ఒకప్పుడు రైళ్ళు బస్సులలో ప్రయాణం చేస్తోంటే గుట్కాలు,సిగరెట్ల బెడద ఎక్కువ గా ఉండేది. ఇప్పుడు స్మోకింగ్ కాస్త తగ్గినట్లే అనిపిస్తోంది కానీ కొత్త జాడ్యం బయలుదేరింది దాని స్థానే. సెల్ ఫోనులో పాటలు బయటకి వినపడెట్టు పెట్టడం.
ఒకసారి 2007/2008 లో అమలాపురం నుండి కాకినాడ బస్సు లో వస్తోంటే మొదటి సారి ఇది గమనించాను. పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు ఆరోజు అలా పాటలు బయటకి పెట్టినవాళ్ళు.ఏమో లే తెలీక,సెల్ ఫోను మోజులో అలా పెట్టుకున్నారేమో అనుకున్నాను.
2011 లో కూడా సేం సీన్,స్థలం,మనుష్యులు మార్పు అంతే.
సీన్ 1
పినాకిని ఎక్స్ ప్రెస్: చెన్నై నుండి విజయవాడ బయలుదేరాను. చెన్నై ఎండకి విసిగి పోయి ఉంటే దానికి తోడు రైలు ఆలశ్యం బోనస్సు. రైలెక్కాకా ఏసీ పని చెయ్యలేదు రైలు కదిలేవరకూ. రైలు కదిలి స్పీడందుకుంది. హమ్మయ్య ఇక కునుకు తీదామనుకుంటుండగా ఓ మగానుభావుడు తన ఒడి పరికరం(ల్యాప్ టాప్) లో కంపార్టుమెంటు మొత్తానికి సినిమా వినిపించడం మొదలెట్టాడు. పోనీ చదువు లేని వాడా అంటే అదీ కాదు,రైలెక్కినప్పటినుండీ చూస్తున్నా,సారు ఫోను చెవులకి సూపర్ గ్లూ తో అతికించేసుకుని Unix,Linux,Client,Delivery etc తప్ప వేరే పదాలు వాడటం లేదు. హెడ్ ఫోన్స్ వాడాలి అన్న కామన్ సెన్స్ మాత్రం శూన్యం.
ఇది చూసి నా పక్కన వరుస లో కూర్చున్న ఆయనకి మూడొచ్చేసి తన ఫోను లో పాత మధురాలు వినిపించడం మొదలెట్టాడు అందరికీ. నా వెనకాల కూర్చున్నతను నేనేమి తక్కువ అనుకుంటూ కాసేపటికి దేవిశ్రీ ప్రసాదు ని రంగం లో కి దింపాడు. అసలు రైలంటేనే రణగొణధ్వనుల మయం. అంత గోలలో అలా "సెలెక్టివ్" హియరింగ్ ఎలా ఉంటుందో అన్న ఆశ్చర్యం కూడా కలిగింది విసుగుతో పాటు.
నేనూ,నా పక్కనున్న రిటైర్డు ఫిజిక్స్ లెక్చరర్ గారూ ఏమీ చెయ్యలేక నిట్టూర్చాము. నాకు ఆ రూట్ కొత్త కావడం తో నెక్స్ట్ ఏ ఊరు,విజయవాడ ఎప్పుడొస్తుందో ఆయన చెప్తోంటే వింటూ,మధ్య మధ్యలో నా చేతి లో ఉన్న చిలకమర్తి వారి గణపతి గురించి చర్చిస్తూ,మధ్య మధ్యలో ఈ న్యూసెన్స్ గాళ్ళని తిట్టుకుంటూ విసుక్కుంటూ మొత్తానికి విజయవాడ చేరాను. విజయవాడ రావడానికి ఓ రెండు గంటల ముందు మాత్రం ఈ గోల అంతా తగ్గి కాస్త ప్రశాంతత వచ్చింది.
సీన్ 2
నవజీవన్ ఎక్స్ ప్రెస్స్:
పొద్దూన్నే ఖమ్మం లో ఎక్కాను. విజయవాడ చేరుతుండగా మెల్లిగా ఒకోక్కళ్ళే లేచి దంతావధానాలు అవీ కానిచ్చి కాపీలు తాగి టిపినీలు చెయ్యగానే భక్తి భావం ఉప్పొంగి టీ సీరీస్ వారికి అనూరాధా పౌడ్వాల్ పాడిన దేవీ స్తుతులు,పాటలు మొదలు సెల్ ఫోన్లలో. మధ్యాహ్నం అవ్వగానే సల్మాన్ ఖాన్ దమాంగ్ తో తయారయ్యాడు మా కంపార్ట్మెంట్లో.
(పొద్దూన్నే అయితే భక్తి,లంచ్ తరువాత బాలీవుడ్,సెన్స్ బాగానే ఉంది "న్యూ" సెన్స్ గాళ్ళకి)
లంచ్ తరువాత ఇక ఆ న్యూసెన్స్ గాళ్ళు బాలీవుడ్ హిట్స్ ని సెల్ ఫోను లో బిగ్గర గా ప్లే చెయ్యడమే కాకుండా karaoke కూడా మొదలెట్టేసారు. పోనీ లే ఇది నాకు ఓ రెండు వరుసల అవతల కదా జరిగేది అని సరిపెట్టుకున్నాను నిద్రా భంగం అవుతున్నా కానీ.
