Saturday, January 30, 2016

ఆహా ఏమి చెప్పారండీ రాహుల్ గాంధీ గారూ

పాపం ఇంట్లో మరుగుదొడ్లు లేక బహిర్భూమికి వెళ్ళిన ఆడవాళ్ళని రేప్ చేసి చంపెస్తేనో లేదో రేప్  కి గురి కాబడ్డ ఆ మహిళలు వెలి వేయబడితేనో మనకెందుకు?? వీళ్ళేమైనా మన ఓట్లకి పనికొస్తారా, రాబోయే ఏఎన్నికలకైనా ఏమాత్రమైనా ఉపయోగబడతారా??

వీలయితే రేప్ కి గురి అయిన ప్రదేశమో, వారు ఆత్మ హత్య చేసుకుంటేనో కాసేపు వృత్తాలు గీసి , జూం చేసి, అయిన వాళ్ళ ఏడుపులతో చూపిస్తే ఛానెళ్ళకి ఓ న్యూస్ ఐటెం.రాజకీయ నాయకులకీ, ఫేస్‌బుక్ మేధావులకీ ఆ మాత్రం తీరిక కూడా ఉండదు వీటి మీద పోస్ట్లు పెట్టడానికి.

అదే రిజర్వేషన్ కోటాలో సీటొచ్చి(లేదా మెరిట్టే అనుకుందాం), ఉగ్రవాదికి మద్దత్తుగా మాట్లాడుతూ సాక్ష్యాలతో దొరికి, సస్పెన్షన్ కి గురి కావాల్సిన పనులు చేసి, ఏవో కారణాలతో ఆత్మ హత్య చేసుకుంటే పండగే పండగ.

పాపం గాంధీ గారిలా ఈ దళిత విద్యార్ధి కూడా అవమాన పడ్డాడు అని గాంధీ గారి పేరు ని ఇంటి పేరుగా చేసుకున్న ఓ మేధావి గారొచ్చి శలవిస్తే చక్కాగా మన మీడియా సిగ్గు లేకుండా ముఖ్యాంశంగా ప్రసారం చేస్తుంది.

అసలు మొదట ఈ హెడ్డింగ్ చూసి ఆస్ట్రేలియా టూర్లో ఉన్న రోహిత్ శర్మకి ఏమైనా అవమానం జరిగిందా అనుకున్నాను. రోహిత్ అంటే ఏవో రెండు మ్యాచ్చుల్లో శతకాలు బాదే ఆ రోహిత్ గుర్తొస్తాడు గానీ అవమానాలు తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకున్న  మా దళిత విద్యార్ధి గుర్తుకురాడా అనుకునే  మేధావులారా వినండి.

అవును, నాకు రోహిత్తంటే రోహిత్ శర్మే గుర్తొస్తాడు. తల్లి తండ్రులు కష్టపడి చదివిస్తుంటేనో లేదా అర్హత ఉన్నవాడిని తోసి కేవలం రిజర్వేషన్ వల్ల హెచ్ సీయూ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు తెచ్చుకుని  కాని పనులు చేసి సస్పెండయ్యింది కాక ఆత్మ హత్య చేసుకుని, అదేదో పెద్ద విషయమయినట్లు, అతన్ని ఎవరో హత్య చేసేసినట్లు మీడియా, సో కాల్డ్ మేధావులతో కొనియాడబడే రోహిత్ గుర్తు రాడు కాక రాడు.

ఒకప్పుడు చవుకున్న వాళ్ళు అంటే సంస్కారవంతులు అన్న అభిప్రాయం ఉండేది. ఫేస్‌బుక్‌లోనూ, వాట్సాప్ మెసేజీల్లోనూ ఆత్మ హత్య చేసుకున్న రోహిత్ కి సానుభూతిగా వెల్లువెత్తుతున్న మెసేజీలకి తమ వంతు సహకారం అందిస్తున్న చదువు"కొన్న" వాళ్ళని చూస్తోంటే ఛీ కుల రాజకీయలు, కుల డ్రామాలు ఎక్కువవుతున్నాయే అని చిరాకొస్తోంది.

