Wednesday, January 28, 2009

Saradaaki---2

సమయం ఉదయం ఏడు గంటలు.టీవీ 9.5 ఉదయం కాఫీ కార్యక్రమం ప్రసారం అవుతోంది.24 గంటల ప్రసారాల పెరుతొ చీమ చిటుక్కుమన్నా కానీ వార్త ప్రసారం అయిపోతోంటె ఇంక వార్తలు ఎముంటాయి కనుకపొద్దున్నే కొత్తగా చెప్పటానికి..అయినా కానీ ఉన్నతమయిన సమాజం కొసం పనిచేస్తున్నాము అని చెప్పుకుంటున్నారు కాబట్టి ఎదొ ఒకటి వార్త అందించాల్సిందె.ఆ ధర్మానికి కట్టుబడి సదరు యాంకరు గారు రోడ్డు మీద నిలబడి చలికి వణుకుతూ రిపోర్టింగ్ మొదలెట్టెసాడు.
"చూడండి రోడ్డుమీద ఒరుకులు పరుగులు పెట్టే జనాలని,వీళ్ళలొ సగం మంది కాఫీ తాగకుందానె ఇళ్ళలోనుండి బయటకి వచ్చారు,కాఫీ పొడి,పాల ధరలు ఇలా మండిపొతోంటే వాళ్ళు మాత్రం ఎలా తాగుతారు" అని చెప్పి వగరుస్తాడు.పొద్దున్నే నిద్ర మత్తులొ వుండె నాలాంటి వాళ్ళకి అర్ధం కాదు ఎమి చెప్పాడని ఇప్పటివరకు సదరు యాంకరు గారు అలా వగర్చటానికి.
కాఫీ పొడి,పాలపొడి ధరలు విపరీతం గా పెరుగుట వల్ల రాష్త్రం లొ ముప్పవు మంది పొద్దున్నే కాఫీ చుక్కయినా తాగకుండా రొడ్డు మీదకి వచ్చెస్తున్నారు,దీని మీద మరిన్ని వివరాలు బ్రేక్ తరువాత అంటూ ఒక నవ్వు విసురుతారు న్యూస్ రీడరుగారు. అంధ్ర దెశం లొ ఎదో ఒక రోడ్డు మీద పొయే జనాలని చూపించి రాష్త్రం లొ ముప్పవు శాతం మంది అని న్యూస్ రీడరుగారు ఎలా చెప్పగలిగారో నాలాంటి వాళ్ళకి చచ్చినా అర్ధం కాదు.అసలు వాళ్ళు కాఫీ తాగలెదు అని వీళ్ళకి ఎలా తెలిసిందబ్బా అని ఒక దౌటు వచ్చింది నాకు.బ్రేక్ తరువాత అన్నారు కదా అంటూ ఒక 10 నిమిషాలు అలా టీవీ లొ వచ్చె యాడ్స్ చూస్తూ గడిపా.ఎదురుచూసిన సమయం రానె వచ్చింది.
వెల్కం బ్యాక్ అంటూ న్యూస్ రీడరుగారు మళ్ళీ ఒకసారి ఆనాటి(ఆ 10 నిమిషాల అంటె బాగుంటుందెమొ)తల గీతలని(హెడ్ లైన్స్ అండీ బాబూ)చదివి వినిపించింది భారీ మ్యూజిక్ వెనకాల నుండి వినిపిస్తొంటే.ఆ సౌండ్ కి నిన్ననె తెచ్చుకున్న మా కుక్కపిల్ల ఉలిక్కిపడి నా ఒడిలొ వచ్చి కూర్చుంది. కాఫీ పొడి,పాలపొడి ధరలు విపరీతం గా పెరుగుట వల్ల రాష్త్రం లొ ముప్పవు మంది పొద్దున్నే కాఫీ చుక్కయినా తాగకుండా రొడ్డు మీదకి వచ్చెస్తున్నారు అని ఇందాకా చెప్పుకున్నాము కదా,అసలు ఇలా ఎందుకు అవుతొంది దీనికి గల కారణాలు ఎమిటి(ఈ రెండు వాక్యాలకి తెడా తెలిస్తె నాకు చెప్ప మనవి)అని వివరించటానికి మా ప్రతినిధి ఆయాసరావు రెడీ గా వున్నాడు,ఆయానని అడిగి వివరాలు తెలుసుకుందాము అంటూ సదరు ప్రతినిధి కి లైను కలిపి హలో ఆయాసరావు,అనగానె అటు నుండి యస్ కంగారమ్మా,అని రిప్లై వస్తుంది.రాష్త్రం లొ ముప్పవు మంది.....................మా ప్రేక్షకులకి వివరిస్తారా అని అంటూ వుండగానె ఆయాసరావు ఒక శాల్తీతొ ఇంటర్వ్యూ మొదలెట్టెస్తాడు. ఈరొజు మనతొ మాట్లాడటానికి గ్రేటర్ హైదరాబాదు వినియోగదారుల సంఘం కన్వీనర్ శ్రీ వినిమయరావు గారు వున్నారు,వినిమయరావుగారూ,రాష్త్రం లొ ఇలా కాఫీ,పాల ధరలు పెరగటానికి కారణాలు ఏమయ్యి వుండచ్చు అని మీరు అనుకుంటున్నారు అనగానె,ఆ మనిషి తన కండువాని సరిచెసుకుంటూ,"ఈరోజు మన రాష్త్ట్రం లొ దుష్ట పాలన నడుస్తొంది,కాఫీ,పాల ధరలు భూముల ధరల లాగ అమాంతం పెరిగిపోయాయి గత 5 సంవత్సరాలలొ.మొన్న అక్షరధాం లో,నిన్న ముంబై లొ మరి నేడు ఎక్కడ పేలుడు జరుగుతుందో అనుకుంటూ ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు.మొన్నటికి మొన్న మన నగరం నడిబొడ్డున బాబ్బులు పేలితె ప్రభుత్వం ఏమి చెస్తోంది? ఆడ కూతుర్లకి రక్షణ అన్న మాట కరువు అయిపొయింది ఈ రొజుల్లొ.బయటకి వెళ్ళిన ఆడ కూతురు ఇంటికి తిరిగి వచ్చెవరకు కంగారు పడె దుస్థితి నేటి తల్లితండ్రులది మన రాష్త్రంలొ.యాసిడ్ దాడులు,ఇతరత్రా అత్యాచారాలు పెచ్చు మీరి పొతున్నాయి" అంటూ ఆయాసం తీర్చుకొవటానికి ఆగి సదరు నాయకుడు ఇచ్చిన అవకాసన్ని యాంకరు చటుక్కున అంది పుచ్చుకుని,వినిమయరావు గారు చెప్పిన కారణాలే కాకుండా ఇంకా అనెక కారణాలవల్ల రాష్త్రం లొ ధరలు పెరిగిపొతున్నాయి అంటూ తన స్తైల్లో ఆయాసపడిపొతూ రిపోర్టింగ్ ముగిస్తాడు. ఎప్పుడూ టీవీ లొ మాట్లాదె అవకాశం రాని వినిమయరావు అదరగొట్టెసాను అనుకుంటూ జబ్బలు చరచుకుని,మరో కార్యక్రమానికి తయారు అయిపొతూ వుంటాడు.
సూపర్ రిపోర్టింగ్ అని సదరు చాన్నల్ యజమాన్యం యధావిధి గా సంబర పడుతుంటె,నా బోటి వారు మాత్రం అలా పిచ్చి చూపులు చూస్తూ వుంటారు కాన్సెప్ట్ ని అర్ధం చెసుకొవటానికి.
ఇంతలో పెద్ద శబ్దంతో మళ్ళీ న్యూసు తల గీతలు,మా కుక్క పిల్ల మళ్ళీ జంపు నా మీదకి,ఎప్పుడు అలవాటు అవుతుందొ పిచ్చి ముండకి.

