Thursday, December 31, 2009

Saradaaki--11

తమ పార్టీ అధికారం లొ వున్న ఒక రాష్త్రంలో విభజన సెగలు పొగలు తనని ఉక్కిరిబీక్కిరి చెస్తోంటే ఇక తన మౌనానికి తెర వెయ్యాల్సిన సమయం వచింది అని అర్ధం అయ్యింది అధినేత్రికి.రాష్ట్రాన్ని ముక్కలు చెయ్యల్సిందే అంటూ సిలైను దీక్ష చెసిన ముక్కురావు మాత్రము తనకి కాల్సింది దక్కుతుండటంతో చిద్విలాసం గా వున్నాడు,ప్రభుత్వ ఖర్చుతో చికిత్స తీసుకుని ఇంట్లొ కూర్చుని నునుపు తేలి.

తప్పదురా అనుకుంటూ కొత్త సంవత్సరం ముగిసాక రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీల తో సమావెశం జరిపి అందరూ అనుకూలం గా వుండటం తో అధికారికం గా విభజన కమిటీ ని వెసింది.ఇదేదో ఎల్లప్పుడూ వెసే దిక్కుమాలిన కమిటీలాంటిది అయితే ఊరుకొము అంటూ విభజన పోరాటాన్ని తన భుజస్కందాల మీద మోస్తున్న నాయకుడు ముక్కురావు వార్నింగు ఇవ్వటము,ఒక వంద బస్సులని తగలపెట్టడము చకచకా జరిగిపోయాయి.ఇది గత నెల రోజులుగా జరుగుతున్న తంతే కావడంతో జనాలకి పెద్ద కిక్కు ఇవ్వలెదు.

అటెన్షన్ ని అమితం గా ఇష్టపడే మన సిలైను వీరుడికి ఇది యే మాత్రము రుచించలెదు.అంతే,మళ్ళీ నిరవధిక బందుకి పిలుపు నివ్వడము,వేర్పాటు వాద పైత్యం బాగ ఎక్కిన నాయకులు చక చక అమలు జరిపెయ్యడం అయిపొయాయి.అసలే బందులతో ముక్కు మూలిగి నడుస్తున్న రాష్ట్రానికి ఈ నిరవధిక బందు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లయింది. అసలు ఈ రాష్ట్రం లో ముఖ్యమంత్రి వున్నాడా లెడా అని పక్కనే వున్న పీయే ని అడగబొయి నాలిక కరచుకుంది అధినేత్రి.తాను ఆడిస్తే ఆడే వాళ్ళని సీయం లని చేయడం తప్పెమొ అని మొదటిసారి అనిపించింది.
ఇక అమాత్యులను పంపకుండా తానే ముందుకు వచ్చి ఒక ప్రకటన ఇచ్చింది.దాని సారాంశం ఎమిటి అంటే రాష్ట్ర ఏర్పాటు త్వరితగతిన పూర్తి అవుతుంది అని.అన్నట్లే పనులు అన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చెసాయి.ఇక రాష్ట్ర ఏర్పాటుని ప్రకటించడమే తరువాయి.వేర్పాటు వాదులంతా సంబరాలలో మునిగి తెలుతున్నారు.

ముక్కురావు మాత్రం ఎవరికి అందుబాటు లో లేడు.మన వీరుడికి గుండెల్లొ రైళ్ళు పరిగెడుతున్నయి ఎక్కడ నిజంగా తాను కోరుకునే రాష్ట్రం ఏర్పాటు అయిపొతుందో అని.ఇది అంత త్వరగా జరిగే పని కాదు లే అనుకుని ఆ ప్రాంత ప్రజలకి తాను మునుపు ఇచ్చిన వరాల లిస్టు తలచుకుని గుండెలవిసేలా రోదిస్తున్నాడు.అసలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే తాను నాయకుడు అవ్వడు అని ఆయనకి కూడా తెలుసు కాని ఒక మాట మాత్రం నిలబెట్టుకొకపొతే తన్ని తగలేసే చాన్సులు ఎక్కువనిపిస్తున్నాయి,అదే ఒక దళితుడిని సీయం చెయడం.ముఖ్యమంత్రి పీఠం మీద ఇంకొకరిని ఊహించుకుంటె గుండే బద్దలయిపొతోంది ఈయనకి.పైగా తాను అనుకున్నాది సాధించెస్తే ఇక తనను ఎవరూ పట్టించుకొరు.మహా అయితే చరిత్ర పుస్తకాలలొకి ఎక్కుతానేమొ అంతే అని తెలుసు.

అందుకే తన బుద్ధికి పదును పెట్టనారభించాడు ఏకాంతంలో.ఒకానొక శుభోదయాన ప్రజల ముందుకి వచ్చాడు.రొటీను వార్తలతో విసిగిపోయిన మీడియా ఆయన ముందు వాలిపొయింది మాంచి కిక్కుతో వచ్చె ఆయన వాక్కు వినడానికి.
మెజారిటీ పార్టీ ల అభిప్రాయంతో మాత్రమే రాష్ట్ర ఏర్పాటు ని తాను ఖండిస్తున్నానని దెశం లో అన్ని పార్టీలు సరే అంటేనె రాష్ట్రం ఏర్పాటు చెయ్యలి అనే వాదనని వినిపించాడు.అధినేత్రి షరా మామూలుగా ఈయన మాటలని ఖాతరు చెయ్యలెదు.
అంతే,మన ముక్కురావు ముక్కుపుటాలు కోపంతో అదిరి ముక్కు మరింత ముందుకు సాగింది.ఎంత అంటే కొత్త రాష్ట్రానికి ఒక సరిహద్దు కాగలిగినంత.తన మాట ఖాతరు చెయ్యనందుకు ఆమరణ నిరాహార దీక్షకి కూర్చున్నాడు.

