ఈ మధ్య ఓ పదిరోజులు కాకినాడ వెళ్ళాను నాన్నగారిని చూడటానికి. ఓ ఆరు నెలల క్రితం బాగా అనారోగ్యం పాలైన ఆయన ఇప్పుడు కాస్త కులాసా. ఇక మేమందరమూ వెళ్తే ఎక్కడ ఆగుతారు ఆయన? హడావిడిగా తిరిగేసి అక్కడికీ ఇక్కడికీ అంటూ దగ్గర దగ్గర ఊర్ల ట్రిప్పులు పెట్టారు.
అందులో భాగం గా అయినవిల్లి వినాయకుడి గుడికి వెళ్ళాము. దర్శనం అయ్యాకా దూరపు బంధువలావిడ ని చూడటానికి అమలాపురం వచ్చాము.అప్పటికి మధ్యాహ్నం అయ్యింది.
కాస్త మంచి భోజన హోటల్ ఎక్కద ఉందో అని కనుక్కుంటే ఆ ఏదరకెళ్ళి రైటు కి తిరగండి,మాంచి డీలక్సు హోట్లు ఉన్నాదండీ అని చెప్పారు. డీలక్స్ లు అవీ కాదు కానీ అని,కాస్త ముందుకి కదలగానే సుబ్బారావు హోటల్ అన్న బోర్డు కనపడింది. కాకినాడ లో సుబ్బాయ్య లాగ అమలాపురం లో సుబ్బారావు మంచి భోజనం పెడతాడేమో అనుకుని వెళ్ళాము.
లోపలకి వెళ్ళగానే ఎక్కువ మంది టిపినీలు తింటూ కనిపించారు. ఏమో లే మధ్యాహ్న భోజనానికి బదులు డిఫరెంట్ గా ఇవి తింటున్నారేమో అనుకుని భోజనాలు ఆర్డరిస్తే ఏముంది కబురు చల్లగా చెప్పాడు సర్వారాయుడు(సర్వరు),టిఫిన్లు తప్ప భోజనం లేదండెఅంటూ..
నీరసం వచ్చేసింది,అయినా కానీ పచ్చని అరిటాకులలో పక్క వాళ్ళ ప్లేట్లలో కనపడుతున్న దోశ,రెండు మూడు చట్నీలు నన్ను అక్కడ నుండి కదలనీయలేదు.
నాన్నగారికి నాకూ ఉల్లి దోశ చెప్పాము. మిగిలిన వాళ్ళు ఇడ్లీ తో సరిపెట్టేసుకున్నారు. ఇలాంటి హోటళ్ళలో భోజనం అదుర్స్ అనుకుంటూ మా దోశల కోసం ఆశ గా ఎదురు చూసాను. తిన్న ప్లేట్లు తీయడానికి చేతిలో ఓ బకెట్టు,క్లీన్ చెయ్యడానికి ఓ పాత బట్ట తీసుకొచ్చిన క్లీనర్ ని,సర్వారాయుడు చేతిలో నాలుగు వేళ్ళతో టీ గ్లాసులు పట్టుకు రావడం చూస్తే చిన్నతనపు రోజులు గుర్తొచ్చాయి.
మొత్తానికి మా దోశలు వచ్చాయి. ఊహూ,అనుకున్నంత రుచి గా లేవసలు. అయినా ఇంకోటి ఆర్డర్ చేసాను ఆకలి దంచెస్తుంటే.
ఇంటికి రావడం మొదలు,పొట్టలో ఏదో తేడా అనిపించింది.నాన్నగారికేమో అర్ధరాత్రి నుండీ మొదలు.
నేను ఎలాగో మేనేజ్ చేసేసాను పాపం నాన్నగారికి ప్రయాణపు అలసట కూడా కలిపి ఇంకా నీరసించిపోయారు.
అసలే అనారోగ్యం నుండి అప్పుడే కోలుకుంటున్నారేమో కాస్త భయం వేసింది. సరే,మొదట ఒక ఫిజీషియన్ దగ్గరకి తీసుకెళ్దామని దగ్గర్లో ఎవరున్నారని వాకాబు చేస్తే అందరూ సాయంత్రమే ఉంటారుట.
