సామాజిక బాధ్యత అనే తెర అడ్డం పెట్టుకుని బురద చల్లడమే అజెండా గా కార్యక్రమాలు రూపొందించే ఒక తెలుగు ఛానెల్ కి వీక్షకుల సాక్షి గా తమ మీదే బురద పడేసరికి దిమ్మ తిరిగి ఉండాలి పోయిన వారం.
అసలు ఆ ఛానెల్ కీ,బాలీవుడ్/టాలీవుడ్ దర్శకుడికీ ఏమి జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలం తో నిన్న ఇంటర్నెట్ లో వీడియో లు చూసాను.
అసలు వివాదానికి ఆజ్యం పోసిన వీడియో చూడలేదు కానీ ఆ కధనం మీద జవాబు చెప్పేందుకు ఆ ఛానెల్ స్టూడియో కి వచ్చి ఏ మాత్రం తొణకక,బెణకక సమాధానాలిస్తూ ఆ ఛానెల్ యాంకర్ ని మొదటి నిమిషం నుండే డిఫెన్స్ లో పడేసిన ఆ దర్శకుడి వాక్పటిమకి జోహార్లు.
ఈ ఛానెల్లో నాకు సరైన విషయ పరిఙానం ఉన్న న్యూస్ ప్రెజెంటర్లు,చర్చా నిర్వాహకులే కనపడరు. ఒక వేళ ఉన్నా,జుట్లు ముడేయడం తప్ప సరైన మార్గం లో కార్యక్రమమం జరపకూడదు అన్న తమ సంస్థ నియమాలకి లోబడి పనిచేస్తున్నారేమో తెలీదు మరి.
ఇక విషయానికి వస్తే తాము ప్రసారం చేసిన కధనం మీద కేసేసిన సదరు దర్శకుడిని ఛానెల్ కి పిలిచారు. ఈ ఛానెల్లో చర్చ(రచ్చ)లు నిర్వహిస్తూ తానేదో గొప్ప యాంకర్ ని అని భావించే యాంకర్ గారు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత.
మొదట తాము ప్రసారం చేసిన కధనం లో కొన్ని భాగాలని చూపించి చర్చ మొదలెట్టారు.
ఆ తరువాత ఈ దర్శకుడు రాసిన ఒక పుస్తకాన్ని విమర్శిస్తూ, ఒకప్పుడు ఆంగ్ల పుస్తకాలని తెలుగు లో విజయానికి నిచ్చెనలు మెట్లూ అంటూ తర్జుమా చేసేసి పర్సనాలిటీ డెవలపర్ గా అవతరించిన ఒక ప్రసిద్ధ రచయిత గారు ఓ కోతి కధని ఉదాహరణ గా చెప్పారు. అంతా విని దానికి ఈ దర్శకుల వారి సమాధానం ఎలా మొదలెట్టారనౌకున్నారు?
"నాకెందుకో ఆ రచయిత గారి మొహం కోతి లా అనిపించింది ,బహూశా కోతి కధ చెప్పబట్టి కాబోలు" అని అందుకుని ఇక ఆయన శైలి లో కొనసాగి చివాఖరున
"నాకు సలహాలు ఇవ్వకుండా ఆ రచయిత గారు తన పుస్తకాల మీద శ్రద్ధ పెడితే ఆయన బుక్స్ బాగా అమ్ముడవుతాయి" అంటూ ముక్తాయించారు.
ఖంగు తిన్న వ్యాఖ్యాత వెంటనే ఒక ఫిలిం క్రిటిక్ మేధావి ని లైను లోకి తీసుకొచ్చారు.
ఆయనేమో, మీరు చెత్త సినిమాలు తీస్తున్నారు ఎందుకు జనాలని చంపుతారు,శివ సినిమాల్లాంటి హిట్ సినిమాలు ఎందుకు తియ్యరు అని ప్రశ్నించి తానెంత మేధావినో బయటపెట్టుకున్నారు.
అంతా ఆలకించిన దర్శుకుడేమో
"నేను కావాలని ఫ్లాపు సినిమా తియ్యాను. నిజం చెప్పాలంటే ప్రేక్షకుల కంటే మేము ఎక్కువ సమయం,డబ్బు ఖర్చు బెట్టి సినిమా తీస్తున్నాము. ఏదయినా సరే హిట్టవుతుందనే తీస్తాము,మీకు నచ్చలేదా,సరే నేను తీసే మరో సినిమా కి వెళ్ళకండి" అని కుండబద్దలుకొట్తేసాడు.