ఈ వార్త ని టీవీలలో చూసిన ప్రజలు ఆగ్రహోదగ్రులయ్యారు.వెంటనే తమ నాయకుడు దీక్ష చెస్తున్న చోటికి చేరి మానవహారంలా ఏర్పడ్డారు.జనాలని చూసి ముక్కురావు కి కిక్కు వచ్చింది.టీవి ప్రతినిధులు అక్కడకి చేరుకుని ఒక పౌరుడిని అడిగారు మీ నాయకుడికి సంఘీభావం వెంటనే తెలుపుతున్నరెందుకు అని.అంతే,ఆ ఆసామి(పౌరుడు)శివమెత్తాడు.రిపోర్టరు మైకు కింద గిరాటెసి ఇలా చెప్పాడు "ప్రత్యెక రాష్ట్రం ఏర్పాటు అవుతున్నందుకు ఒక పక్క అందరమూ ఆనందం గా వుంటే ఈయన దీక్ష టీవీలలో చూసి షాకయ్యాము.మాకు ఒకటి అర్ధం అయ్యింది,ఈయనకి ప్రత్యెక రాష్ట్రం రావడం ఇష్టం లెదు అని.అందుకే నిజంగా చస్తాడొ లెదొ చూద్దాము.ఈ మానవహారాన్ని దాటి ఒక్క పోలీసు లెదా డాక్టరుని ముందుకు పోనివ్వము."

ఇక మన ముక్కు రాజు పరిస్థితి ఇది చూసాక ఎమయ్యిందో మీ ఊహ కి వదిలెస్తున్నాను.

Saturday, December 26, 2009

Saradaaki-10

మన తెలుగు చానల్స్ లిస్ట్ లోకి ఆ మధ్య దుమ్ము రేపె చానల్ ఒకటి వచ్చి చేరింది.సరేలె,కాస్త అయినా దుమ్ము రెకపొతుందా కొత్త చాన్నల్ అనుకున్నా.
షరా మామూలుగా పొద్దున్నె వార్తలు..నెను చూసినన్ని రొజులూ అదెదొ లీజు వ్యవహారం మీద లారీలు తరలివెళ్తున్న క్లిప్పింగు తప్ప ఇంకొకటి చూపకుండా ఒకటే (గ)లీజు వార్తలు.పైగా 3 పూటలా అదే వ్యాఖ్యానం.ఈ వ్యవహారం చూస్తొంటే "సూసిందే సూడాలనిపిత్తంది" గుర్తొచిందండీ బాబూ.
ఇక ఏ విషయాన్నయినా కాని రొప్పుతూ చెప్పలి అనెది మెరుగయిన సమాజం కొసం పాటుపడే(?) ఛానల్ వారు సౄష్టించిన ఒరవడి కాబట్టి దానిని పాటించటం లొ కొత్త ఛానల్ వారు ఏ మాత్రమూ వెనకబడలెదని మనవి
చెసుకుంటున్నాను.రిపోర్టింగ్ చెస్తూ న్యూస్ రీడర్ అడిగే ప్రశ్నకి రిఫొర్టర్ చెప్పేదానికి సాధారణంగా లింకు వుండకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు.అసలు విషయం చెప్పెస్తే ఇక రేపటానికి దుమ్ము ఎమీ మిగలదు కదా!!

మొన్నటికి మొన్న పాపం తాను తిన్న దెబ్బలకంటే కూడా వీరు అదే క్లిప్పింగు పదే పదే చూపించినందుకు ఎంత కుమిలిపొయి వుంటారొ సదరు నాయకుడు అనిపించింది నాకు.


ఇక చానల్ ఎండీ గారు తాను నిర్వహించే "తెరచిన హౄదయం" కార్యకరమం లో సెలిబ్రిటీ లని "లెజెండ్" ల్ని పిలిచి మనసు విప్పి మాట్లాడమంటారు.కర్ర విరగదు పాము చావదు చందాన ఈయన సగటు వీక్షకుడికి "కిక్"
ఎక్కించే ప్రశ్న సగం అడగటం అవతలి వారు జవాబు సగం చెప్పటంతోనే కార్యక్రమాన్ని తన అర్ధం కాని వ్యాఖ్యానంతో ముగిస్తారు.ఈ కార్యక్రమ్మాని చూసేవారుకి ఎవరికయినా సదరు ఎండీ గారు ఎవరిని అనుకరించటానికి శాయసక్తులా ప్రయత్నిస్తున్నారో లెదా ఇది ఏ కార్యక్రమానికి ఎంకౌంటరో ఇట్టే అర్ధం అయిపొతుంది.


నిన్న ఈరోజు అయితే ప్రధమ పౌరిడి గురించి అధమ వార్తలు అందిచటంలొనే బిజీ బిజీ.ఈ న్యూసు ఐటం తప్ప ఇంకొకటి వుంటే ఒట్టు.రిపోర్టర్లు వీలయినంత ఎక్కువమంది నత్తిగాళ్ళని తీసుకొవటం లొ వున్న శ్రద్ధ కార్యక్రమాల విషయం లొ పెడితే హైదరాబాదు లొ రెగిన దుమ్ము రాష్త్రం అంతా వ్యాపించే అవకాశం వుండెది.

ప్రస్తుతం ప్రజలకి బందులు,శెలవల మీద వచిన విరక్తి న్యూసు చానల్స్ మీద కలిగే రొజుకై ఎదురుచూస్తూ....