహుర్తం ఎమయ్యుంటుందబ్బ అని అనుకున్నా.సరే,నా లాంటి పామరులకి తెలీని ముహుర్త బలం కావచ్చు ఆ రోజుది,మరి అలాంటప్పుడు జస్ట్ వధూ వరులతో పెళ్ళి కానిచ్చి అంతా చక్కబడ్డాకా రంగ రంగ వైభవం గా రెసెప్షన్ ఇవ్వచ్చు గా అనిపించింది నాకు.ఇదే మాట తనతో అంటే,ఇలాంటి ఐడియాలు వస్తాయి కాబట్టే ఎవరూ టీవీలొ చర్చ కి ఆహ్వానించరు నిన్ను అని స్టేట్మెంట్ వచ్చేసింది అక్కడ నుండి.నోర్మూసుకుని మరలా ప్రోగ్రాం చూస్తున్న.ఇంతలో ఆ ప్రోగ్రాం కి ఒక ఆసామి కాల్ చేసాడు.హన్న,చేసిన వాడు,చర్చ జరుగుతున్న ఫ్లో కి అణుగుణం గా మాట్లాడాలా వద్దా,ఆహా,అలా కాకుండా,ఇదేదో అసలు పెద్ద విషయమే కానట్లు మాట్లాడి,అంత అర్జెంటు అయితే పెళ్ళి ముందు కానిచ్చేసి తరువాత విందు పెట్టుకోవచ్చు కదా అని నా అవిడియా లాంటి సలహా ఒకటి పారేసాడు.నేనయితా ఎక్సయిటింగా టీవీ వాల్యూం పెంచి చూస్తున్న,యాంకర్,పార్టిసిపెంట్స్ రియాక్షన్ కోసం.
ఎమి జరిగుండొచ్చంటారు?అల్లప్పుడెప్పుడో మన చిన్నప్పుడు "అంతరాయం" అంటూ మాటి మాటి కీ రోజారాణి,విజయ దుర్గ చెప్పే వారు చూడండి,అలాంటిది ఇక్కడ వచ్చిందన్నమాట.మన యాంకరు గారు,"హలో","హలో" వినపడట్లేదండీ,లైను కట్టయ్యింది,ఇంకొక కాలర్ లైన్ లో వున్నారు అంటూ చక్కగా అంతరాయం కలిగించేసాడు.అదేమిటొ తమకి అనుకూలం గా లేని కాల్స్ వస్తే తప్ప ఈ ప్రైవేటు చానెళ్లలో అంతరాయం రాదెందుకో.ఎనీ ఐడియా?

