పదోతరగతి అయిపోగానే ఇంటర్ క్లాసులు,ఇంకా ఫలితాలు కూడా రాకముందే. కొరడా ఝుళిపిస్తాము,కఠిన చర్యలు తీసుకుంటాము అని మాటలే కానీ ప్రభుత్వం ఏమీ చెయ్యదా అసలు ఈ విషయం లో?ప్రభుత్వాన్ని అని ఏమి లాభం లెండి మనమే పిల్లలని పోటీలు పడి మరీ క్లాసుల్లోకి తోసేస్తుంటేను.
ఎలాగూ ఇప్పటి పిల్లలకి రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష తప్పట్లేదు ఇంటర్ మొదలవ్వగానే. ఇంటరు మొదలవడానికి ఓ రెండు నెలలు సమయం ఉన్నా కానీ ఆ కాస్త కూడా ఆగలేక "టాలెంట్" టెస్ట్ లు రాయించేసి మరీ పిల్లలని కాలేజీలకి పంపిచెస్తున్నాము. పిల్లలకి బైపీసీ,ఎంపీసీ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు మన రాష్ట్రం లో. కామర్సో,ఆర్ట్సో తీసుకుంటే తల్లితండ్రుల "పరువు" పోదూ?
అక్షర ఙానం లేని తల్లితండ్రులే నయమేమో పిల్లాడికి నచ్చినది తీసుకుంటానంటే ఒప్పుకుంటున్నారు.ఉన్నత చదువులు చదివిన మనము మాత్రం పిల్లలకి ఏది "మంచిదో" మన సర్కిల్లో ఉండే వాళ్లందరూ ఏమి చేస్తున్నారో చూసి దానిలోకి తోసేస్తున్నామంతే పిల్లల నోర్లు నొక్కేసి.మరి మరునాడు ఆఫీసుకెళ్ళి చెప్పుకోద్దూ మా పిల్ల/పిల్లాడిని ఫలానా కాలేజీలో సూపర్ ఫాస్ట్ ట్రాక్ లో ఇంటర్మీడియట్ తో పాటు ఆ తరువాత ఉండే సవా లక్ష ప్రవేశ పరీక్షలకి కోచింగు ఇచ్చే కళాశాలలో వీలయితే ఏసీ హాస్టలు ఉన్న కాలేజీలో వేసామని.
ఇక ఆ తరువాత నెల నెలా వీలయితే వారం వారం వెళ్ళి ఐదొందలో వెయ్యో పాకెట్ మనీ ఇచ్చి,ఏ సూపర్ మార్కెట్ నించో ఓ రెండు మూడు వేలు పెట్టి చిరుతిళ్ళు కొనిచ్చి,కాస్త విశాల హ్రుదయులయితే పిల్ల/పిల్లాడి రూం మేట్స్ తల్లి తండ్రులు దూరం గా ఉన్నారని వాళ్లకి కూడా కలిపి మరి కాసిని ఫలహారాలు,పచ్చళ్ళు ఇచ్చేసి వస్తున్నాము. చివరగా,వచ్చేసేటప్పుడు మాత్రం నానా,అమ్మలూ బాగా చదువుకో అనో మాట చెప్పేసి వచ్చి రోటీన్ లో పడిపోతాము.
ఏమిటో పండగలొస్తే కూడా ఇంటికి ఓ నాలుగు రోజులు పంపరు అని కాలేజీ వాళ్ళని మాత్రం అప్పుడప్పుడు విసుక్కుంటాము.ముందర తెలీదూ మనకి రెసిడెన్షియల్ అంటే ఎలా ఉంటుందో?
ఇంటర్ ఫస్ట్ ఇయర్ అవుతుంది.పిల్లాడు/పిల్లకి గ్రూప్స్ లో మార్కులు తక్కువొచ్చాయా వాడు చచ్చాడన్నమాటే.తోటి స్నేహితుల ముందు అవమానం తో పాటు మన "సత్కారం" బోనస్ గాయపడిన ఆ హ్రుదయానికి,నా"పరువు" తీసేసావు,నేను రేపు ఎలా తలెత్తు కోవాలి అంటూ.
ఇంప్రూవ్మెంట్ రాయాలి,మార్కులు తెచ్చుకోవాలి అన్న టెన్షన్ తో రెండో సంవత్సరం మీద యుద్ధం మొదలెడతారు పిల్లలు. హమ్మయ్య రెండో సంవత్సరం అయిపోయింది అనుకునే లోపే రెండు సంవత్సరాలా గ్రూప్స్ కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న "ప్రవేశ" పరీక్షలు దెయ్యం లా వెంటాడుతుంటాయి.
పదో తరగతి వరకు పిల్లలు ఏమి చదువుతున్నారో పట్టించుకోని తల్లి తండ్రులు కూడా తమ పిల్లలకి ఐఐటీ లో సీటు వచ్చెయ్యాలి అనుకుంటారు.అసలు బేస్ అప్పుడు స్ట్రాంగా పడితేనే కదా ఎనలైటికల్ గా ఉండే ప్రశ్నలకి సమాధానం రాయగలిగేది ఇంటర్ తరువాత ఉండే ఎంట్రన్సులలో.
