Wednesday, March 9, 2011

జర సోచాయించుడ్రి

ఏమిటిదంతా అసలు మార్చ్ లు అదీ ఇదీ అని గొడవ ఓపక్క పిల్లలు పరీక్షలకి సిద్ధమవుతోంటే. అసలే మన చదువులు ఇంటరు పిల్లలకి జీవన్మరణ సమస్య లాంటిది. రెండేళ్ళు కాలేజీల్లో ఎంత తోమినా కానీ పరీక్ష ముందు రోజు ఉండే ఆదుర్దా ఎలాంటిదో మనకి తెలుసు.

రేపు ఏదో మార్చీ ఏప్రిల్లు అంటున్నారు కదా,పిల్లలు పాపం ఎలా వెళ్తారో అని తెలుసున్న ఇద్దరు ముగ్గురిని అడిగాను. ఒకళ్ళేమో పరీక్ష ఉందని తమ పిల్లాడి పరీక్షా కేంద్రం దగ్గరలో గల బంధువుల ఇంటికి వెళ్తున్నామని చెప్పారు. ఇంకొకళ్లకేమో,పరీక్షా కేంద్రం దగ్గర్లో ఎవరూలేరుట.
వాళ్ళ పిల్ల చదువుతున్న స్కూలు వాళ్ళు ముందు రోజు రాత్రికే వచ్చి ఉండమన్నారు,పొద్దున్నే గంట ముందు పరీక్షా కేంద్రానికి తీసుకెళ్తారుట ముందు జాగ్రత్త కోసం అని చెప్పారు.

అసలు పిల్లలని పరీక్షలప్పుడు ఇలా ఇబ్బంది పెట్టడం ఏమి భావ్యం?స్కూల్లో పడుకుని మరునాడు వెళ్ళి పరీక్ష రాయడం అనుకున్నంత తేలిక కాదు.

ఇప్పుడంటే ఆ ప్రొఫెసర్ గారు మాట మార్చి శాంతియుతం గా చేస్తాము,మధ్యాహ్నం చేస్తాము అంటున్నారు కానీ అసలు ముందంతా ఎంత హడావిడి,పైగా తమకి పోలీసుల అనుమతి అక్కర్లేదు ప్రజల అనుమతి ఉంది అనే సుభాషితం ఒకటి ఆయన నోటి నుంది జాలు వారింది.

వీళ్ళు ఇంతకుముందు చేసిన ఆందోళనలవీ చూసిన వాళ్ళేవరైనా, మేము ఇప్పుడు శాంతియుతం గా మార్చ్ నిర్వహిస్తాము
అంటే నమ్ముతారా?ఒక పదిహేను ఇరవై రోజులలో పరీక్షలు పెట్టుకుని,ఇలాంటి వాటికి జిల్లా ల నుండి విద్యార్ధులు కూడా వస్తున్నారంటే వాళ్ళు నిజమైన విద్యార్ధులేన అన్న అనుమానం వస్తోంది.

నాదో సలహా ప్రొఫెసర్ గారికి,వారి అధినాయకుడికీ. హాయిగా మీరు ఈ "మార్చ్" ని "మే' గా మార్చెయ్యండి,అదేనండీ మే లో పెట్టుకోండి,ఈరోజుకి ఏదో తూతూ మంత్రం గా చేసేసి. ఎలాగూ మీరు రేపు వంటా వార్పూ అనీ రోడ్ల మీదే అన్నారు కదా, మే లో అయితే ఎంచక్కా వంట త్వరగా అయిపోయి మీకు బోలెడు ఇంధనం ఆదా. భగ భగ మండే ఎండల్లో మీరు కానీ ఈ మార్చ్ నిర్వహిస్తే మీకు సానుభూతి దక్కి,ప్రజలంతా ఈజిప్టు లో లాగ మీ వెంట కదలడంతో ప్రపంచ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం లో మీ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది.

మే లో రొజంతా పెట్టండి సార్ ఈ కార్యక్రమాన్ని, ప్రజల అనుమతే గా కావాల్సింది మీకు.ఇచ్చెస్తున్నాము తీసుకోండి.

పైగా మే లో విద్యార్ధులందరూ ఖాళీ గా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుని ఉండే సమయం. జర సోచాయించుడ్రి మరి.

1 comments:

  1. గప్పుడు జేస్తే ఎవలొస్తారు? ఎండలో త్యాగాల్ జేయనీకి మేం పాగల్ గాల్ల లక్క కనిపిస్తన్నమా? ఎండకాలం ఎల్టిసి పెట్టుకుని నౌక్రీ చేసేటోళ్ళు తిరగనీకి పోతరు, ఎవరొస్తరన్నా. గేదో ఉద్యమాలు జేస్తేనే మాకింత వసూళ్ళు, జర సంజాయించుకో. పరీచ్చల్దేముంది, తెరాస టీచర్లతో మార్కులేయిస్తం. ఆంద్రోల్లకి ఎక్కువ మార్కులేస్తన్నరు అనగదొక్కుతున్నరు అని లొల్లి జేస్తం, ఎరికయ్యిందా? గదెమరి. ఆంధ్రోల్లకి డేడ్దమాగ్ అనేది.

    ReplyDelete