ఇంతలో అమ్మకి గుర్తొచ్చింది,ఫలానా వీధిలో ఒకాయన ఉన్నారు ఆయన ఉంటారిప్పుడు అని. ఇంతకీ ఆయనేవరో కాదు,తెలుగు వారికి బాగా చిరపరిచితమైన వ్యక్తి సోదరుడే.
ఆ,ఏముంది,ఇలాంటి వాళ్ళందరూ బాగా హడావిడిగా ఉంటారు అనుకుంటూ వెళ్ళాను నాన్నగారిని తీసుకుని. అస్సలు హంగూ ఆర్భాటం ఏమీ లేదు. పేషంట్లు కూడా పెద్ద గా లేరు. ఓ పది నిమిషాలు వెయిట్ చేసామేమో అంతే.
స్టమక్ అప్సెట్ అండీ,నిన్న బయట తిన్నాము అని చెప్పాను. Let Nature Take Its Course ,శరీరం అక్కరలేని వాటిని బయటకి తోసేస్తుంది,దాని పని అది చెయ్యనివ్వకుండా మనకేమో అర్జెంటు గా తగ్గిపోవాలి,వెంటనే నానా చెత్తా తినెయ్యాలి అన్న ఆరాటం తగ్గించుకుంతే సగం రోగాలు రావు,అసలు మందులతో పనిలేదు అన్నాడాయన.
షాక్ నేను ఆయన మాట తీరుకి.
కానీండి,పెద్దాయన బాగా నీరసం గా ఉన్నారు కాబట్టి ఈ టాబ్లెట్టు రాస్తున్నాను అంటూ ఓ రెండు మాత్రలు రాసారు అంతే. జ్వరం పెద్దగా లేదు,అయినా అలసట వల్ల వచ్చిందని మీరే చెప్తున్నారు గా,రెస్టు తీసుకోండి ఏమీ మందులు అక్కర్లేదు అన్నారు.
ఆ తరువాత ఆయన నాన్నగారికి కలిగిన అనారోగ్యం ప్రస్తుతం వాడుతున్న మందుల వివరాలు అవీ కనుక్కున్నారు. ఆయన మాట్లాడుతోంటే ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడితో మాట్లాడుతున్నట్లే ఉంది.
ఆ పక్కనే కూర్చున్న ఆయన స్నేహితుడి ఫోను మోగగానే కయ్యి మన్నాడీయన,ఓ పది నిమిషాలు ఉండలేవూ ఆ ఫోను లేకుండా అంటూ.
తనకి కలిగిన అనారోగ్యం గురించి నాన్నగారికి ఎంత బెంగగా ఉండేదో. ఈయనతో మాట్లాడిన తరువాత నాన్నగారు కాస్త రిలీఫ్ ఫీల్ అవ్వడం గమనించాను.
అసలు ఆయన తీరు ప్రస్తుత డాక్టర్ల తీరుతో పోలిస్తే ఎంత ఆశ్చర్యం వేసిందో.చిన్న ఉదాహరణ.మేమున్నప్పుడు ఒకావిడ తన పిల్లాడికి దగ్గు ఇంకా తగ్గలేదు అంటూ తీసుకొచ్చింది.
ఏంటమ్మా,మంత్రం వేసినట్లు తగ్గిపోవాలంటే ఎలాగ,నేను చెప్పిన మార్పులు చేసావా వాడి తిండిలో?లేదు కదా,కాస్త దగ్గు తగ్గేవరకైనా చిరుతిళ్ళు మానిపించు వాడితో అని మందలించారాయన. ఇదిగో ఈ మందు తీసుకెళ్ళు అంటూ తన దగ్గరున్న సాంపిల్ తీసి ఇచ్చారు బయట కొనే పని లేకుండా.
అసలు ఆయన హాస్పిటల్ కి అనుబంధం గా మెడికల్ షాపు కూదా లేదంటే ఊహించుకోండి ఆయన ప్రాక్టీసు ఎంత తక్కువో. ఫీజు కూడా తక్కువే.
గరీబోళ్ళము సారూ,మాకు పట్టాలివ్వాలా,ఇళ్ళివ్వాల అని అరిచి గీ పెట్టే వారెవ్వారూ కూడా ఈయన దగ్గరకి రారుట మంచి డాక్టరు కాదని.