మా దగ్గర సైడు బెర్తు లో ఉన్న ఇంకో కుర్రాడు తనూ మొదలెట్టాడు. హాయిగా పాటలు అలా బయటకి ప్లే చెస్తూ సెల్ ఫోను ని కుండ లాంటి బొజ్జ మీద బోర్లించేసి తాళాలూ,దరువులూ మొదలెట్తాడు పాటకి అనుగుణం గా.
అసలే రైలు లేటు కా పరుగెడుతోంది(running late),నా లక్కు యధా ప్రకారం గా ఉండి ఏసీ పని చెయ్యడం మానేసి అప్పటికి ఓ గంటయ్యింది.
అన్నీ కలిపి విసుగు తన్నుకొస్తున్నా కానీ వీలైనంత మ్రుదువుగా చెప్పా ఆ అబ్బాయికి హెడ్ ఫోన్స్ పెట్టు కో అని. అంతే కయ్యి మని లేచాడు నా మీద, నీకేమి ఇబ్బంది అసలు,నా ఫోను నా ఇష్టం అంటూ.
ఏటి సేత్తాం,ఏటీ సెయ్యలేము ఇలాంటి వాళ్ళని. అప్పటి వరకూ ఇదంతా చూస్తున్న నా ఎదురు సీటు తమిళియన్ లేచి ఆ అబ్బాయి ని వాయించేసాడు, ఆ నిర్లక్ష్యం,పొగరు ఏమిటి అంత పొలైట్ గా అడిగితే అంటూ. అంతే వాడు ఈయన మీద కూడా పడి కరవడం మొదలెట్టాడు.
కాసేపు వాదించి విసిగిపోయి ఆయనా కూర్చున్నారు పాపం.
ఈ అబ్బాయీ చదువుకోని వాడేమీ కాదు. హిందీ,తమిళ్,గుజరాతీ,ఇంగ్లీషు అనర్గళం గా మాట్లాడుతున్నాడు.
చెప్పండి ఇలాంటి వాళ్ళని ఏమి చెయ్యాలి,మీకెప్పుడైనా ఎదురయ్యారా?
అంత మెల్లిగా అడుగుతారా? నా దగ్గర సిరీస్గా రాసేంత సరుకు (అనుభవాలు) ఉంది.. నేను ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు రాత్రిపూట బస్ లో వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను.. అక్కడ ఇలాంటి వాళ్ళు ప్రతి సారీ తగులుతూ ఉంటారు.. నేను కండక్టర్ దగ్గరికెళ్ళి చాలా పొలైట్ గా "నాకు నిద్రొస్తోంది.. వాళ్ళని హెడ్ ఫోన్స్ పెట్టుకోమని చెబుతారా కొంచం" అని అడుగుతూ ఉంటాను.. నైంటీ నైన్ పర్సంట్ ఫలితాలు వస్తూ ఉంటాయ్. అక్కడక్కడా ముదురు కేసులూ ఉంటాయ్ కానీ, మీరన్నట్టుగా ఏటి సేత్తాం.. టైం బాడ్ అని నిట్టూర్చడమే..
ReplyDeleteఈ బాపతు బుధ్ధిలేని జనాలు మీకేంటి ఎక్కడపడితే అక్కడ కుప్పలుతెప్పలుగా దొరుకుతుంటారు. కానీ మీ పొస్టక్కడే ఆగిపోయింది. సెల్లుఫోను వాడి ఇతరులకిబ్బంది కలిగించకూడదన్న సెన్సున్నోళ్ళేంచేస్తారో తెలుసాండీ? వాళ్ళతో వీళ్ళతో ఊరికే వాగుతూ దాని socialization skills అనుకుంటుంటారు. తేడా ఒకటేనండీ ఒకరు cell phoneలో ఇంకొకరు ఇతరులతో మిగతావారికేమీ పెద్దగా తేడావుండదు disturb అయిపోవడంలో.
ReplyDeleteఇలాంటి వాళ్ళు మీకూ దొరికారా అని అడుగుతున్నారా! మీకు దొరక్కపోయిన సందర్భం వుందా అని అడగాలి. దేశం నిండా ఇలాంటి అలగాజనాలు, ఎదవలేనండి బాబూ. ఇలాంటి ఎదవలే లేకుంటే 'జై తెలంగాణా' ఉద్యమాలు ఎలా నడుస్తాయనుకుంటున్నారు?! :))
ReplyDeleteఅసలు ఇలాంటి వాళ్ళు కనపడక పొతే విచిత్రం :)))))
ReplyDeleteమురళిగారూ,
ReplyDeleteరాత్రి పూట కూడా వీళ్ళ బెడద తప్పదన్నమాట. మీ శైలి లో రాయండి ఈ అనుభవాలన్నీ.
మినర్వా గారూ,
అవును,ఇలాంటి వారిది ఇంకొక జాతి. ఉదాహరణకి, మనము వారికి ఏ మాత్రం పరిచయం లేకపోయినా మన చేతిలో కోలా చూడగానే ఎండో సల్ఫాను తాగెస్తున్నట్లు లెక్చర్లు మొదలెడతారు :). మనము తాగే పానీయం మంచి చెడు సంగతి పక్కనపెడితే ఆ విసుగు తెప్పిస్తుంది.
SNKR గారూ,
:)). అలా అనీసారేటండి బాబూ,తగువెట్టేసుకుంటారు మీతో.
శ్రావ్య గారూ,
చూడబోతే అలాగే ఉంది.