Monday, June 22, 2009

Saradaaki-9

రీసెషన్..ఆర్ధిక మాంద్యం..ఏ భాషలో చెప్పినా ప్రస్తుత సమస్య..ఈ తైంలో కొత్త ఉద్యోగాల ఊసె ఎత్తకూడదు అనుకుంటున్నారా?అదేమీ కాదండోయ్..కాస్త ఈ కింద ఇచ్చిన సూచనలు పాటించండి.ఎదో ఒక కొత్తది దొరక్కపోదు.
1)మీకు కాస్త జాతకాలు,గ్రహాల భ్రమణం ఎక్సెట్రాల మీద అవగాహన వుందా?సినీ నటుడి మీద ఆరోపణలయినా,శ్రీనగర్ లో బాంబు పెలుడయినా గబగబా చక్రాలూ గట్రా వేసెసి ఎందుకు జరిగిందో,ముందు ఏమి జరగబోతొందో చెప్పగలిగితే ఇంకెందుకు ఆలస్యం ముందర ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ పాండిత్యాన్ని ప్రదర్శించండి.మరుసటి వారానికి ఎదో ఒక చానెల్ లో మీరె కనిపిస్తారు చూడండి.ఎవరయినా సెలెబ్రిటీస్ పెళ్ళి చెసుకోబోతున్నారు అన్న వార్త వస్తే చాలు మీరు వారి జాతక చక్రాలు అవీ వేసి వారు పెళ్ళి చెసుకుంటే ఎలా వుంటుందో,లెదా ఎమేమి పూజలు జపాలు చెస్తే వారు సుఖం గా వుంటారొ కాస్త మసాలా దట్టించి చెప్పగలిగితే చాలు,(ఎలాగూ విజువల్స్ వగైరా వేసి సదరు చానెల్ వాళ్ళు ఇంట్రెస్టింగ్ చెస్తారనుకొండి)మీ పంట పండినట్లే.

2)మీకు జాతకాలు రాకపొయిన ఫరవాలేదు,మీరు పుస్తక ప్రియులా?అయితే ఇది మీ కోసమే సుమా...నార్మన్ పీలే పుస్తకాల నుండి నాలుగు లైన్లు,షివ్ ఖేరా పుస్తకం నుండి నాలుగు ముక్కలు పట్టుకుని "నిలకడ జీవితానికి నాలుగు నిచ్చెనలు" అని ఒక పుస్తకమో,లెదా ఒక ప్రోగ్రామో నిర్వహిస్తే మీకు తిరుగు వుండదు అంటే నమ్మండి.కాస్త వాగ్ధాటి కూడా కలవారయితే మెల్లిగా ఒక డెగ్రీ కొనుక్కుని మీరే ఒక కౌన్సెలర్ అవతారం ఎత్తి స్కూళ్ళు,కాలేజీలని సందర్శించి "ఒత్తిడిని ఎదుర్కొవడమెలా" అనో "హౌ టూ విన్ దిస్ కాంపిటీటివ్ వరల్డ్" అనో స్టైల్ గా పెర్లు పెట్టి సెమినార్స్ కండక్ట్ చేసి వేలకి వేలు దండుకోవచు హ్యాపీ గా.అసలు ఎలాగూ కాపీ కొట్టే గుణం అనే బేసిక్ క్వాలిటీ వుంది కాబట్టి సినిమాలలో కూదా మీ స్టార్ తిరగచ్చండోయ్.పాత సినిమాలని కాపీ మాత్రమే కొదితే సరిపొదండీ,నేటి ట్రెండు అంటూ ఒకట్రెండు బూతులూ,గురువులు,తల్లితండ్రులమీద ఎంత వెటకారం గా డైలాగులు రాస్తే అంత గిరాకీ.

3)పోనీ పైవి ఎవీ మీకు పనికి రావట్లేదా?నో ప్రాబ్లెం,పొనీ ఇది ట్రై చెయ్యండి.కాస్త అయినా పాక శాస్త్ర ప్రావీణ్యం వుందా?అయితే ఇది మీకోసమే..రొటీన్ దొండకాయ కూరకే కాస్త ఎక్కువ కొత్తిమీర చెర్చి "హరియాలీ దొండా అనో లెదా అమ్మమ్మ చెసే ఆవపెట్టిన అరటి కొరకే "మస్టర్డ్ బనాన" అనో పేరు పెట్టగలిగితే దిన పత్రికలలో కాలం రాయచ్చు లెదా వంట కార్యక్రమాలలో గరిటా తిప్పచ్చు.