మిగతా చాలా మంది లాగ ఆ పరీక్షలు ఈ పరీక్షలు అంటూ హడావిడి చెయ్యకుండా,ఖరీదైన మందులు రాయకుండా కాస్త అవి తినడం తగ్గించు ఇవి మానేయి అని చెప్పి మందులు కూడా ఉచితం గా ఇస్తే ఈయన "మంచి" డాక్టర్ ఎలా అవుతాడు?
మనము మన చేతులతో అనారోగ్యాలని ఎలా కొని తెచ్చుకుంటున్నామో ఆయన వివరించిన తీరు అమోఘం.
తమ అనుబంధ ల్యాబ్ లో పరీక్షలు చేసి తమ పక్కనున్న మెడికల్ షాపులో మాత్రమే దొరికే బలానికి ఓ పెద్ద స్ట్రిప్పు క్యాప్సూల్సు,రెండు మూడు టానిక్కులు ఇస్తే తప్ప మంచి డాక్టరు కాదన్నమాట.
nijamga anthe sir.....
ReplyDeleteno doubt.../....
telugu lo oka sameta undi...
manchi tanam chetagani tanam ga kanabadutundata.... idi anthe....
మీరు చెప్పేది, యండమూరి కమలేంధ్రనాధ్ గురించే కదండీ..? ఆయన హాస్పిటల్ అలాగే ఉంటుంది.. ఆయన కాకపోతే మీరు చెప్పేది ఎవరి గురించో తెలుసుకోవాలనుంది..
ReplyDeleteబావుంది....ఈ మధ్యనే నేనూ ఇలాంటి డాక్టరు ఒకాయన్ని చూసి భలే ముచ్చటపడ్డాను.
ReplyDeleteమా మాజీ ఎమ్మెల్యే వీరపనేని యలమందరావుగారు కూడా అంతే . జ్వరమని వెళితే అయిదారు రూపాయల టాబ్లెట్లిస్తాడు. అనవసరమైన టెస్టులు మందులు చెప్పడు. ఆపరేషన్ చేశాక బయటకు వచ్చి శనక్కాయలబండివాడిదగ్గరనిలబడి శనక్కాయలు కొట్టుకుతింటూ జనంతో మాట్ళాడుతూ కలిసిపోతాడు. అందుకే ప్రజలు అతన్ని ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిపించుకున్నారు. మన తలతిక్కరోగులు మాత్రం ఆయన్ను పిచ్చిడాక్టర్ అంటారు.
ReplyDeleteఈదరిద్రపు రాజకీయాల కంటే ఆయన వైద్యసేవలు జనానికికందించటమే మేలు.
You should mention the name of the Doctor. It is one way of acknowledging good deeds.(not publicizing). A good post. Thank you.
ReplyDeleteఇలాంటి--అలాంటి డాక్టర్ల గురించి రాయాలని కొన్నాళ్ల క్రితం అరవై-డెబ్భయ్ మంది వైజ్ నాథ్ ల గురించి సమాచారం సేకరించి ఉంచా కానీ ప్చ్ కుదర్లేదు.ఎప్పుడు రాస్తానో తెలీదు.
ReplyDeleteమా తాడిపత్రిలో డా.శ్రీరాములుగారు కూడా ఇలాంటివారే.
ReplyDeleteరాఘవ్ గారూ,
ReplyDeleteమంచి మాట చెప్పారు.
వామన గీత గారూ,
:))
సౌమ్య గారూ,
ఇలాంటివాళ్ళు గంజాయి వనం లో తులసిమొక్కల లాంటి వాళ్ళు.
దుర్గేశ్వర గారూ,
అలాంటి వాళ్ళు కుళ్ళు రాజకీయాలలో ఇమడలేరండీ. ఏదో కధలలో చదవటమే తప్ప అలాంటి ప్రజాప్రతినిధి ఉన్న మీరెంత అద్రుష్టవంతులో.
వేణు గారూ,
అవుననుకోండి, ఎందుకో సంశయించి పేరు రాయలేదు. ధన్యవాదాలు. :))
రాజేద్ర కుమార్ గారూ,
రాయండి,పత్రికలలో వస్తే బాగుంటుంది కదా. వేణు గారు చెప్పినట్లు It is one way of acknowledging good deeds.(not publicizing).
విజయమోహన్ గారూ,
ఆయన ప్రాక్టీసూ ఇంతేనా,లేక కాస్త ఆదరిస్తున్నారా తాడిపత్రి లో?