ఎప్పుడూ కూడా కిందున్నవాడికి పై వాడి మీద ఏదో తెలీని ద్వేషం ఉంటుంది. మనం పుట్టి పెరిగిన పరిస్థితులు కానీ మరోటి కానీ కొన్ని కులాల మీద కొన్ని అభిప్రాయాలు ఏర్పరచి ఉంటాయి.చదువుకునే కొద్దీ వివేకం పెరగాలి కానీ మనలో అణిగి ఉన్న ద్వేషాన్ని బయటపెట్టడానికి అవకాశం వచ్చింది కదా అని నిస్సిగ్గుగా, నిజాలు తెలీకుండా ప్రచారం చేసేయ్యడమే??ఆత్మహత్య చేసుకున్నవాడేదో చాలా అమాయకుడయినట్లు.

అతను ఎందుకు ఆత్మ హత్య చేసుకున్నాడో మనకి తెలియదు. అగ్ర కుల అహంకారం చేసిన హత్యో లేక సమాజంలో వ్రేళ్ళూనుకున్న అసమానతలు చేసిన హత్య లాంటి మాటలు వినడానికి బాగుంటాయి కానీ నిజాలు నిర్ధారించడానికి కాదు. నాకు అతని మీద కంటే అతని తల్లి తండ్రుల మీద జాలేస్తోంది. పోయిన వాళ్ళు అదృష్టవంతులు, ఉన్న వాళ్ళకే కదా బాధంతా.

ఒక్క సూటి ప్రశ్న. అగ్రకులానికి చెందిన ఒక విద్యార్ధి, ఆత్మ హత్య చేసుకుంటే ఇంత డ్రామా నడిచేదా??

ఈ దళిత కార్డు రాజకీయాలు కొత్తేమీ కాదు కానీ అసహ్యం వేస్తోంది అంత ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో చదువుకుంటూ  వీసీ గారే ఏదో అతన్ని హత్య చేసేసినట్లు గోల చేస్తున్న విద్యార్ధులని చూస్తోంటే, దానిని సమర్ధిస్తున్న మీడియానీ, నిన్న గాంధీ గారి వర్ధంతి రోజున ఆ విద్యార్ధిని గాంధీ గారితో పోల్చిన రాహుల్ గాంధీ గారినీ చూస్తోంటే. 

4 comments:

  1. సరిగ్గా చెప్పారు.
    కోటాల్లో సీట్లిచ్చి చదువుకోండ్రా అంటే దశాబ్దాలపాటు కోర్సులు మారుస్తూ హాస్టల్లో ఉద్దర తిండి తిని కొవ్వెక్కి కొట్టుకునే విద్యార్థులు వుంటే ఏమి? పోతే ఏమి? వీళ్ళ శవాల మీద చిల్లర ఏరుకోవడానికి ఢిల్లీ నుంచి ఓ ఫేక్ గాంధి వచ్చాడు మరి.

    ReplyDelete
    Replies
    1. sir, ilanti vallu lekapote universities lo dharna lu chesedi evaru, nuisance create chesedi evaru, udhyamaalu chesedi evaru.

      Delete
  2. ఫార్సేంటంటే రోహిత్ దళితుడు కాదన్న నిజాన్ని అతని తలితండ్రులే బయట పెట్టినా ఆందోళనలు చేస్తున్న వాళ్ళూ, వాళ్ళను వెనకనుండీ, ఎదుట ఉండీ నడిపిస్తున్న వాళ్ళు, చాలా కన్వీనింట్ గా ఆ విషయం మనకు సంబందించింది కాదులే అన్నట్లుగా, దళితుల మీద అన్యాయం అంటూ ఇంకా అదే పాటా పాడుతున్నారు. జాతీయ హోదా (?) నాయకులు కూడా ----- మీద కాసులు ఏరుకునే పనిలోనే ఇంకా ఉన్నారు. నిజం చెప్పాలంటే వీళ్ళలో ఎవరికీ రోహిత్ మీద సానుభూతి గానీ అభిమానం గానీ ఉండే అవకాశమే లేదు, కేవలం గాలివాటుగా వచ్చిన అవకాశాన్ని వాడుకుని రాజకీయ అందాలాలేక్కాలన్న ఆశ, కుయుక్తి తప్ప. నాకో సందేహం కూడా ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసం, వేరే కారణాలతో ఆత్మా హత్య గానీ చేసుకుని ఉంది ఉంటె ఆ విషయం బయటికి పొక్కకుండా ఈ విధంగా చాల్ బాజ్ గానీ చేస్తున్నారా అని.

    ReplyDelete