Friday, March 26, 2010

Saradaaki-21
ఒక వీక్ ఎండ్ ఉదయం భర్త ని నిద్ర లేపు దామని గది లో కి వెళ్ళిన భార్యామణి, కాంతం కెవ్వున అరిచింది.ఏమిటే,పొద్దున్నే తెలుగు సినిమా కాని చూసావా ఏమిటి విసుక్కుంటూ లేచాడు భర్త శంభులింగం.
అది కాదండీ ఈరొజు యేప్రిల్ ఒకటి అంది.అయితే ఏమిటే,మన మాజీ ఆర్ధిక మంత్రి లా కాకుండా కాస్త అర్ధం అయ్యెటట్లు చెప్పు అన్నాడూ దీనం గా.'అదేనండీ,నాలుగు నెలల్లో నాలుగు అంగుళాలు లోపలకి పొట్ట తగ్గిస్తాము అంటే ఆ కుప్పి గెంతుల ప్రోగ్రాం లో జాయిన్ అయ్యారు మొన్న జనవరి ఒకటిన గుర్తు వుందా అడిగింది.కాని ఇప్పుడు చూడండి,అసలు 4 సెంటీఎ మీటర్లు కూడా తగ్గలేదు,అంటే మన డబ్బులన్నీ....." అంటూ ఏడుపు మొదలెట్టింది.
"అది కుప్పి గెంతులు కాదే,మొన్ననే గిన్నీసు పుస్తం ఎక్కిన లబ్డబ్ వాల ఏరోబిక్స్" గొప్పగా చెప్పాడు. ఏది అయితే ఏమి లెండి మీ పొట్ట తగ్గలేదు గా దిగులు గా అంది.పోనీ లేవె,ఏదో ఎక్కువ కష్టపడక్కర్లేకుండా పొట్ట తగ్గుతుంది అని జాయిన్ అయ్యను కాని,మరో ఉపాయం ఆలోచిద్దాము అన్నడు.నిజం చెప్పొద్దూ,ఈ పొట్ట కంటే నా బట్టతల మా చెడ్డ దిగులు గా వుంది నాకు విచారం గా చెప్పాడు శంభులింగం.పెద్ద డ్రమ్ము లా అయ్యాను అని మా వాకింగు క్లబ్బు మెంబర్స్ అంటూన్నారండీ అంటూ తన బాధ పంచుకుంది కాంతం.
ఎందుకు మనకి ఈ కష్తాలంటావు కాంతాన్ని అడిగాడు.ఏమో అండీ,నెను రొజూ వాకింగు చేస్తున్నా మా క్లబ్బు మెంబర్స్ తో కలిసి,మీరేమో ఆ లబ్డబ్ లో కుప్పి గెంతులు వెస్తున్నారు.మధ్య మధ్య లో మంతెన గారి డయిటు ఫాలో అయినా రిజల్ట్ రాకపోవడానికి కారణం తట్టలేదు ఇద్దరికీ.అంతే,వెంటనే కారణం అన్వెషించడానికి పూనుకున్నారు ఇద్దరూ ఆరోజు.
మధ్యాహ్నం టీవీ చూస్తున్నారు ఇద్దరూ చెరో గదిలో కూర్చుని. "మను" సిస్టర్స్ ఇబ్బంది లేని వెయిట్ లాస్ ట్రీట్మెంట్,"బాధిక " గారి బట్ట తల మీద జుట్టు మొలిపించే ప్రోగ్రాం ఇద్దరినీ ఆకర్షించాయి.అంతే,వెంటనే కాంతం మనూస్ కి,లింగం బాధిక గారి క్లినిక్ కీ ఫోను చేసారు.
యక్చుయల్లీ ఈ వారం అపాయింటుమెంట్లు లేవు కాని మీరు టీవీ లో ప్రోగ్రాం చూసిన వెంటనే చేసారు కాబట్టి మీకు స్పెషల్ అప్పాయింటుమెంటు మరియు గిఫ్ట్ హ్యాంపర్ అంటూ చెప్పేసరికి ఇద్దరూ కెవ్వుమని అరిచారు ఆనందం తో.
తల మీద జుట్టు తో కొత్తగా కనిపిస్తున్న హర్షా భోగ్లే లో తనని లింగం ఊహించేసుకుంటే,కాసేపు పోకిరీ హీరోయిన్ను తానే అయిపోయింది కాంతం.ఇద్దరూ తమ తమ న్యూ లుక్కు తో ఎలా వుంటామో ఊహించేసుకుంటూ లింగం బాధిక గారి క్లినిక్ కీ కాంతం మనూస్ క్లినిక్ లోకీ కుడి కాలితో అడుగు పెట్టారు.
ముందు మనము కాంతం క్లినిక్ లో కి వెళ్దాము.
"వెల్కం మేడం,మనూస్ కి స్వాగతం,ప్లీజ్ టేక్ యువర్ సేట్" తియ్యగా పలికిందో గొంతు.తనని ఒక గదిలో కూర్చోబెట్టారు.అక్కడ కూర్చుని అందరినీ గమనించ సాగింది.వచ్చిన వారందరినీ తలా ఒక గదిలో కూర్చో బెడుతున్నారు.ఇంతలో ఒకావిడ వచ్చి ఏదో సీడీ పెట్టి టీవీ ఆన్ చేసి వెళ్ళిపోయింది.మొదట తెర మీద దాదాపు తన సైజు లో వున్న ఆకారం ఒకటి ప్రత్యక్షం అవ్వగానే ఉలిక్కి పడింది కాంతం.ఏమిటి తనేనా కొంప దీసి అని.వెంటనే అదే ఆకారం మెరుపు తీగ లా వుంది.ఇంతలో స్క్రీన్ మీద ఒకావిడ ప్రత్యక్షమయ్యి "ఏమిటీ ఆశ్చర్య పోతున్నారా",రెండు ఫొటో లూ ఒకరివే సుమా,మీరూ అలా అవ్వాలనుకుంటున్నారా,అయితే మీరు సరి అయిన ప్లేస్ కి వచ్చారు,కంగ్రాట్స్ అంది".
కాంతానికి అంతా కల లాగ వుంది తను అలా అవుతుంది అనుకుంటోంటేనే.ఈ ఫొటో లో ఆవిడ తిండీ వగైరా మానేసి ఇలా అయ్యిందనుకుంటున్నారు కదూ,కానే కాదు,అన్నీ తింటూనే మా దగ్గర ఇలా అయ్యే ఆస్కారం వుంది,కావాలంటే చూడండి అంటూ తమ ఆఫీసు అంతా అలా ఒక్క సారి చూపించింది యాంకరమ్మ.అన్ని షెల్ఫు ల నిండా బోలెడన్ని తినుబండారాలు.

