Sunday, March 29, 2009

Saradaaki-5

సమయం ఉదయం ఏడు గంటలు,భానుడు తన ప్రతాపాన్ని చూపించటం మొదలెట్టెసాడు.భానుడి ప్రతాపం కంటే ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు విడుదల కాబొతుండటంతో నాయకులకు పొద్దున్నే చెమటలు పడుతున్నాయి.ప్రతీసారి లాగ పొటీ అంత వీజీ గా లేదు అని పొటే చెసిన ప్రతీ నాయకుడికీ అర్ధం అయ్యింది.షరా మామూలుగా టీవీ చానెళ్ళు కౌంటింగ్ పారంభం కాక మునుపే తమకు అనుకూలం గా వుండే పార్టీల గెలుపు మీద స్పెషల్ కధనాలని ప్రసారం చెస్తూ వూదర గొట్టేస్తున్నాయి.జీవితం లో ఎదురు చూసీ చూసీ ఇక అవకాశం రాదు అనుకుంటున్న దశ లొ "అమ్మ"రూపం లొ అవకాశం తలుపు తట్టి సీ.యం అయిన శెఖర రాజ రెడ్డి ఏమొ విజయం మీద ధీమ తో ఎప్పుడు ఎప్పుడు తన బ్రాండు వెకిలి నవ్వుని ప్రత్యర్ధులకి చూపాలా అని ఉత్సూకత తో వుండి,మాటి మాటికీ వంకర పొతున్న తన పెదాలని సరి చెసుకుంటూ ఎదురుచూస్తున్నాడు ఫలితాల కొసం.కాలం తో పాటు నాయకులూ మారాలి అన్న విధానాన్ని పాలన లో కాక హావ భావాలకి అన్వయించుకున్న సదరు పంచ కట్టు ఆసామి ప్రచారం లొ గాలి లోకి ముద్దులు కూడా విసిరాడండొయ్.మీకు ఆ వెషాలు నప్పలెదు సారు అన్న సూరిగాడి సలహాని పెడచెవిన పెట్టి మరీ జనాలకి ముద్దులు విసిరాడాయె.విజయోత్సాహం తో ఎప్పుడు ముద్దులు విసరాలా అని తెగ ఇది అయిపొతున్నాడు పాపం.
తొమ్మిదేళ్ళు అధికారాన్ని అనుభవించి కంప్యూటర్ మోజు మీద కర్షకులని,కార్మికులని నిర్లక్ష్యం చెసి గద్దె దిగిన మరొక "మహా" నాయకుడు బాబు చంద్ర ఎమో అన్ని పార్టీలని కలిపి కిచిడీ క్యాండిడేట్స్ని నిలబెట్టి ఫలితాలు అనుకూలం గా వస్తె కుర్చీ ఖాయం అని కలలు కంటూ,విజయం సాధించినా,వీర మరణం పొందిన సైనికుల వద్దా చూపించె తన ట్రేడు మార్కు విక్టరీ సంకెతాన్ని సూచించటానికి ఉవ్విళ్ళు ఊరుతూ,వంకరపొతున్న వేళ్లని అదిమిపట్టి టీవీ కి అతుక్కుపొయాడు.
మార్పు తీసుకువస్తా అంటూ సినిమాల నుండి రాజకీయాలోకి వ్రుత్తి ని మార్చుకున్న ఒక హీరో గారెమో రాజకీయాలలో సక్సెస్స్ రుచి చూడటానికి ఉత్సాహం గా వున్నాడు.ఇదేమీ బామ్మర్ది తీసిన సినెమా కాదు కదా,బాగోకపొయినా బలవంతం గా 100 రోజులు ఆడించి శతదినోత్సవం చెయ్యటానికి.తనకి తోడు గా రంగం లోకి దిగి "పంచ" డయలాగులు కొట్టిన "తమ్ముడు" కూడా ఉత్సాహం గానే వున్నడు.
ప్రజల సత్తా అంటూ రాజాకీయాలలో కుళ్ళు ని కడిగెస్తామంటూ పార్టీ స్థాపించిన మాజీ అధికారి ఎమో తమ అభ్యర్ధుల సత్తా బయట పడేది ఈరొజె అనుకుంటూ టీవీ కి కళ్లు అప్పగించాడు.
