మాకు ఇక్కడ సింగపూర్ లో టీవీ పెట్టగానే "రక్తమోడిన రహాదరులు" అనో " కీచక టీచర్" అనో మరింకోటనో గాట్ఠిగా అరుస్తూ ఢఢన్ ఢఢన్ అనే బ్యాక్ గ్రవుండ్ మ్యూజిక్ తో భయంకర ద్రుశ్యాలని చూపే ఛానెల్స్ లేవు. అసలు తెలుగు ప్రసారాలే లేవు. ఎప్పుడైనా తెలుగు చానెళ్ళని నెట్ లో చూడటమే.
దాని లోటు ఫేస్ బుక్ తీర్చేసింది ఈరోజు నాకు. ఈ మధ్య నేనూ ఫేస్ బుక్ ఖాతా తెరిచాను. కానీ దానిలో నేను రాసేది తక్కువ చూసేది ఎక్కువ అన్నమాట. అసలు నిమిష నిమిషానికీ అప్డేట్స్ ఎలా ఇస్తారెండీ బాబూ. అదో టాలెంట్ అనుకోవాలేమో. సరే ఇక విషయం లోకి ఈరోజు అప్డేట్స్ చూస్తోంటే ఓ ఫొటో కనపడింది. ఏమిటిది, తప్పు చూసానా అనుకుంటూ మళ్ళీ చూసాను. ఛా,ఇలాంటి ఫొటో అయ్యుండదులే అనుకున్నా. కానీ మెసేజ్ చూస్తే నేమో "కండోలెన్స్" వగైరా వగైరాలున్నాయి.వెంటనే దానిని క్లిక్ చేసి చూస్తే ఏముంది, ఓ చిన్న బాబు అంత్యక్రియల ఫోటో.
ఆ ఫోటో పెట్టిన వ్యక్తి మేనల్లుడు మరణించాడుట. అతని ఆత్మ శాంతి కలగాలని వ్యాఖ్య రాసి ఫోటో పెట్టాడు. ఇంకేముంది,వ్యాఖ్యలు వెల్లువెత్తాయి,అయ్యో ఎలా జరిగింది,మీకు నా సంతాపం,ఆ దేవుడు కఠినాత్ముడు లాంటి సంధర్భానుసార వ్యాఖ్యలతో.
అయినవారు మరణించడం ఎవరినైనా కలచివేసే సంఘటన. కానీ ఏమో...ఎలా రాయాలో అర్ధం కావట్లేదు. ఆ బాబు ఫొటో పెట్టాడనా ఇంత బాధ అంటే,అవును,కాదు అనే సమాధానం వస్తుంది నా నుండి.
అసలు ఏ ఫోటో లు పెడుతున్నారో కూడా తెలీని మైకం లో వ్యాఖ్యల కోసం పెడుతున్నారేమో అనిపిస్తోంది కొంతమంది పెట్టే ఫోటో లు చూస్తోంటే.
అబ్బా ఎంత బాగున్నారో నీ పిల్లలు,చో చ్వీట్,అసలు నీకు అంత వయసున్నట్టే కనపడట్లేదు,లుకింగ్ యంగ్ ఇవేగా వ్యాఖ్యలు ఏ ఫొటో చూసినా.
అసలు అంతకుమించి ఏమి వ్యాఖ్యానిస్తాం లెండి ఎదుటి వారి ఫోటో మీద :)). కొంతమంది పెట్టే ఫొటోలలో అంత "చ్వీట్" ఏమిటో నాకు అర్ధం కాదు. భావుకత్వం లేదు కాబట్టి నాకు కవితలు అర్ధం కానట్లు ఇదీ అంతే నేమో లే అని సరిపెట్టేసుకుంటాను.
ఏ మనిషికైనా పొగడ్త టానిక్ లాంటిది. కానీ ఫేస్ బుక్ లో సగం అతిశయోక్తులే ఉంటాయి.
కొంత మంది విషయాన్ని చెప్పీ చెప్పకుండా అన్నట్లు ఆ విషయానికి సంబంధించి ఓ ఫోటో పెడతారు. అది వాళ్ళ పిల్లలు చేతికి కట్టు తో ఉన్న ఫోటో కావచ్చు,మేము ఫలానా ఊరెళ్ళాము అని అర్ధం వచ్చేటట్లు ఆ ఊరి పేరు బ్యాక్ గ్రవుండ్ లో ఉన్న ఫోటో కావచ్చు..ఎవరి క్రియేటివిటీకి తగ్గట్లు వాళ్ళు.
