Monday, November 29, 2010

ఓ పనైపోయింది



హమ్మయ్య, ఓ పనైపోయింది. మనకి టీవీలలో పదే పదే "వేటా" "లేటా" అనే చర్చలు,"ఎక్స్ క్లూజివ్" కధనాలు చూసే బాధ తప్పింది జగన్ రాజీనామాతో.

జగన్ వేరు కుంపటి పెడతారు అంటున్నారు కదా. ఆ పార్టీ ఎంత కాలం మనగలుగుతుందో అన్నది సందేహమే.ఇంతకుముందు ఎన్ని చీలికలు చూడలేదూ మనము ఇలాంటివి. ఆవేశం లో మన సీతయ్య పెట్టిన "అన్న తెలుగు దేశం",లక్ష్మీ పార్వతి స్థాపించిన పార్టీ అసలు అడ్రస్ లేకుండా పోయాయి.

మన మెగాస్టార్ పార్టీ కంటే హీనమయిపోతుందేమో అన్న సందేహమూ ఉంది నా లాంటి వాళ్ళకి.ఎందుకంటే మన రాజకీయ నాయకులు తక్కెడ లో కప్పల్లాంటి వారు కదా.జగన్ పార్టీ కనుక అవాంతరాలని తట్టుకుని మనగలిగితే నిజం గా అది అధ్భుతమే.

జగన్ ఎపిసొడ్ అయిపోయింది కాబట్టి మీడియాకి మేత ఇంక నూతన మంత్రి వర్గమే.మంత్రి వర్గ ప్రమాణం తరువాత ఓ రెండు రోజుల హడావిడి ఉంటుందేమో అంతే. ఆ తరువాత మన "ఘరానా కూలీ"మీడియా కి కావాల్సినంత మేత అందిస్తూ ఎంచక్కా లైం లైట్ లో ఉండచ్చు.

ఓదార్పు యాత్ర ఇంకా అవ్వలేదు అనుకుంటా కదా,ఈయన కి పార్టీ లో జరిగిన అవమానానికి ఎవరైనా గుండె ఆగి మరణించి ఉంటే?చక్కగా వీళ్ళకోసం కూడా ఓదార్పు "సాగి"స్తూజగన్ కొత్త పార్టీ ఒక రూపు దాల్చే వరకు గడపచ్చు.

ఆయన పార్టీ ఆయన ఇష్టం కానీ ఇప్పుడయినా కాస్త జగన్ కొంచం కొత్తగా ఫొటొ లకి పోజులిస్తే బాగుండు. సెప్టెంబరు 3 2009 నుండీ ఒకటే పోజు చూసీ చూసీ బోరు కొట్టింది.

Monday, November 15, 2010