ఇక ప్రత్యెక రాష్ట్రమంటూ అనేక హై డ్రామా లాడిన సీకేఆర్ గారు మాత్రాం ఏ టెన్షనూ లేకుండా హాయిగా నిద్రపొతున్నారు,తాను లేచె వేళకి కానీ,ఏవో చిన్న చితకా తప్ప కౌటింగ్ ఒక ఊపు అందుకోదు అని సారు కి తెలుసు కనుక.
ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి.వెకిలి నవ్వుల ఆసామి పార్టీ కానీ,"మాహా" నాయకుడి కూటమి కానీ విజయానికి కనుచూపు మేర లొ కూడా లెవు.
మార్పు కోసం పాటుపడతామన్న హీరో గారి డయలాగుల్ని కూడా జనాలు నమ్మినట్లులేదు."సత్తాపార్టీ పత్త లెకుండా పొయింది.సీకేఆర్ పార్టీ ని ప్రజలు "బొంద" పెట్టేసారు.విప్లవ పార్టీల కి విజయం అంటే తెలీలేదు షరా మామూలుగా.
రాజకీయాలంటే విరక్తి కలిగి ఏదొ చెద్దాము అన్న కసి తొ బరి లో దిగిన స్వతంత్ర్య అభ్యర్ధులు విజయ బావుటా ఎగరేసారు రాష్త్రం లొ కెంద్రం లొ కూడా.వారిళొ కర్షకులు,విశ్రాంత అధికారులు నుంది యవ్వనం తొణికిసలాడే నవ యువథీ యువకులు కూడా వున్నారు.
వారిని అందరినీ తమ పార్టీ ల తరపున కొనెయ్యడానికి పార్టీ లన్నీ యధాశక్థి ప్రయత్నించాయి.ఓఒడిపొయినా బుద్ధి మాత్రం పోలెదు అంటూ అందరూ కలసి కట్టుగా చీ పొమ్మన్నారు డబ్బు ప్రలోభాలకి లొంగకుండా.అందరూ కలిసి సమావెసమయ్యారు.
ఎమి జరగబోతొందొ అనుకుంటూ ప్రజలంతా టీవీ లముందు నుంది కదలటం లెదు.కాసేపటికి గెలిచిన అభ్యర్ధులు అంథా కలిసి రాష్త్రపతి దగ్గరకి వెల్లారు.అందరూ స్వతంత్ర్య అభ్యర్ధులు కావటం తో అందరూ కలిసి "నవ భారత్ నిర్మాణ్" అంటూ ఒక పార్టీ స్థాపించి దానిలో సభ్యులయ్యారు.
వారిళొ గత 40 యెంద్ల నుండీ సెద్యం చెస్తున్న ఆసామి ని సీయం గా ఎన్నుకున్నారు.విశ్రాంత టీచరు గారేమో విద్యా శాఖా మంత్రి,ఇలా వివిధ రంగాలలో నిష్ణాతులని ఆ శాఖల మంత్రులు గా ఎన్నుకున్నారు.ప్రతీ ఒక్కరి పదవీ కాలం 2 సంవత్సరాలు మాత్రమే.ఆ తరువాత మరొక నిపుణుదు బాధ్యతలు స్వీకరించెటట్లు విధాన్నన్ని ఖరారు చేసారు.పదవీ కాలంలో ఎమయినా అనైతిక చర్యలకు పాల్పడితె వేటు వెయాలని కూడా నిర్ణయించారు.
ప్రతీ రాష్త్రం లో ఇలాగె జరిగి,ఈ విధి విధానాలకి బద్ధులై వుంటే ప్రగతి ఏ మాత్రం దూరం కాబొదు అని విశ్వసించిన ప్రజలు సంబరలు జరుపుకుంటొంటే ఓడిపొయిన నాయకులంతా పార్టీలకతీతంగా ఏకమయ్యి ఇది అన్యాయం అంటూ ఎవరికి ఫిర్యాదు చెయ్యాలి అని కసరత్తులు ప్రారంభించారు.
"ఒరీయ్య్ శ్రీను గా ఓటేస్తానన్నావు గా ఇంకా పడుకున్నావెమిటి"అన్న అమ్మ కేక కి ఉలిక్కి పడి లెచాడు మొదటిసారి ఓతు హక్కు వినియోగదారుడు.తాను గన్న కలకి నవ్వుకుంటూ రేడీ అయ్యి పోలింగు కెంద్రానికి వెళ్ళేసరికి తన ఓటు ఆల్రేడీ ఎవరో వేసేసారు అని తెలిసి కాళ్ళెడ్చుకుంటూ ఇంటి ముఖం పట్టాడు.