ఇంకొంతమంది ని చూస్తే అనుమానం వస్తుంది వీళ్ళు కానీ ఏదైనా సొంతం గా అప్లికేషన్ తయారు చేసుకున్నారా ఏమిటి, ఫలానా వాళ్ళు ఏమి అప్డేట్ చేసినా,ఎక్కడ వ్యాఖ్య పెట్టినా తమ తరపున ఓ "లైకు" కొట్టేటట్లు అని.
కొంత మంది చేసే అతి తట్టుకోలేము అసలు. వాళ్ళకి వాళ్ళు బ్యూటీ క్వీన్ గానో,ఎవర్ గ్రీన్ హీరో గానో ఊహించేసుకుంటూ పెట్టే ఫోటోలని చూస్తే వీళ్ళకి "గ్రేస్ ఫుల్ ఏజింగ్" అంటే తెలీదేమో అనిపిస్తుంది.
ఇన్ని చెప్పినప్పుడు మరి దీనికి దూరం గా ఉందచ్చు గా అంటారేమో,హ్హ్మ్..మానవమాత్రులకి ఎదుటివారి విషయాలమీద తగని ఆసక్తి అని తెలియదా మిత్రమా..:))
సరే ఇక ఈ గోల వదిలేస్తే,భారారే గారు కొత్త హారం ఉత్సాహం లో కవితలు రాసేసరికి నాకూ ఉత్సాహం వచ్చింది. నాకు స్వంతం గా హారం లేకపోతేనేమి బంగారం లాంటి నా బ్లాగుంది గా అనుకుని మొదలెట్టాను. దేనిమీదో ఎందుకు,ఫేస్బుక్ మీదే రాయి అని నా అంతరాత్మ చెప్పింది. రెడీ ఆ?
నువ్వు రెస్టారెంటుకెళ్ళావు
నేను చూసాను
మంచూరియా ఆర్డరిచ్చావు
వాసన పీల్చాను
కానీ..కానీ... మిత్రమా
క్షమించలేని ద్రోహం చేసావు
.
.
.
.
.
మంచూరియా ముందు పెట్టుకుని ఫోటో మరిచావు
ఫేస్ బుక్ లో అప్డేట్ ఆలశ్యం చేసావు
ఆ పిల్లాడి క్రిమేషన్ ఫోటోలు పెట్టిన వారికి నా జోహార్లు !
ReplyDeleteమొత్తం మీద మాత్రం పబ్లిక్, ప్రైవేటు, protected ఈ access specifiers కి పెద్ద తేడా లేదు ఇప్పుడు :)))))
ఫేస్ బుక్కూ, బజ్జూ లలో చిరాకేసికొస్తోంది. అప్పుడప్పుడు, మా అమ్మాయి,అల్లుడూ ఏవైనా ఫొటోలు పెట్టినప్పుడు, ఓ కామెంట్ పెట్టడం వరకే సీమిత్ ! ఇప్పుడు అదేదో గూగుల్ ప్లస్ వచ్చింది. ప్రతీవాళ్ళూ నన్ను వాళ్ళ సర్కిళ్ళల్లో పెట్టేటప్పటికి, నేనూ మొహమ్మాటానికి వాళ్ళని క్లాసిఫై చేస్తూంటాను!
ReplyDelete:) నిజమే!
ReplyDeleteమొన్నీ మధ్య చూశాను... ఎవరో రాసారు.. "మా గురువుగారు నిన్న అకస్మాత్తు గా మరణించారు. వారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను" అని.
దానికి లైక్ కొట్టిన వారిని చూసి ఏమనాలో అర్థం కాలేదు.
ఇంతకీ మంచూరియా తిన్నట్లా లేదా ?
ReplyDelete:))
ReplyDeleteఇప్పుడు మీ కవితని చో చ్వీట్ అనాలా?!! :))
ReplyDeleteబాగుందండీ..కొత్తొక వింత.. ఫేస్ బుక్ లో చేరమని ఆమధ్య రోజూ ఇన్విటేషన్లు వచ్చేవి.. ఈ మధ్యన ఆ ఉధృతి తగ్గితే ఫేస్ బుక్ కి ఏమన్నా అయిందేమో అని సందేహం వచ్చింది.. బానే ఉందన్న మాట ఐతే.. ఫేస్ బుక్ మేనియా గురించి ఆమధ్యన నాకొచ్చిన ఓ ఎస్సెమ్మెస్: ఒకడు "నేనీ రాత్రి చొక్కా లేకుండా నిద్రపోబోతున్నాను" అని రాసి, గంట తర్వాత చూస్తె పది దోమల నుంచి 'లైక్' ఉంది. రెండోదేమో, ఒకడికి ఆయువు మూడి తీసుకెళ్లడానికి యమ దూతలు వస్తే ఫేస్ బుక్ లో స్టేటస్ మెసేజ్ 'డేడ్' అని అప్డేట్ చేసి అప్పుడు వాళ్ళతో బయలుదేరతాడు... ఇవన్నీ గుర్తు చేశారు మీరు..