వెంటనే ఇంకొక మేధావి గారొచ్చారు లైన్లోకి.ఆయన గారేమో ఈ దర్శకుడు కేసెయ్యడం చూసి హాచ్చర్యపోయారు.పైగా,ఏ ఛానెల్ మీద కేసేసారో అదే ఛానెల్ ఆఫీసు కొచ్చి కూర్చోవడం ఎక్కడా చూడలేదుట ఈ మేధావి గారు.
దీనికి ఆ దర్సకుడి సమాధానం ఏంటనుకున్నారు?
" మీరు ఇప్పటివరకు నిద్రపోతున్నారో,వింటున్నారో నాకు తెలీదు కానీ నేను కేసు వేసినది మీ కధనం లో ఉన్న ఒకే ఒక్క లైను మీద అభ్యంతరం వ్యక్తం చేసి. ప్రేక్షకుల గురించి నేనేమనుకుంటున్నానో నా తరపున చెప్పటానికి మీరెవరు?"
ఇంతలో వ్యాఖ్యాత అందుకుని వర్మ గారూ మీరు సినిమాలలో జర్నలిస్టులని నీచాతినీచం గా చూపిస్తారు,మేము కంప్లైంట్ చేస్తున్నామా అనే వేగ్ ఆర్గ్యుమెంటొకటి.
నాలాంటి వాళ్లకి అర్ధమయ్యిందేమిటయ్యా అంటే జర్నలిస్టుల మీద కామెడీ యో సెటైరో పడేసరికి వీళ్ళకి ఒళ్ళుమండింది. ఎన్ని సంవత్సరాలనుండీ పోలీసులని నాయకులనీ నీచం గా చూపట్లేదు సినిమాలలో? ఈ మధ్య కాలం లో టీచర్లు తల్లి తండ్రులు లమీద పెట్టిన కామెడీ ట్రాక్స్ ని ఖండించడానికి వీళ్ళకి నోర్లు రావెందుకు?
ఆద్యంతం ఏ మాత్రం సహనం కోపోకుండా తన వాదనని డెఫెండ్ చేసుకుంటూ, తాను చెప్పల్సినది క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్న దర్శకుడి ప్రతిభ కి ఖంగు తిన్న మన యాంకర్ గారి మొహం చూసి తీరాల్సిందే.
ఇన్ని రోజులూ వీరు నిర్వహించే చర్చలకి రాజకీయ నాయకులో లేదా ఆ ఇజం ఈ ఇజం అంటూ ఆవేశం గా మాట్లాడే నాయకురాళ్ళో వచ్చి ఒకళ్ళమీద ఒకళ్ళు నోర్లు పారేసుకుంటోంటే వినోదించే ఛానెల్ నిర్వాహుకలకి ఇలాంటి మనుషులు ఎదురు పడటం మింగుడు పడని విషయమే.
పూర్తిగా డెఫెన్స్ లోకి వెళ్ళిపోయిన యాంకరు ఇక ఆ దర్శకుడి సినిమాలలో అమ్మాయిలని చూపించే విధానం మీద పడ్దారు.మీకు సామాజిక బాధ్యత లేదా అంటూ."కామ రాజులు-రాసక్రీడలు" లాంటి ప్రోగ్రాం పేర్లు పెట్టి రోజంతా బూతు క్లిప్పింగులని చూపించిన రోజు ఏమయ్యిందో ఈ ఛానెల్ వారి బాధ్యత? అసలే మెరుగైన సంఘం కోసం అనే నినాదం ఒకటి.
ఆ దర్శకుడు క్లియర్ గా చెప్పాడు నేను సందేశాలిస్తే చూడటానికి ఎవ్వరూ రెడీగా లేరు నేను టీచర్నో ఇంకొకరినో కాదు పాఠాలు చెప్పడానికి అంటూ. అయినా అదే ప్రశ్న మీకు బాధ్యత లేదా అంటూ.
అటు చేసి ఇటు చేసి చర్చని ఆ దర్శకుడు తీసిన ఫ్యాక్షన్ సినిమా మీదకి మళ్ళించి వెటకారం గా ప్రశ్నించి కడిగేద్దామనుక్కున యాంకర్ ఆశలు ఆవిరయ్యాయి గొడ్డు కారం లాంటి ఆయన సమాధానాలకి.
మీ సినిమాల వల్ల ఫలాన జిల్లాలో మరలా ఫ్యాక్షన్ హత్యలు జరిగాయి తెలుసా,మీ సినిమాలలో ఎంత హింస ఉందో అని వ్యాఖ్యాత అనగానే నవ్వాగలేదు నాకు.