Thursday, March 5, 2009

Saradaaki-4

మార్చి నెలలొ ఒకానొక శుభోదయం.సమయం ఉదయం 7 గంటలు.
రేడియో లో భక్తి రంజని,ప్రాంతీయ వార్తలని ప్రైవేటు చానళు హైజాక్ చేసి చాలా కాలం అవటంతో జనాలు వాటిని పూర్తిగా మరచిపొయారు.రోజుకొ కొత్త చానెల్,వున్న చానెల్స్ ఎమో పూటకో కొత్త కార్యక్రమం(?)తో వస్తొంటె వీక్షకుల వినోదానికి అంతు ఎముంది.రాత్రి నిద్ర పొయెముందు భగవత్గీతొ మరేదో చదివినంత దీక్షగా వార్తలు చూసి పడుకునే పురుష పుంగవులు లేవగానె శ్రీమతి కాఫీ ఇచ్చెలొపు 3-4 చానెల్స్ మార్చెయటం ఖాయం,ఒక్క రాత్రి లోనే
ఏమి జరిగిపొయిందొ,ఈ చానెల్ వాడు ఇవ్వట్లెదెమొ అని,మరొక చనెల్ లొకి మారిపొతూ వుంటారు,ఎలక్షన్ సమయం లొ నాయకులు అటూ ఇటూ కప్పగెంతులు వెసినంత ఈజీ గా.
ఒక పక్క టీవీ రొద,మరొక పక్క శ్రీమతి గారి కుక్కర్ ఈలలు,పక్కింటి వారి మోటారు శబ్దం కలగలిపి శబ్ద కాలుష్యం వాహనాలు రోడ్ ఎకక్క ముందె మొదలవుతాయి.వీటికి టోడు పక్క ఇంట్లొ నుందో,పైన ఇంట్లొ నుండొ సదరు పురుషుకు ఆనందం గా వీక్షించె కార్యక్రమాలు మన ఇంట్లొనే ఆ చానెల్ పెట్టామా అన్నంత భ్రమ కలిగిస్తూ వుంటాయి,వారు పెట్టిన వాల్యూం కి.
ఇక టీం ఇండీ విదేశాలలొ పర్యటిస్తొందంటె ఏనాడూ పాల పాకెట్టు కి కూడా లెవని మగమహారాజు మ్యాచ్ సమయం కంటె ముందే లెచి కూర్చుంటాదు.టాస్ కూడా మిస్స్ అవ్వకూడదు కదా మరి.
ఇక వీరు లెచి తమ ఆనందం లొ తాము వుంటారా అంటే అదీ లేదు.మొదట శ్రీమతి ని లెపుతారు కాఫీ కొసం.ఆ తరువాత
పిల్లలని లెపుతారు,లెరా లే పరీక్షలు ఇక 10 రోజులే వున్నాయి అని.అటు చలీ,ఇటు వేసవీ కానీ కాలం కావటం తొ పిల్లలు ఇంకా
బద్దకం తొ వుంటారు.అసలు సంవత్సరం అంతా అలవాటు వుంటే కదా ఇప్పుడు లెచి చదవటానికి.మొత్తనికి నాన్న హూంకరింపుతో లెచి కూర్చుంటారు.కూర్చున్నా కానీ నిద్రాదెవి ఇంకా వదలను అంటూంటే ఎలాగో పుస్తకాలు తీసి ముందేసుకు కూర్చుంటారు.ఒక పక్క సచిన్ 4 లు 6 లు బాదుతూ వుంతే,అతగాడి ఆటని వర్ణిస్తూ కామెంటేటర్ చెప్పె మాటలు
మధురం గా వినపడుతోంటే ఇక పాఠాలు ఎమి ఎక్కుతాయి కనుక బుర్రలొకి?క్రికెటు కాకపొతే వార్తలు.అలా ఆ టీవీ మోగాల్సిందే పొద్దున్నే.వార్తలు చూడకపొతే ఆఫీసుకి రానీయరొ ఏమిటొ మరి.చూస్తే చూసారు అనుకుందాము.ఆ రొద లొ పిల్లలని చదువుకొమ్మనటం సమంజసమా?వారి గది లోకి వెళ్ళి వారు చదువుకున్నా కానీ ఎంత మంది బుర్ర కి ఎక్కుతాయి పాఠాలు?
కాసేపు కాగానె అమ్మ స్నాననికి పిలుస్తుంది స్కూల్ బస్ వచ్చె టైం అయ్యిందని.పిల్లడు ఎగిరి గంతేసి పరిగెడతాడు.