హ హ నా అదృష్టం ఫేస్బుక్ ఆర్కూట్ లాంటివి నాకెందుకో నచ్చవు ...కాని కవిత భలేఉంది ...
ReplyDeleteభలే చెప్పారు. మురళి గారు రాసింది చదివి బాగా నవ్వు వచ్చింది.
ReplyDeleteఏ మనిషికైనా పొగడ్త టానిక్ లాంటిది. కానీ ఫేస్ బుక్ లో సగం అతిశయోక్తులే ఉంటాయి.
ReplyDelete........
ante sagam vastavalu untayaa? namma mantaaraa?
ఫేస్ బుక్కు, ఆర్కుట్లలో నేను స్పందించనని మావాళ్లు నన్ను అదేదో వింతజీవినన్నట్లు చూస్తూంటారు. మీ టపా చూసిన తరువాత ఆ "వింత" మంచిదే అనుకుంటున్నాను నేను.
ReplyDeleteమీ కవిత మాత్రం సూపర్.
హహ్హహ్హా.. రిషి గారూ, టపా భలే ఉంది. మీ కవిత సూపరుంది:))
ReplyDeleteమరేమో నాకు ఫేస్‌బుక్ ఆర్కుట్ ఏవీ లేవు అకౌంట్స్.. రవి కిరణ్ గారన్నట్లు, నేను కూడా చాలా మందికి ఒక వింతజీవి లాగానే కనిపిస్తాను మరి;) సో నాక్కూడా ఈ వింత మంచిదే అనమాట:)
శ్రావ్య గారూ,
ReplyDelete:))
ఫణిబాబు గారూ,
నేను ఇప్పుడిప్పుడే ఫేస్ బుక్ లో కాస్త పట్టు సంపాదిస్తున్నాను.బజ్జు సంగతి చూడలేదింకా,చూడనేమో కూడా :))
క్రిష్ణ ప్రియ గారూ,
ఇది మాత్రం టూమచ్ అసలు.ఏదో ఒకదానికి ఓ లైకు కొట్టాలి కాబట్టి కొడతారేమో ఇలాంటివి :))
సూర్యలక్ష్మి గారూ,
ఆరోజు రాత్రి అనుకోకుండా బయటకి వెళ్ళి అక్కడ తిన్నాను :)
మాలా కుమార్ గారూ,
ధన్యవాదాలు :))
మురళీ గారూ,
మరి అనరేమిటీ?మీ సందేహం బాగుంది, జోకులు కూడా.
నేస్తం గారూ,
ధన్యవాదాలు. కుశలమేనా, ఈ మధ్య అలికిడి లేదు,బహూశా బజ్జులలో బిజీ ఏమో?
తొలకరి గారూ,
స్వాగతం. ధన్యవాదాలండీ.
బుద్ధా మురళి గారూ,
మీరడిగిన ప్రశ్న కి ఇలా పబ్లిక్ గా జవాబు చెప్పకూడదు మరి :)).
రవికిరణ్ గారూ,
హ్హ్మ్మ్..ఏమీ లేదండీ బాబూ ఈ ముఖ పుస్తకం లో.ఫోటో లు చూడటానికి తప్ప నేను వాడట్లేదు.
మనసు పలికే గారూ,
ధన్యవాదాలు.ఓ మారు లుక్కేయ్యండి అటు కూడా,మీరు వింతో అది వాడేవాళ్లు వింతో తేల్చి పారెయ్యొచ్చు. ఏమంటారు :) ?
మొన్న మాజా లా సింగ్ పురా అన్నారు
ReplyDeleteఈరోజు ఓ సారి వందే మాతరం అనేయండి :)
ఎంత మీ ప్రధాని నవ్వుల రామయ్య ఐనా,
మా ప్రధాని ఏడుపుగొట్టు మొహం ఐనా..
మీరు జైహింద్ అనక పోతే... ఫ్లైట్లలో బంగాళాఖాతం మీద తిరగనీయం... తరుముడే తరుముడు. :)) :P
>>ఎంత మీ ప్రధాని నవ్వుల రామయ్య ఐనా
ReplyDeleteమా ప్రధాని ఏడుపుగొట్టు మొహం ఐనా..
మీరు మహా చతురులు SNKR గారూ,మీరు బ్లాగు రాస్తే చూడాలని ఉంది. కొంపదీసి ఆరెడీ(మాజులా స్లాంగ్ ఇది ఆల్రెడీ కి) వేరే పేరుతో రాసెస్తున్నారా ఏమిటీ లేదా బ్లాగ్వద్గీత(శంకర్ గారు దాని రచయిత) మీదేనా?