Sunday, January 11, 2009

Saradaaki

మనము సాధారణంగా పిల్లలని ఎలా మన పనులతొ ఇబ్బందులు పాలు చేస్తామో చెప్పటానికె ఈ సరదా రచన.

పిల్లవాడు పుట్టిన 11 వ రోజు నుండి ఇంక ఈ అంకాలు ప్రారంభము అవుతాయి.మొదటి సీను---పిల్లాడికో,పిల్లకో నామకరణమో,వుయ్యాలలో వెయ్యడమో వుంటుంది సాధారణంగా
ఆరొజున.ఇంక ఆరొజు చూడాలి పిల్లల అవస్థ.ఎవరి తాహతు కి తగ్గట్లు వాళ్ళు మగపిల్లవాడికి అయితె రెడీ మేడ్ పంచెలొ,లాల్చీ పైజమాలో ,షేర్వానీలొ వేస్తారు.
పాపం వాటికుండే ఎలాస్టిక్ ఆ చిన్ని ప్రాణానికి ఎంత విసుగు తెప్పిస్తుందో.ఇంక ఆడ పిల్లలకయితె కుచ్చుల ఫ్రాకులొ,లెదా పట్టు పరికిణీలో వేసి తమ ముచ్చట తీర్చెసుకుంటూ ఆ పసిప్రాణానికి ముచ్హెమటలు పట్టిస్తారు.
పిల్లకయినా,పిల్లడికయినా తాతయ్య వెసె మెడలొ చైను ,అమ్మమ్మో,న్ననమ్మో పెట్టే ఉంగరమొ వుండనేవుంటాయి.
పొనీ ఇవన్నీ వేస్తె వెసారు హాయిగా నిద్ర పొనిస్తారా అంటె అదీ లేదు.ఆ పసిప్రాణాన్ని ఎత్తుకుని ఎవరికి వారె తమకు తొచిన పొలికలు చెప్తూ వుంటారు.

