Sunday, May 10, 2009

Saradaaki--7

ఫిలిం నగర్ లోని ఒక గెస్ట్ హౌస్ లో తెలుగు లొ ఒక పెద్ద హీరొ గారి కొత్త సినిమ డిస్కషన్స్ జరుగుతున్నాయి.ఈ కొత్త సినిమా నిర్మాత,ఇండస్ట్రీ కి కొత్తవాడయిన పప్పు అప్పల నాయుడు.పేరు స్టైల్ గా వుండాలని పీ ఏ నాయుడు అని మార్చుకున్నాడనుకొండి.ఏనాటికయినా తెలుగు సినిమా చరిత్ర లో మైలు రాయిగా నిలచిపొయె సినిమా తీయాలని, ఎన్నొ ఏళ్ళూ గా కష్టపడి సంపాదించిన సొమ్ము అంతా తెచ్చి పెట్టుబడి పెడుతున్నాడు.తెలుగు సినిమాకి "మెగా నక్షత్రం" గా చెప్పుకునె హీరో గారితో తన సినిమా తీస్తున్నందుకు మహదానందం గా వుంది.సదరు హీరో గారు ఇప్పటికె వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతూ సక్సెస్ కోసం అర్రులు చాస్తున్నాడు(మంచి సినిమా కొసం ఎదురుచూతున్న సగటు ప్రేక్షకుడి లా).గత కాలం గా విజయం కోసం ఆయన చేయని ప్రయత్నం లెదు మరి.గ్రాఫిక్స్ తో తీసిన "గంజి" సినిమా గట్టిగా 10 రోజులు ఆడితె ఒట్టు.ఇక డిఫరెంట్ అనుకుంటూ తీసిన "నాన్న" సినిమ ఆయితె నా బోటి వాడికి ఆ సినిమా వచ్చిన సంగతి కూడా తెలీదు.

ఇక ఆలొచించీ చించీ మన హీరోగారి అనుచరగణం,ఖర్చుకు వెనకాడని నిర్మాత కోసం వెతికి మనపీ ఏ నాయుడు ని పట్టుకొచ్చారు.ఇక వర్తమానం లోకి వస్తే మెగా నక్షత్రం గారి పీయే ఎమో హీరో గారి పారితోషికం చెపెసరికి పాపం మన నాయుడు కళ్ళు బైర్లుకమ్మాయి.అయినా తమాయించుకుని కధ వింటే హీరో గారు తప్పక తన పారితోషికాన్ని తగ్గించుకుంటారు,అనడం తో పీయే కి నాయుడు ని ఒక్కటి పీకాలనిపించింది.ముందర రెమ్యునరెషన్ ఫిక్స్ అయితే కానీ మరొక మాట మాట్లాడద్దు అనటంతొ చెసేదిలెక ఒప్పుకున్నాడు పాపం నాయుడు అడిగినంతా ముట్టచెప్పటానికి.
సగం ఎడ్వాన్సు తీసుకున్నాక హీరోగారు కధ వినటానికి ఒప్పుకున్నారు.ఇక మన నాయుడు ని ఎవరూ పట్టలేకపొతున్నారు మెగా నక్షత్రం గారికి తను ఎంతో ఇష్టపడి ఆయనకోసమె రాసుకున్న కధ వినిపించబోతున్నందుకు.

నాయుడు కధ వినిపించి హీరో గారివైపు చూసాడు.హీరోగారు తన స్టైల్లొ ఒక "చిరు" నవ్వు నవ్వి తన అనుచరగణంవైపు చూసారు.అందులొ ఒకడు "ఏంటయ్యా ఇది అసలు మా సారు కి సరిపొయే కధేన ఇది?అసలు సారు ఇంట్రడక్షన్ ఎలా వుండాలి?ప్రెక్షకులని "రఫ్" ఆడించెయాలి.సారు వెసే స్టెప్పులకి తగ్గట్లు ఒక పాట వుండాలి"అంటే మరొకడెమొ "ఎవరినొ హీరోయిన్ గా పెడితె కుదరదయ్య యే "జిష" నో "కనిష్క"నో పెట్టాలి.ఇక అయిటం సాంగు కి మాంచి ముంబాయి ముద్దుగుమ్మ.ఫాక్షన్ అయితే ఒక 200 సూమోలు పైకి లెవాలి చివర్లొ.యాక్షన్ అయితే బ్యాంకాకులో తీయాలి విలన్ చేజింగు.మధ్యలో కామెడీ వుండాలి,కమెడియన్ గా స్టార్ కమెడియన్ ని పెట్టాలి.ఇక చివర్లొ సెకండు హీరోఇన్నుతో ఒక పాట తప్పదు."