>>ఫ్లైట్లలో బంగాళాఖాతం మీద తిరగనీయం
మీకు శ్రమ ఎందుకు అని మేము ఎర్రకోటలో జండా వందనానికి అటెండయ్యి జనగణమణ పాడేసి జైహింద్ అనేసాము సారు ఎప్పుడో.
(ఫ్లైట్లలో తిరగనీయకపోతే ఏమి చేస్తాం,ప్రత్యామ్న్యాయం గా పడవలేసుకుని బయలుదేరతాము :)).)
మీరు ఫేస్ బుక్ లో లేరా? అని జనం విస్తుపోతుండేవాళ్ళు, మీరు గాలి పీల్చరా? అన్నట్టు! సరే ఈ పీడా భరించలేక నేనూ మార్గదర్శిలో చేరకుండానే ఫేస్ బుక్ లో చేరాను. కానీ ఏం చేయాలో ఏం రాయాలో తెలీదు. అవిడియాలు రావు. అసలు రోజూ చూడను.
ReplyDeleteమొత్తానికి మీ కవిత బాగుంది.
ఆ మధ్య సుధ గారు కూడా ఇలాంటి సెటైరే ఒకటి రాశారు ఫేస్ బుక్ మీద!
నాకు అనిపించినంత వరకు, టీన్స్ లో ఉన్నవాళ్ళకి ఫేస్ బుక్ నచ్చుతుంది అనుకుంటా.
ReplyDeleteసాధారణంగా అ వయసు లో, ఉన్నవాళ్ళకే, ఇరవయి నాలుగు గంటలు, స్నేహితులతో టచ్ లో ఉండాలనుకుంటారు.
ప్రతి క్షణం తాము ఏం చేస్తున్నమో స్నేహిత లోకాని కి తెలియాలి అనుకుంటారేమో. తద్వారా ఎప్పుడు లైమ్ లైట్ లో ఉండాలనుకోవడం ..ఒకళ్ళనొకళ్ళూ పొగడుకోవడం. అదో ఐడెంటిటీ క్రైసిస్..... అదో సరదా ఉన్నట్టుంది. చాలవన్నట్టుగా , లైకులొకటి!!!! ఇదంతా ఇరవయిల సామ్రాజ్యం.
బ్లాగులు బజ్జులు, ఫేస్ బుక్ కి ఏమాత్రం తీసిపోలేదు. తమ అభిప్రాయాలు రాసుకొని భద్ర పరచుకొనే స్టేజ్ లు బ్లాగు లో ఏనాడో దాటిపోయాయి. :). ఇప్పుడంతా, రాలే కామెంట్స్ ని బట్టి సబ్జెక్ట్స్ ఎంచుకొనే కాలం. ఇదో రకమయిన ఐడెంటిటీ క్రైసిస్.
ఇక్కడంతా ముప్ఫయి, నలభయి ల సామ్రాజ్యం.
సుజాత గారూ,
ReplyDeleteమార్గదర్శి,గాలి పీల్చడం...:)))
సుధ గారంటే ఇల్లాలి ముచ్చట్ల సుధ గారే నా? ఆవిడ బ్లాగు లో దొరకలేదే నాకు అలాంటి పోస్టేమీ..కాస్త లింకివ్వండి.
అనానిమస్ గారూ,
ReplyDeleteమీరు టీన్స్ గురించి చెప్పిన మాట వాస్తవమే కానీ ఇరవైలు,ముఫ్హైల్లోని చాలా మందికి ఆ ఐడెంటిటీ క్రైసిస్ ఎక్కువవ్వబట్టే ఫేస్ బుక్ అంత హిట్టయ్యిందేమో కూడా :)). నేను స్వయం గా చూసాను ఇది.
ఇకా బ్లాగులలో సంగతి,
>>కామెంట్లని బట్టి
..ఓ రెండు మూడు సార్లు అనిపించిందేమో ఏమిటీ అందరూ ఒకే టాపిక్ మీద రాస్తున్నారు అని, కానీ ఎవరి శైలి వారిది కదా, బ్లాగుల్లో :)).
బ్లాగర్లు ఎవరూ నాకు పర్సనల్ గా తెలీదు సో, బజ్జుల గురించి ఏమీ చెప్పలేను :).అసలు బజ్జూ తెలీదు,కాబట్టి గొడవే లేదు
మీ అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదాలు
super ga cheepparu
ReplyDeleteJagadeeh గారూ
ReplyDeleteధన్యవాదాలండీ