ఈ దర్శకుడిని సమర్ధించడం కాదు కానీ అసలు ఇంతకుముందు ఫ్యాక్షన్, హింస తో నిండిన సినిమాలే రాలేదా మనకి? వాటిల్లో ఎన్ని సినిమాలని ఆహా ఓహో అని ఈ ఛానెల్ మోసెయ్యలేదూ?
అన్నింటికంటే నాకు నచ్చిన సమాధానం,"నేను సినిమాలో కక్షలని చూపించాను అని,మరచిపోయిన కక్షలని అర్జంటుగా గుర్తు చేసుకుని ఒకళ్ళని ఒకళ్ళు నరుక్కోరు".
తాము చెప్పినదే వేదం అని విర్రవీగి తమకి నచ్చని వారి మీద బురద చల్లే ఛానెళ్ళకి ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇలా ఝలక్కులు ఇస్తే కానీ తాము ఏమి పొరపాటు చేస్తున్నామో తెలుస్తుంది.
వీళ్లడిగే చెత్త ప్రశ్నలకి అంతే ధీటుగా సమాధానాలిచ్చి నన్ను ఆగకుండా నవ్వించిన ఆ దర్శకుడికే ఈ విజిల్సూ,వీరతాళ్ళూ,ఈలలూ,కేకలూ..మరెన్నో. మీకూ ఆ ప్రోగ్రాం నచ్చితే మీరూ ఏదో ఒకటి వెయ్యండి.
నాకు పూర్తి వీడియో దొరకలేదు కానీ. యండమూరి యవ్వారం చూశాను. చాలా చెత్తగా సాగింది. వర్మ కొంచెం స్ట్రాంగ్‌గానే ఇచ్చాడు. యాంఖరుడేమో వర్మ అన్న విషయాన్ని వదిలి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాడు.
ReplyDeleteయూ ట్యూబు లో Ram Dhamaal Varma అని వెతకండి. మొదటి పార్ట్ లేదు కానీ 2-6 భాగాలు ఉన్నాయి.చివరి భాగం ముగింపు లో దర్శకుడు పలికిన పలుకు బంగారం.చూసి చెప్పండి.
ReplyDeleteరిషి, మొత్తానికి ఆ ప్రోగ్రాముని బాగా ఎంజాయ్ చేశారన్నమాట. నేను కో ఇన్సిడెంటల్ గా అప్పలరాజు మూవీకి వెళ్ళాను ఆ టైములో.
ReplyDelete@Indian minerva, ఈ ప్రోగ్రాం అన్ని భాగాలూ యూ ట్యూబులో ఉన్నాయి.
RGV hurt అని వెదికి చూడండి.
థాంక్యూ థాంక్యూ రిషి గారు. మంచి యూ ట్యూబ్ లింక్ లు దొరికాయి :-)
ReplyDeleteప్రభు అనే కామెడీ క్యారెక్టర్ ఎవరు... ఫిల్మ్ క్రిటిక్ అట. :-)
ReplyDeleteరజని కాంత్ అట... కెవ్వు కేక... అసలు ఏమి మాట్లాడుతున్నడొ అతనికే తెలీదు. వర్మ ప్రశ్న కి తన దగ్గర సమాధానం లేకపొతే ప్రభు మీరు ఎమనుకుంటున్నారు అని అతనిమీదకు నెట్టేస్తున్నాడు. ..kevvv
వర్మ మీద నా అభిప్రాయం మారిపొయెట్టుగా ఉంది :D:D
మంచు,
ReplyDeleteకరెక్ట్ లింకులు ఇచ్చింది నేనూ, క్రెడిటేమో రిషి గారికా?:-))
సుజాత గారూ,
ReplyDeleteచూసారా లేదా యూ ట్యూబు లో మిస్సయిన ఈ ప్రోగ్రాం? ఇంతకీ అప్పల్రాజు ఎలా ఉన్నాడండీ..
మంచు గారూ,
అప్పుడప్పుడే మనకి ఇలాంటి అవకాశం వస్తుంటుందండీ..ధన్యవాదాలకి ధన్యవాదాలు.
ఎంత బాగుంది కదా ఈ షో అసలు..ఎన్నాళ్ళనుండో ఇలా టీవీ వాళ్లకి వాతలు పెట్టేవాళ్లకోసం ఎదురుచూసిన నాకు నిన్న తీరింది ఆ కోరిక..మీరూ గమనించారా ఆ దాటవేత ధోరణి?