అచ్చు వాళ్ళ నాన్న ముక్కే నాకు తెలీదూ వాళ్ళ న్నాన్న ఎలా వుండేవాడొ అంతుంది పిల్లవాడి నాన్నకి వెలు విదిచిన మెనత్త.

డబ్బాలో గులకరాళ్ళు పొసి గిలకరిచ్చినట్లుడే ఆవిడ కంఠానికి పసిప్రాణం జడుసుకోవటం ఖాయం.సీను 2--అన్నప్రాశన.ఈది ఇంకొక పజిలు పసిప్రాణాలకి.పుస్తకాలు(ఇప్పుడు ల్యాప్ టాప్ కూడా పెడుతున్నారులెండి లేటెస్ట్ గా),డబ్బులు,తినుబండరాలు,కత్తి తదితర వస్తువులు పెట్టి అందరూ తలో దిక్కు
నుండీ 'నాన్నా','కన్నా','పండూ','ఛిట్టీ','పొట్టీ' 'టింకూ'
అని పిలిచి గనదరగొళపరుస్ఠొంటే పాపం మన కాండేటు కి ఎటు వెళ్ళాలో అర్ధం కాదు.

పిల్లడి(పిల్ల) తండ్రి కేమో పిల్లడు(పిల్ల) పెన్ను లేదా పుస్తకాలు పట్టుకుంటే బాగుండనిపిస్తుంది.అందుకే వాటిని వీలయినంత ఎట్ర్రక్టివ్ గా పట్టుకుని పసి ప్రాణాన్ని ఎట్రాక్ట్
చేస్తూవుంటాడు.తనకి మిస్సయిన ఇంజనీరింగు లేదా డాక్టరు సీటొ అర్జంటుగా పిల్లడు(పిల్ల)తెచ్చుకోవాలి కాబోలు.పిల్లడి మనసేమొ ఆట వస్తువుల మీద వుంటుంది.

ఇంకొకరేమో డబ్బుల పళ్ళాన్ని దగ్గరకి జరుపుతూ ఇటూ ఈటూ అంటూ చప్పట్లతొ పసిప్రాణాన్ని ఊదరగొట్టెస్తారు.


ఆటవస్తువులు,లెదా తిండి పదార్ధాలని ముట్టుకొవడం ఈకాలం తల్లితండ్రులు,తాతయ్యలు,మామ్మలు ఏమాత్రం సహించలేరు.


నిజంగా తింటూ కూర్చుని చదువు లొ ఎక్కడ వెనకపడిపొతాడో,లెదా ఆటల్లో మునిగి ర్యాంకు పొగొట్టుకుంటాడొ అని భయం.


ఇక అసలు ప్రహసనం పిల్లడి(పిల్ల)నొట్లొ కాస్త పరవాన్నమో పాయసం రాయడమొ అన్నమాట.

కొత్త రుచి,అందులోనూ పెద్దల హడావిడి,వెరాసి పిల్ల్లకి విసుగు వస్థుంది.అయినా సరె వచ్చిన

ప్రతీ ఒక్కరూ తు.చ.తప్పకుండా పిల్లవాడు నొరు పక్కకి తిప్పుకున్నా సరె నొట్లొ రాసి వెళ్ళల్సిందె.ఇంక మరో అంకం---పిల్లడికో పిల్లకో సంవత్సరం లోపు టాటా,బై బై చెప్పడం నెర్చుకుంటారు(నేర్పిస్తారు).ఇంక ఇంటి గడప తొక్కిన ప్రతీ వాడికీ ఈ విద్యా ప్రదర్శన వుండాల్సిందే.


ఒకోసారి పిల్లడు(పిల్ల)అప్పుదే నిద్ర లెస్తాడు,అప్పుడే ఇంటికి వచ్చిన మామయ్యొ అత్తయ్యొ వెళ్తూవుంటారు.