4)లాభం లెదండీ ఎమీ పనికిరావట్లేదు అంటారా..ఓకే...మీరు చిన్నప్పుడు మట్టిలో.బురదలలో ఎక్కువ ఆడుకున్నారా?అయితే ఒక పనిచెయ్యండి.మీకు నచ్చని రాజకీయ పార్టీ మీద ఒక గంపెడు దుమ్మో,బకెట్టుడు బురదో జల్లెయ్యండి.చాలా ఆవెశం గా వుండాలి సుమా ఆ పని చెసేటప్పుడు.నాటకం పండిందా మీ దశ తిరిగినట్లే.అసమ్మతి నెతలతో డీలా పడ్డ రాజకీయ పార్టీలు బోలెడు.ఎదో ఒక దానిలో యూత్ వింగ్ బాధ్యతలో,మహిళా వింగు నాయకురాళ్ళో అయిపొవచ్చు.

5)వూహూ భెషుగ్గా వుండెది ఒక్కటీ చెప్పలెదు అనిపిస్తొందా?అయితే వినండి.మీరు ఎదయినా విషయాన్ని గంభీరమయినా గొంతుతో కళ్ళకు కట్టినట్లు గుందెల్లో దడ పుట్టేట్లు చెప్పగలరా?అయితే ఇంకెమి..ప్రయత్నిస్తే మీరే యావద్ ఆంధ్ర ప్రజానీకాన్నీ భయపెట్టచ్చు "ఘోరాలు నేరాలు" కి మీ గొంతు అరువు ఇచ్చి.

6)"డిఫరెంట్" పర్సనా మీరు?అయితే ఇది మీకోసమే సుమా...పాత కాన్సెప్ట్లకి కాస్త టచప్ లు ఇచ్చెసి రేడియో లొనో టీవీలు,లెదా దినపత్రికల లొనో ట్రై చెస్తే, మీరే క్రియేటివ్ హెడ్ మరి.ఎలాగూ జనాలకి ఏడుపు సీరియల్సు బోరు కొట్టెసాయి కాబట్టి మీకు ఢోకా వుండకపొవచ్చు టీవీలలో.