యాంకర్ స్టూడియో నుండి ఇంపుట్ తీసుకుంటూ లేదా అవసరమయితె ఎవరినో లైన్ లోకి తీసుకొచ్చి తాను పక్కకి తప్పుకోవడం అదీ..
ఎవరి సహకారం లేకుండా ఎంత చక్క గా ఆ దర్శకుడు ఎలా వాతలు పెట్టాడో చూడండి. వీలైతే సాక్షి టీవీ ప్రోగ్రాం కూడా ఉంది యూ ట్యూబు లో అది కూడా చూడండి.
"ప్రేక్షకులు చవటలు" అని నేను అనుకుంటున్నాను అని మీరెలా నిర్ణయిస్తారు? అన్న ప్రశ్న వందసార్లు వర్మ అడిగినా దానికి రజనీ కాంత్ గానీ, మిగతా వాళ్ళు గానీ జవాబు చెప్పకుండా పిచ్చి ఆర్గ్యుమెంట్స్ చేసి ప్రేక్షకులను బాగా నవ్వించారు.
ReplyDeleteరజనీ కాంత్ మొహంలో మారిన రంగులు చాలా బాగున్నాయి. వాటిని కప్పెట్టడానికి వాడిన వెర్రి నవ్వులు ఇంకా బాగున్నాయి.
అప్పలరాజ్ మరీ అన్యాయంగా లేదండీ! ఎందుకంటే వర్మ సినిమా ఇలా ఉంటుంది అని నిర్ణయించుకుని వెళ్ళే ఛాన్స్ వర్మ మనకు ఇవ్వడు కదా!
సుజాత గారు ఇంక RGV Hurt కీవర్డ్ తొ వెతకలేదు. రిషి గారు ఇచ్చిన కీ వర్డ్ దగ్గరే ఉన్నా... ఇప్పుడు మీ కీ వర్డ్ చూస్తున్నా. :-)
ReplyDeleteఒకే ఈ కీవర్డ్ తొ కూడా సేం ప్రొగ్రాం ఉంది ... అయితే... RGV hurt కీవర్డ్ తొ వచ్చిన వీడియాలు వాయిస్ క్లియర్ గా ఉంది
ReplyDeleteఇప్పుడే అవన్నీ చూడటం పూర్తయింది, వర్మ సాధికారికంగా ఆడుకున్నాడు.
ReplyDeleteర.కాం. :ఇది వెటకారమనుకుంటాను
వ్: అవును ఇది వెటకారమే
ఇది హైలైటు.
ప్రభు గురించి అనుకుంటా
వర్మ: ఆయనతో మాట్లాడటం అనవసరం.
ఇండియన్ మినర్వా గారూ,
ReplyDeleteఎంజాయ్ చేసారన్నమాట.నాకు నచ్చిన వీడియో ని ఓ ముగ్గురికి చూపించేసా. మెగాస్టార్ బోధ ని తు.చ. తప్పకుండా పాటించాను :).
రజనీకాంత్ ఒక mediocre జర్నలిస్ట్. పెర్వెర్షన్లు ఉన్నప్పటికీ రామ్ గోపాల్ వర్మేమో క్లారిటీ, కన్విక్షన్ ఉన్న ఇంటలెక్చువల్. మరి పుట్టలో చేయి పెడితే కుట్టకుండా ఉంటాడా ఈ చీ(రా)మ.
ReplyDeleteసుజాత గారూ,
ReplyDelete>>రజనీ కాంత్ మొహంలో మారిన రంగులు చాలా బాగున్నాయి. వాటిని >>కప్పెట్టడానికి వాడిన వెర్రి నవ్వులు ఇంకా బాగున్నాయి.
ఈ లైన్లకి అందుకోండి విజిల్స్,వీరతాళ్ళు.
తేజస్వి గారూ,
:))
వర్మ అడిగిన ఒకే ఒక పాయంటుకు సమాధానం చెప్పలేక, మాట మాటకి "రైట్, ప్రభు " అనో, ఇంకెవరిమీదో తోసేయటం మాత్రం మంచి కామెడీ :)
ReplyDeleteఎటూ దొరికాడు కదా, యండమూరిని మనోరమ హోటల్ ఉదంతం గురించి ఓ సారి వర్మ కెలికితే ఇంకా బాగుండెదేమో!! రజనీకాంత్ కంటే ఇంకా జోకర్ ను అని యండమూరి చాలా కష్టపడినిరూపించుకోవటం మాత్రం బాగుంది :)
యండమూరి మనోరమ హొటెల్ ఉదంతం ఎంటండి? వివరించగలరు
ReplyDelete