పోయిన శని ఆది వారాలలో చూద్దామంటే టిక్కెట్లు లేవు ఏ షొ కీ కూడా. అసలు శుక్రవారమే దొరకలేదు. దొరకలేదు అంటే ముందు మూణ్ణాలుగు వరుసల్లో ఉన్నాయి కానీ అలా కక్కుర్తి గా చూసి ఆ నెప్పులు ఈ నెప్పులు తెచ్చుకోవడమెందుకని ఆగాము. ఓ సారి ధూం 2 మొదటి వరుసలో కూర్చుని చూసా లెండి, ఆ అనుభవం అన్నమాట. మొదటి వరుసలో కూర్చుని ఎవరైనా చూస్తారా అని అడక్కండి,అదంతే!! ఒకోసారి ఇలాంటి అద్రుష్టాలని,ఎప్పుడూ హరీష్ రావు నోటినీ ఆపలేమంతే.
సరేలే, ఇక చూడలేమని ఆశ వదిలేసుకున్నాను. నిన్న ఎందుకో కార్స్ 2 రిలీజ్ ఎప్పుడు అని చూస్తోంటే ఈ సినిమా షో కనపడింది,రాత్రి షో ఉంది. టిక్కెట్లూ ఉన్నాయి. అంతే, బుక్కాను వెంటనే.
హాల్లో వెనక నుండి ఐదారు వరుసలు మాత్రం నిండాయంతే, వీక్ డే అవ్వడం వల్ల అనుకుంటా.
ముగ్గురు స్నేహితులు తమ జీవితం లో సమస్యలకి ఒక హాలీడే కి వెళ్ళి అక్కడ ఎదురైన వివిధ పరిస్థితుల ద్వారా,ఉత్తేజం పొంది జీవితాన్ని కొత్తగా తీర్చిదిద్దుకుంతారు..ఇదీ కధ క్లుప్తం గా
సినిమా నాకు నచ్చింది. హాయిగా ఉంది. పెద్ద హీరో కదా అని ఈ మల్టీ స్టారర్ చిత్రం లో హ్రితిక్ కి ఎక్కువ పోర్షన్ లాంటి వేమీ జరగలేదు.
ఫర్హాన్ అక్తర్ బాగా నవ్వించాడు,బాబీ డియోల్ చాలా బాగున్నాడు. కత్రీనా అందం గురించి ప్రత్యేకం గా చెప్పేదేముంది.
అన్నింటికంటే చివర్లో వీళ్ళ ముగ్గురూ కలిసి దూరదర్శన్ మ్యూజిక్ని ఇమిటేట్ చెయ్యడం నాకు చాలా నచ్చింది. నా పక్కన కూర్చున్న 14-15 ఏళ్ళ పిల్లాడికి వాళ్ళ తల్లితండ్రులు,ఇతర పెద్ద వాళ్ళు ఎందుకు అలా నవ్వుతున్నారో అర్ధం కాలేదు. దూరదర్శనం రోజుల పిల్లాడు కాదు కదా మరి.
మొత్తానికి ఆహ్లాదకరమైన సినిమా. వీలయితే చూడండి. బాలీవుడ్ లో ఇలాంటివి వచ్చెస్తున్నాయి,మన వాళ్ళు ఎప్పుడో అని కొచ్చన్ కూడా వేసుకోకూడదు.
నాకు కూడా ..
ReplyDeleteదూర్ దర్శన్ మ్యూజిక్, అలాగే డైరీ లో ఏదో రాస్తున్నాడనుకుంటాం.. చివరిదాకా.. కానీ బొమ్మలు.. అదీ ఎందుకో చాలా నచ్చింది. అలాగే.. అభయ్ డయోల్ ఫియాన్సే అడిగిన ప్రశ్నలు, ఆ బలవంతపు నిశ్చితార్థం అన్నీ ..
ఒకదాన్ని మించి ఒకటి..
అన్నింటి కన్నా.. స్పెయిన్ కి వెళ్లాలనిపిస్తుంది ఇప్పుడు :)
క్రిష్ణ ప్రియ గారూ,
ReplyDeleteవెళ్ళొచ్చి "పారిస్" లాగా ఒక టపా రాయండి మరి :). అవును మీరు చెప్పినవన్నీ బాగున్నాయి సినిమాలో.బాగా నచ్చేసింది నాకు 3 Idiots లాగ.