ఇవన్నీ వినగానె మన అప్పల నాయుడు కి మతిపొయింది.అసలు తన కధ ఫాక్షనూ కాదు యాక్షనూ కాదు.కధకి కామెడియన్ అవసరమే లెదు,హీరో గారి పాత్రే నవ్వులు పండిస్తుంది.ఈ మాటే చెపితే గయ్యిన లెచారు అనుచరగణం,ఎరా మా హీరోగారు నీకు కమెడీయన్ లా వున్నాడా? మెము చెప్పినట్లు చెస్తే ఇక్కడ వుంటావు లెకపొతే...మళ్ళీ నిన్ను సినిమా తీసుకొనియ్యము అని వార్నింగు ఇచ్చెసరికి కిక్కురుమనలెదు నాయుడు.
ఇదే విషయం ఫోనులొ భార్యకి చెప్పి పాపం ఏద్చాడు.నాయుడూ భార్య తాయరు ఒదార్చొతూ పొనీ అలాగే తియ్యండీ,మీ పాత చింతకాయ కధలని ఎవరు చూస్తారు చెప్పండి అనెసరికి కాస్త తేరుకుని మర్నాడు హీరొగారికి మెసేజు పంపాడు.

అలా సినిమా మొదలయ్యింది.కధలో మార్పులు చెసి ఒక యాక్షను కధ తయారు చేసారు.తన ప్రమెయం ఎమీ లెకుండా షూటింగు జరిగిపోతోంది.అడిగినంత డబ్బు ఇవ్వటమె తన పని.డైరెట్రు గారు కూడా హీరో గారి సెలెక్షనే.బొంగురు గొంతుతో మాధవ్ చెసే కామెడీ సెట్ లొ చూసిన నాయుడు కి వికారం వచింది.ఇక మ్యూజిక్ సిట్టింగులకి వెళ్ళిన నాయుడు అయితే ఇక మళ్ళీ జొక్యం చెసుకోకూడదని డిసైడు అయ్యడు.బొంగురు గొంతు ప్రసాదు మ్యూజిఖ్ డైరెట్రు.బొంగురు గొంతుటొ తను పాడటమే కాకుండా హీరో గారితో కూడా పాడించాడు ట్రెండు అంటూ.ఒక్క పాటా వినసొంపుగా లేదు.డయలాగులలొ ట్రెండు అంటూ ఒకట్రెండు బూతులు కూడా అవలీలగా పలికారు హీరోగారు.

హీరో హీరోయిన్ల పారితొషికాలకే తను అనుకున్న బద్జెట్ అయిపొయింది.మిగతా ఖర్చులకి పాపం అప్పులు చెసాడు.మొత్తనికి షూటింగ్ అయ్యింది.షరా మామూలుగా ప్రెస్ మీట్ లొ హీరో గారి దగ్గ్రనుండీ అందరూ డయలాగు రైటర్లు రాసిన పలుకులనే పలికారు.ఇది దిఫరెంట్ చిత్రమని డైరెట్రు అంటే యూత్ ఫుల్ ఎంటెర్ టైనెర్ అని హీరొయిన్ను సెలవు ఇచ్చింది.(అనగా నెను బట్టలు చాలా పొదుపుగా వెసుకున్నాను అని పాఠకులు అర్ధం చెసుకొవ మనవి).ఖర్చుకు వెరవకుండా మన నిర్మాత గారు సీన్లని అధ్భుతంగా తీసారు అని హీరో గారనెసరికి రాని నవ్వు పులుముకున్నాడు నిర్మాత.

అలా మొత్తనికి సినిమా విడుదల తేదీ ఖరారు అయ్యింది.సినిమా విడుదల రెపు అనగా ఈరొజే తమ ఊరుకు ట్రైను ఎక్కేసాడు నాయుడు.