అదంతా అనవసరం మనకి. ఇన్ని వేలు పోసి "మంచి" కాలేజీ లో వేసాము,అన్ని ప్రవేశ పరీక్షలకీ కోచింగు(?) ఇచ్చారు వాళ్ళు. అధమం ఓ రెండు మూడింటి లోనయినా ఉతీర్ణత రాకపోతే మన పరువుపోదూ? అర్ధం చేసుకోరు కదా ఈ పిల్లలు అసలు మనల్ని,మన "పరువు" టెన్షన్ ని.
97-98 శాతం మార్కులు ఉన్న వాళ్ళందరూ ఏమో "గిఫ్టెడ్" పిల్లలు,వాళ్ళ తల్లితండ్రులేమో "లక్కీ" మనకి ఆ ప్రాప్తం లేదు లే అని నిట్టూర్చెస్తాము,మన పిల్లలు చదవరు ఎన్ని డబ్బులు తగలేసినా కానీ అని మన పిల్లల మీదకి నెపం తోసేస్తాము.
పోనీ డిగ్రీ లో అయినా కామర్సో మేనజిమెంటో చదువుతామంటే మరలా మనకి ప్రెస్టీజి ఇష్యూ.డొనేషన్ కట్టయినా ఇంజనీరింగు/డాక్టరీ చదవాలి లేదా డిగ్రీ అయితే చెప్పుకోవడానికి "వీలు" గా బయో కెమిస్ట్రీ/మైక్రో బయాలజీయో ,కంప్యూటర్సో చదవాలి.
చదువులయ్యాకా మన స్నేహితుల పిల్లలందరూ ఆన్సైటు కి వెళ్తే మన వాళ్ళూ వెళ్ళాలి. హమ్మయ్య ఇప్పటికి కాస్త రిలీఫ్ మన పిల్లలు"ప్రయోజకులు" అయ్యారు అని.
hahahah... superb..great narration....hats off to you...
ReplyDeleteచిరుతిళ్ళూ, పచ్చళ్ళూ ఇవన్నీ మొదటి సంవత్సరంలో తప్పవు. మంచి మార్కులు తెచ్చుకుంటే రెండో సంవత్సరంలో ఇవి కొనసాగుతాయి, లేని పక్షంలో "ఫీజులే దండుగ..మళ్ళీ ఇవి కూడానా" అని విసుక్కోళ్ళు... "అమెరికా వెళ్ళే చదువు" భారం టెన్త్ అవడంతోనే మొదలవుతుంది పిల్లలకి..
ReplyDeleteహా హా హా , నిజమే!
ReplyDelete'ఐనా పడవ ప్రయాణం... ' :P :))
ఎన్నెల గారూ,
ReplyDeleteధన్యవాదాలండీ.
మురళి గారూ,
>>అమెరికా వెళ్ళే చదువు...
అవును..ఇప్పుడు ఇంకా ముందు నుండీ కూడా ఆ సౌలభ్యాన్ని ఇచ్చే డిజీ,టెక్నో స్కూళ్ళు వచ్చేసాయి గా :).. చిరు తిళ్ళ గురించి బాగా చెప్పారు.
SNKR గారూ,
ఏమిటో నండీ, తప్పదు కానీ ఇంత ఒత్తిడి అవసరమా పిల్లలకి..
అవసరం లేదు, కాని తల్లిదండ్రుల ఆదుర్దా, కోచింగ్ సెంటర్ల కక్కుర్తి, ప్రభుత్వం చేతకాని తనం/మూర్ఖత్వం వెరసి పిల్లలకు బాల్యం అనే తీపిగుర్తులు/జ్ఞాపకాలు అలా హరించుకుపోతున్నాయి. వాళ్ళు పెద్దయ్యాక, ఓ సారి వెనక్కు తిరిగి చూసుకుంటే ... నారాయణ/రామయ్య కార్పొరేట్ కోచింగాట/కోతికొమ్మొచ్చిలో కొండొకచో టాయిలెట్లో దూరి ఓ 15నిముషాలు రిలాక్స్ ఐన విధాలు, కడుపునొప్పి నటించి క్లాస్ ఎగ్గొట్టిన విధమూ ఇలాంటి స్వీట్ నథింగ్స్ మాత్రమే వుంటాయేమో... బహుశ.
ReplyDeleteనేనైతే ఇలాంటి వాటి గురించి ప్రయత్నపూర్వకంగా ఆడ్డుకోవాలని ఆలోచించడం మానేశాను... ఇది అవసరమైన నొప్పి. అలాంటి తీయటి జ్ఞాపకాలకి అఫర్డ్ చేయలేని జీవితాలు మనవి!. ఆలోచింపచేసి, నిట్టూర్చేలా చేశారు, గుడ్ ఆర్టికల్ బాగుంది.
SNKR గారూ,
ReplyDeleteబాగా చెప్పారు.బాల్యం అంటే పిల్లలకి గుర్తొచ్చేది అవేనేమో ఇంక. లేదా "కార్పోరేటు" పనిష్మెంట్లు.
మన పిల్లల ఐక్యూ లెవల్స్,ఇంట్రస్టు తెలుసుకునేంత తీరిక లేదు మనకి. అవన్నీ ఆలోచించేసరికి అవతల "మంచి" కాలేజీ లో సీటుండొద్దూ?
టపా నచ్చినందుకు ధన్యవాదాలు.మీ అభినందన ఎంత ఆనందం కలిగించిందో.