Tuesday, June 16, 2009

Saradaaki-8

మాధ్యమాలు ఎక్కువ అయిన కొద్దీ ఎంటర్ టైన్మెంట్ తగ్గటం ఖాయం.ఈ మధ్య రకరకాల పుస్తకాలు, పేపర్లు,పుంఖానుపుంఖాలుగా టీవీ చానెళ్ళు వచ్చెసాయి.24 గంటల ప్రసారాలలో కొత్తగా చెప్పెది ఎముంటుంది కనుక.పైగా చాలా కార్యక్రమాలు డైలీ ప్రోగ్రాంస్.మహిళా కార్యక్రమాలె తీసుకొండీ,ఎన్ని చానెళ్ళు వున్నాయో అన్నింటిలోనూ పేరు వెరయినా కంటెంట్ ఒకటే."సఖి","చెలి","స్వెచ్హ" పెరు వెరయినా ఒకటే నస అన్నింటిలోను.
ఇక పేపెర్లలొ అయితే డిఫ్ఫరెంట్ అంటూ కూరలు.మునక్కాయా టమాట కూర,దొండకాయ వెపుడు ఇవి డిఫరెంట్ ఎమిటొ నాకు అర్ధం కాదు.ఇక సెల్ఫ్ చెక్ అంటూ "మిమ్మల్ని మీరు ఎలా ఊచించుకుంటారు","పిల్లల్ని సరి అయిన విధంగా పెంచుతున్నారా".ఇలాంటి అస్సెస్మెంట్స్ తో ఒనగూరె ప్రయోజనం మీకు ఎమయినా అర్ధం అయ్యితే కాస్త వివరించగలరు.పైగా ఆ పేపర్లు,టీవీలలో పిల్లల డాక్టరతో ఇంటర్వ్యూలు/ప్రశ్నలు జవాబులు సరేసరి.మా అబ్బాయి రొజంతా టీవీ చూస్తూ వుంటాడు ఎమి చెయ్యాలండీ అని ఒక మహాతల్లి అడిగితే మా పుత్రికారత్నం అసలు అన్నం తప్ప అన్నీ తింటుంది ఎందుకు అంటూ ఇంకొక మహిళామణి ఉత్తరం.
లెదంటే పాటలు ఆటల ప్రొగ్రాంస్ మామూలే.రియాలిటీ షో ల కల్చర్ ఇంకా మన తెలుగు టీవీలకి రానందుకు నెను చాలా హ్యాపి.లెదంటే ఆ షో పైత్యానికి థోడు మన యాంకర్/యాంకరమ్మల వెర్రి వేషాలు పార్టిసిపెంట్ల భావొద్వెగాలు చూడలెక బలయ్యేవాళ్ళము.అసలు చిన్న పిల్లల రియాలిట్య్ షో లు మరీ దారుణం.చెప్పుకొవటానికి ఖాతలో ఒకెఒక్క బ్లాక్ బస్టర్ హిట్ వున్న హీరో/హీరోఇన్ను లెదా సంగీత దర్సకులొ లెదా ఫేడవుట్ అయ్యిన పర్సనాలిటీలె జడ్జీలు.ఇక వారు పిల్ల భావొద్వెగాలతొ ఆడుకునే తీరు దారుణం.సహజంగానె పిల్లలు ఓటమిని త్వరగా అంగీకరించలెరు.ఇలాంటి కార్యక్రమాలు పిల్లలకి ఆరొగ్యమయిన పొటీ తత్వం నేర్పె బదులు అనారొగ్యమయినా వాతావరణాన్ని కలిగిస్తున్నాయి.పిల్లలతో పాటు కొంత మంది తల్లితండ్రులు కూడా ఈ పోటీలకి వత్తాసు పలకటం నిజంగా దురద్రుష్టం.
లెదంటే సమకాలీన రాజకీయ అంశాల మీద చర్చ అంటూ పనిలెని 4-5 పార్టీల నాయకులని పిలిచి జుట్లు ముడేసి సదరు నిర్వాహకుడు చొద్యం చూస్తూ తాను రాజెసిన నిప్పు ఆరిపొకుండా ఆజ్యం పొస్తూ,నాయకులు నాల్కలు జారినప్పుడు బ్రేక్ అని చెప్పడం.కాస్తంత స్క్రీన్ ప్రెజెన్సు వున్న ప్రతీ వాళ్ళూ న్యూసు రీడర్లే.ప్రపంచ గ్నానం శూన్యం ఇక ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అయితే కంప్లీట్లీ ఆఫ్ సగం మందికి. ఆరొగ్య కార్యక్రమాలు అంటూ జాగ్రత్తలు కంటే భయపెట్టడమే ఎక్కువ వుంటుంది ఆ ప్రోగ్రాంస్ లొ.పైగా దాదాపు సగం నివారణ/ఉపశమనం ఉపాయాలు ఇచ్చి,అయినా డాక్టరు పర్యవెక్షణ లెకుండా ఇవెమీ చెయ్యకూడదు అంటూ ముక్తాయిపు ఒకటి.
డబ్బింగ్ సినిమాలు సీరియళ్ళు జనాల మీదకి వదకటం లొ వున్న ఇంట్రస్ట్ డిస్కవరీ చానెల్ కార్యక్రామలని డబ్ చెయ్యటం లొ వుండదు ఎందుకో అసలు అర్ధం కాదు.కనీసం ఒక్క కార్యక్రమ అయినా చెయ్యలెరా?విగ్నాన దాయక కార్యక్రమాలు నిర్మించక్కర్లెదు కనీసం డబ్ చెస్తే అదే భాగ్యం కదూ నాలాంటి వీక్షకులకి.
పేపర్లలొ మాత్రం సెక్స్ ఎడ్యికెషన్ అంటూ పరిధిలు దాటి అన్నీ విపులీకరిస్తున్నారు,టీవీ ప్రెక్షకులకి ఇంకా అలాంటి అద్రుష్టం పట్టకపొయినా కొంతమంది యాంకరమ్మల డ్రెస్సులు,వెషాలు మాత్రం బీ గ్రేడు సినిమాలకి ధీటుగా వుంటున్నాయి.
పెరుగుట విరుగుట కొరకే అంటారు కదా పెద్దలు,ఈ పిచ్చి పొకడలు ఎప్పుడు పొయి మళ్ళీ అలనాటి వైభవం ఎప్పుడు వస్తుందో టీవీలకి.నాడు వారానికి ఒక్కరొజు మాత్రమే ప్రసారమయ్యే చిత్రలహరి/చిత్రహార్ లెదా వారంతపు సినిమా లలో వున్న మజా నేటి టీవీలలో వస్తొందా మనకి?