Monday, February 2, 2009

Saradaaki-----3

ఎస్సార్ నగర్ చౌరస్తా ,సమయం ఉదయం 10 గంటలు.అమీరుపెట వైపు వెళ్ళే వాహనాలకి సిగ్నల్ పడగానె వాహనాలు రయ్ మంటూ దూసుకుపొతున్నాయి,ఇంతలొ,ఢాం అంటూ,2 ఆటో లు ఢీకొన్నాయి.చుట్టూ జనం గబగబా పొగయ్యారు.ఇంతలొ ఎవరో 108 కి ఫొనె చెసారు.సరిగ్గా అప్పుడె పక్క వీధిలో కుంటుతున్న కుక్క పిల్ల గురించి ప్రత్యెక లైవ్ కార్య క్రమం ప్రసారం చెసి తిరిగి వస్తున్న ఉన్నతమయిన సామాజం కొసం పాటుపడే సదరు చానెల్ రిపోర్టర్ కంట పడింది,అంతే,రాకెట్ లా దూసుకుపోయి క్షతగాత్రులని చేరుకున్నాడు.ఎవ్వరికీ పెద్ద దెబ్బలు ఎమీ తగలలెదు కానీ,ఒక పెద్దాయనకి మాత్రం కాలుకి కాస్త పెద్ద దెబ్బ తగిలి రక్త స్రావం అవుతొంది.

మన రిపోర్టర్ రిపోర్టింగ్ మొదలెట్టేసాడు,

ఒక ప్రత్యక్ష సాక్షి తో :
ప్ర)ఈ ప్రమాదం అసలు ఎలా జరిగింది,దీనిలో ఎవరిది తప్పు అని మీరు అనుకుంటున్నారు?
జ)నేను ఇప్పుడె గా పక్కన వున్న ఇరాని హోటెల్ నుండి వస్తన్నా సారూ,రోడ్ దాటదామని సిగ్నల్ కు సూస్తునా,గంతలో పెద్దగ సవుండు వచ్చినాది సారూ,మొదట బాంబు అనుకున్నా సారూ,వచ్చి సూత్తినా,ఈడ 2 ఆటో లు పడి వున్నాయి సారూ.

ఒక చెత్తో రణగొణధ్వనులు వినపడకుండా చెవు మూసుకుని,మరొక చేత్తో మైకు పట్టుకుని,రిపోర్టర్ చెప్తూ వుంటాడు,
స్వప్నా,ఇక్కడ 2 ఆటొస్ యాక్సిడెంట్ జరిగింది,మొదట ఇక్కడ వున్న వాళ్ళు ఎదయినా బాంబు పేలిందెమొ అనుకున్నారు,కానీ పేలింది బాంబు కాదు అని తెలిసి నీరసపడ్డారు.

ఎంత మందికి గాయాలయ్యాయి మురళీ?
ఎక్కువ మంది ఎమీ గాయపడలెదు స్వప్నా,ఒక 5-6 గురు వున్నటున్నారు అంతె.

క్షతగాత్రుల సంఖ్య ఖచ్చితం గా తెలియట్లేదా మురళీ?
ఇప్పుడె చెప్తాను స్వప్నా,అంటూ గాయపడిన ఒక ప్రయాణీకుది దగ్గరకి వెళ్తాడు,కవచకుండలంతొ(చేతిలో మైకు తో)

చెప్పండి,మీతొ పాటు ఎంత మంది వున్నారు ఆటో లో?
ఎమొనండీ,నెను ఆటో ఎక్కిన 5 నిమిషాలకె బొల్తా పడింది,అంటూ చెతికి తగిలిన దెబ్బలు మంట పెడుతొంటె విసుగ్గ మొహం పెడతాదు.
దెబ్బలు బాగ తగిలాయా మీకు?
పెద్ద దెబ్బలు ఎమీ కాదు కానీ,బాగానె గీరుకుపొయాయి అంటూ లెవబోతాడు,

దెబ్బలు బాగా నెప్పెడుతున్నాయా అంటూ మరొక ప్రశ్న దూసుకువస్తుంది,ఇంతలో గాయపడిన పెద్ద మనిషి విసురుగా వచ్చి రిపోర్టర్ చొక్క పట్టుకుని,ఇప్పుడు చెప్పు,నువ్వు ఉలిక్కిపడ్డావ లెదా?కెమేరా మాన్ కెమేరా ఆఫ్ చెయ్యబొతోంటె కెమేరా లాక్కుని గాయపడీన ప్రయాణీకుడికి ఇస్తాడు.
చెప్పు,భయపడ్డావా లెదా?

రి)వణుకుతూ......అవును పడ్డాను

నీ చొక్కా నెను గట్టిగా పట్టుకున్నానా,వదులుగానా?

రిపోర్టర్ బిత్తరపొతాడు ఆ ప్రశ్న కి,కానీ చెప్పు రా గర్జనతో ఈ లోకం లొకి వస్తాడు.

"గట్టిగానే" అంటూ జవాబిస్తాడు.

నీకు కొంచెం భయం వేస్తొందా,ఎక్కువా?మరో ప్రశ్న దూసుకువస్తుంది

రిపోర్టర్)బాగా భయం వేస్తొంది,అయినా ఎమిటీ ఈ దౌర్జన్యం?

ఎవరిది రా దౌర్జన్యం?దెబ్బలు తగిలి మేము కుయ్యొ మొర్రో అంటొంటె మీకు ఖచ్చితమయిన లెక్కలు కావాలా?
దెబ్బలు నొప్పెడతాయో లెదో నీకు తెలీదా?ఇప్పుడు చెప్పు,అంటూ కెమేరా వైపు తిరిగి,"నెను నిన్ను మొదటిసారి చొక్క పట్టుకున్నప్పుదు నీ ఫీలింగ్ ఏమిటి?"
"చాల భయం వెసింది " వణుకుతూ చెప్తాదు మన రిపోర్టరు.
"ఎమయినా అరాచక శక్తుల కుట్ర అనుకున్న్నావా లెక ఏదయినా టీవీ వాళ్ళు పెట్టె సరదా లైవ్ షో అనుకున్నావా?అసలు నీకు నెను నీ చొక్క మీద చెయ్యి వెయ్యగానే అనిపించింది?

రిపోర్టర్ కి మాట రాక బిత్తర చూపులు చూస్తూ వుంటాడు.


ఇలాగె వుంటుంది రా ఎవరికయినా,షాక్ లొ వున్న వాళ్ళని చచ్చు ప్రశ్నలు అదుగుతావా ఎప్పుడయినా అంటూ గుడ్లురిమి చూస్తాడూ.వెధవ టీవీలూ,వెధవ రిపోర్టింగూ అంకుంటూ,తన కాలికి తన చొక్కా చింపుకుని కట్టు కట్టుకుని,మూగిన గుంపు లో నుండీ బయటకి వెళ్ళిపోతాడు.