'నాన్నా','తల్లీ' టాటా చెప్పు,బై చెప్పు అంటారు ముద్దుగా ముందర.ఆ పసిప్రాణం ఏమో ఏమీ పట్టించుకోకుండా కళ్ళు నులుముకుంటూ వుంటుంది.


'చింటూ' బాయ్ చెప్పు అంటుంది మళ్ళీ అమ్మ గట్టిగా. ఆ మాటకి ఉలిక్కిపడి బిక్క మొహం వేయడం పిల్లడి వంతు.
టాటా చెప్పకపొతే తాట తీస్తా అన్న శాసనం వుంటుంది ఆ మాటలో అన్నమాట.

పిల్లడు కానీ పిల్ల కానీ ఎప్పుడయినా టీవీ లొ వచ్చె మ్యూజిక్ కి కాళ్ళు లెదా చెతులు కదిపారా ఇంక అంతే.

పదే పదే ఆ పాట పెట్టి కన్నా చిట్టీ డాన్స్ చెయ్యి అని ప్రాణం తీయుట ఖాయమని నేను హామీ ఇస్తున్నాను.


అప్పుడు వారు చెసారా సరే లెడంతే అదేదొ తప్పు అయినట్లుగా తల్లి లెదా తండ్రి సంజాయిషీలు ఇస్తూ వుంటారు,వాడికి మూద్ బాగాలెదనో,పిల్ల ఇప్పుడే నిద్ర లేచిందనో.

ఏదో ఈ గోల పడలేక కాస్త చెతులూ కాళ్ళొ ఆడిస్తె,ఇదేమిటి ఇంకా ఇరగదీస్టాడు అని అనడం వింటూనె వుంటాము.

ఇంక అసలుది మొదటి పుట్టినరోజు న వుంటుంది....వచ్చిన ప్రతీవాడూ పసిప్రాణం నోట్లొ

కేకు ముక్క కుక్కుతూనె వుంటారు.తినకపొతె చిట్టీ పొట్టీ అని పిలిచి మరీ కాస్త నాలుకకి అయినా రాసిపొతారు,పెట్టకపొతె ఏదొ పాపం అన్నట్లుగా.

ఇక అందరూ తూచా తప్పకుండా చెసేడి అక్షింతలు వెయ్యటం.,కాస్త కుంకుమ పుయ్యటం.

ఆ పసిప్రాణానికి ఎంత విసుగు పుడుతుండో పాపం ఆ అక్షింతలు గుచ్చుకుని.


సంవత్సరం దాటిన పిల్లలని ప్రీ స్కూలు అనబడె జళ్ళాలొ వెయ్యడం చూస్తున్నాము.

(అన్ని ప్రీ స్కూలు జైళ్ళు కావు అని మనవి).అక్కడ అమ్మలా లాలించి హాయిగా ఆడుకునె వాతావరణన్ని

కల్పించె స్కూల్లు బహు తక్కువ.3 సంవత్సరాలు దాటితె చాలు ఏ,బీ,సీ,డీ లు నెర్పించెస్తారు.

ఏ ఫర్ యాపిల్ అని పిల్లాడు చెప్పకపొతె వెనకబడినట్లు లెక్క అన్నమాట.ఈ జైళ్ళకి తొదు సని ఆదివారాలలూ స్పెషల్ చ్లాసులు ఒకటి.3 యేళ్ళ పిల్లవాడు ఎమి చెయ్యగలదు అని ఆలొచించకుండా
తీచరు చెప్పినట్లు గియ్యలెదని క్లాసు బయటకి రాగానె తొడ పాసం పెట్టడమొ,చెవి మెలి వెయ్యడమొ చెయ్యని పేరెంట్స్ ఎంత మంది చెప్పండి.ఇంక భవిష్యత్తు లొ టైము అసలు రాదు కాబొలు పిల్లవాడు అర్జెంటు గా పికాసో అయ్యిపొవాలి అన్నమాట.

ఇంక ఆటలకి తీసుకెళ్ళె తల్లితంద్రులు బహు కొద్ది మంది మాత్రమె అని మనవి.ఆ తీసుకుళ్ళే వాళ్ళు కూడా అదెదొ స్టటుస్ సింబల్ అన్నట్లు గా తీసుకెళ్తున్నారు ఈ మధ్య.లెదా పిల్ల/పిల్లడు ప్రాక్తీసు మొదలేట్టిన కొద్ది రొజులకె సానియా నో సచినో అయిపొవాలి అని అనుకుంటూ వుంటారు.

(మళ్ళీ కలుస్తా)