కాంతానికి ఆనందం ఆగట్లేదు.ఇలా ఇవన్నీ తింటూ కూడా మెరుపు తీగ అవ్వటం ఎలాగో మా ఎక్జిక్యూటివ్ మీకు వివరిస్తుంది అంటూ యాకరమ్మ అంతర్ధాన మవడం తరువాయి,పొట్టి బట్టలేసుకున్న ఒక అమ్మయి వచ్చి తనకెదురుగా కూర్చుంది.
పేరు,ఎత్తు వగైరా వివరాలు రాసుకుని,తనని పక్కనే వున్న వెయింగ్ మిషన్ మీద నిలుచోమంది."మేడం!"మీరు వుండాల్సిన దానికన్న 22 కిలోలు ఎక్కువ వున్నారు తెలుసా అడిగింది పొట్టి బట్టలమ్మాయి.ఇలా వుండటం వల్ల ఏ యే రోగాలు వచ్చే ఆస్కారం వుందో అన్ని రోగాల పేర్లూ చెప్పేసింది గడగడా ఆపితే ఎక్కడ మర్చిపొతుందో అన్నట్లు.


కాంతానికి హార్ట్ యటాక్ తప్ప వేరేది ఒక్కటి అర్ధం అయితే ఒట్టు.మీరు తెలివయిన వారు కాబట్టి ముందె రియలజు అయ్యి మా దగ్గరకి వచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను అనేసరికి ఒక వెర్రి నవ్వు నవ్వింది కాంతం.ఇంతలో ఇంకొక అమ్మయి లోపలకి వచ్చింది పెద్ద కాగితాల దొంతర తీసుకుని.మేడం,మీకు మా ప్రోగ్రాం గురించి మరిన్ని వివరాలు ఇందులో వున్నయి చూడండి అంటూ ఒక తళతళ ళాడే మ్యాగజీను అందించింది.మొదటి రెండు పేజీలలో మనూస్ సిస్టర్స్ సాధించిన విజయాలు,వాళ్ళ క్లంట్లు ఇక్కడకి వచ్చాక ఎన్ని కిలో లు తగ్గినదీ వివరాలు పొందుపరిచారు

గుళ్ళో వుండే చందా పట్టీ లాగ.తానూ అలా అవ్వబోతోంది కొద్ది రోజులలో అన్న ఊహ నిలనివ్వడం లేదు కాంతాన్ని.వెంటనే పుస్తకం మూసేసి ప్రోగ్రాం ఎప్పుడు మొదలెడతారు ఆశ గా అడిగింది.అప్పటి వరకు సీయం సీటు కోసం ఎదురు చూసే ఒక ఉత్తరాంధ్ర నాయకుడు లాగ కూర్చునా ఆ అమ్మాయి వెంటనే ఒక కాగితాల దొంతర అందించింది కాంతానికి.
అక్కర్లేదు నాకు అంతా అర్ధం అయ్యింది గా ఇంక ఏమీ చదవక్కర్లేదు అంది ఎక్సయిటింగ్ గా కాంతం.ఇది ప్రోగ్రాం వివరాలు కాదు మేడం,కాసిని సంతకాలు కావాలి మీవి అని అడిగింది.కొంప దీసి ఇవి నా ఆస్తి పేపర్లు కావు కదా అంటూ వాటిని పరిశీలించింది తనకున్న ఆంగ్ల పరిగ్నానం తో.కాంతం ఇబ్బంది గమనినించిన ఆ అమ్మాయి "ఇదేమీ పెద్ద సీరియస్సు విషయాలు కాదు మేడం,మీరు మధ్యలో మానేసి వెళ్ళిపోయి సన్న బడలేదు అని మమ్మల్ని అనకుండా అంతే"అంటూ తేలిగ్గా నవ్వేసింది.అసలు తను చివరి దాక వదిల్తే కదా అనుకుంటూ ఒక మాజీ ముఖ్యమంత్రి లాగ ఎడాపెడా సంతకాలు గీకేసింది కనీసం ఏమీ చూడకుండా."మా ప్రోగ్ర్రం మొత్తం కాస్టు లక్ష రూపాయలు" అనగానే లేచి నిల్చుంది కాంతం.
*మేడం ఆవెశ పడకండి,మీరు యెర్లీ కస్టమర్ కాబట్టి మీకు ఫీజు రాయితీ,నలభై వేలు మాత్రమె,పైగా మీ కుటుంబ సభులందరికీ మా పార్లర్ లో ఉచిత సర్వీసు కూడా మీ ప్రోగ్రాం పీరియడ్ లో" అనేసరికి ఆనందం తో పిచ్చి గంతులేసి "ఆజ్ మై ఊపర్" అని పాడుకోవాలనిపించిన కోరిక ని అదిమి పెట్టి వెంటనే చెక్కు రాసి ఇచ్చేసింది.మీరు రేపటి నుండీ రావచ్చు మేడం,అంటూ రసీదు తో పాటు మనూస్ సిస్టర్స్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి వున్న ఒక బ్యాగ్ అందించింది.దానిలో రంగు రంగుల పేపర్ల లో చుట్టిన గిఫ్ట్స్ కేసి అదో లా చూస్తున్న కాంతాన్ని చూసి ఆ అమ్మాయి,మీరు వన్ టైం పేమెంట్ చేసినందుకు మా తరపునుండి చిన్న గిఫ్ట్ హ్యాంపర్ అనగానే అలా గాలిలో తేలుకుంటూ బయటకి వచ్చింది.
ఇక అక్కడ బాధిక గారి క్లింక్ లో లింగం ని చూద్దాము రండి.
లింగం లోపలకి అడుగు పెట్టగానే ఒక అమ్మాయి నవ్వుతూ పలకరించింది.మీరు దేనికోసం వచ్చారు అంటూ.మొహమాట పడుతూనే తన అరగుండు ని చూపించాడు.ఇదేమీ అంత ఫీల్ అవ్వల్సిన విషయం కాదు అన్నట్లు గా నవ్వేసి ఆ అమ్మయి పేరు గట్రా వివరాలు తీసుకుని పక్క కౌంటర్ లో కి పంపింది.అక్కడ తెల్ల కోటు వేసుకున్న ఒక అమ్మయి తన తల మీద ఏదో పెట్టి ఎదురుగా కంప్యూటర్ లో చూపిన్స్తోంది.చూడండి లింగం గారూ,మీ తల మీద అసలు వెంట్రూకలు లేవు(ఇది తెలుసుకోవటానిక ఇక్కడకి వచ్చాను అనుకున్నాడు లింగం) ముందు భాగం లో,మీరు ఈ పాటికే ఆ నూనే ఈ నూనే అన్నీ ఈ గుండు మీద రాసి మర్దనాలూ వగైరా చేసేసి వుంటారు,కాని జుట్టు మొలవలేదు కదా ఈ గుండు మీద అనేసరికి షాక్ తిన్నాడు లింగం ఇవన్నీ వీళ్ళకి ఎలా తెలిసాయా అని.
చిద్విలాసం గా నవ్విన ఆ అమ్మాయి,మీ గుండు మీద జుట్టు మొలిపించడం అసాధ్యం కాదు మా క్లింక్ లో అనేస్రికి లింగం పాపం కొంచం ఫీల్ అయ్యాడు మాటిమాటికీ గుండు గుండు అంటోంటే.అయినా బాధ అణచుకుని ఆ అమ్మయి వైపు దీనం గా చూసాడు.ఇదిగో అక్కడక్కడ మీ గుండూ మీద వెంట్రుకలు వున్నాయి,కాని అవి బయటకి రావటం లేదు.అసలు అంటూ గుండు మీద వెంట్రుకలు వున్నాయి కాబట్టి మా ట్రీట్మెంట్ తో ఆ జుట్టు మీ గుండు అంతా విస్తరించేటట్లు చేస్తాము అనేసరికి బాధ లో నూ ఆనందం వేసింది లింగానికి."బాధే సౌఖ్యమనే" అంటూ పక్కన టీవీ లో నుండి ఘంటసాల గీతం వినిపించింది.

"హెలో వరల్డ్" ప్రొగ్రాం లేకుండా ప్రొగ్రామింగు లాగ్వేజెస్ నేర్చుకోలేనట్లు యే క్లినిక్ కి వెళ్ళినా తమ సంస్థ "విజయాల" గ్రంధం చదవటం తప్పనిసరి.

ఇక్కడా లింగానికి తమ సంస్థ సాధించ్న ఘనత,తమ ఎండీ బాధిక గారు అమెరికా లో పట్ట అందుకుటున్నపటి ఫొటోలు,వీరు జుట్టు మొలిపించిన వారి వివరాలు అన్నీ పొందుపరిచిన ఒక చిన్నపాటి గ్రంధాన్ని అందించారు.

ఆల్రెడీ లబ్డబ్ వాల ఏరోబిక్స్ లో ఇవన్నీ చూసి వుండటం తో వారు చెప్పేదంతా విని గబ గబా ఆ సంతకాలు గీకేసాడు అడిగిన చోటల్లా.

పంజాబ్ ఎలెవెన్ ని కొనుక్కున ప్రీతీ జింటా మొహం లో లాగ ఆనందం తాండవిస్తుండగా బయటకి వచ్చి కాంతానికి ఫోను చేసాడు.ఒక మాజీ ముఖ్యమంత్రి గారి విజన్ 2020 లా,తాము సాధించబోయే డ్రీం ఫిగర్ లలో ఎలా వుంటామో ఊహించుకుంటూ ఇల్లు చేరారు.

ఇక వారు అలా ముందుకు పోతూ వారి ఆసయాన్ని సాధించార,ఎలా సాధించారు అనెది నెక్స్ట్ టపా లో చూద్దాము.